జూన్ 1న ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం (గ్లోబల్ పేరెంట్స్ డే)
ప్రతి ఏడాది జూన్ 1న ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం(గ్లోబల్ పేరెంట్స్ డే) జరుపుకుంటారు.
పిల్లలు పెద్దవుతున్నకొద్దీ పెద్దవాళ్లు చిన్నపిల్లలుగా మారిపోతుంటారు. ఉద్యోగాలు, వ్యాపారాలు రీత్యా బిడ్డలు వదిలి వెళ్లిపోతుంటే ఒంటరిగా బతకలేక తల్లిదండ్రులు కఠిన పరీక్షలు ఎదుర్కొంటారు. ఈ క్రమంలో వారు పిల్లలతో ఉందామని ఆశపడతారు. కానీ వారి కోరిక నేరవేరదు. దీంతో మానసిక వ్యాధికి గురవుతుంటారు. ఇటువంటివారి వేదనను గుర్తించి ఏడాదిలో ఒక్కరోజైనా వారి ఆశను నేరవేర్చడానికి ఏర్పాటైందే ఈ తల్లిదండ్రుల దినోత్సవం.
చరిత్ర:
ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవాన్ని 2012లో యూఎన్ జనరల్ అసెంబ్లీ తీర్మానం చేసింది. తల్లిదండ్రుల దినోత్సవాన్ని నిర్వహించాలన్న ప్రతిపాదన అమెరికాలో మొదలైంది. 1984లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ అధికారికంగా ఈ దినోత్సవానికి ఆమోద ముద్రవేశారు. దీంతో అప్పటి నుంచి తల్లిదండ్రుల దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు నిర్వహిస్తున్నాయి. వివిధ దేశాల్లో ఈ దినోత్సవాన్ని వేరువేరు తేదిల్లో జరుపుకుంటారు. తల్లిదండ్రుల విషయంలో ఎటువంటి భేదం ఉండకూడదని సుప్రీం కోర్టు ఆదేశించడంతో పేరెంట్స్ డే ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.
ప్రస్తుతం ఈ కోవిడ్ 19 మహమ్మారి సమయంలో తల్లిదండ్రుల తమ పిల్లల విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు, వారి పట్ట వహిస్తున్న శ్రద్ధ అభినందనీయం. అంతేకాదు శ్రామిక కుటుంబాలు ఈ విపత్తు సమయంలో కాలిబాటన తమ సొంత గూటికి వెళ్తున్నప్పుడు వెంట తమ పిల్లలు మరో వైపు లగేజీ ఇంకోవైపు అధిక ఉష్టోగ్రతలను, ఆకలిదప్పులను ఓర్చుకుంటూ ప్రపంచమంతా విస్మయం చెందేలా వారు సాగించిన పయనానికి ప్రభుత్వాలే కదిలి వచ్చేలా చేశారు. ఇలాంటి ఆపద సమయంలో కుటుంబం ఆసరా, తల్లిదండ్రుల తమ పిల్లల పట్ల వహించే బాధ్యతలను, తల్లిదండ్రుల గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజేయడమే కాక గుర్తించేలా చేసింది. ఈ యాంత్రిక జీవనంలో పిల్లలు తమ తల్లిదండ్రులను వృద్ధాప్యంలో వారిని నిర్లక్ష్య చేయకుండా, వృద్ధాశ్రమాలకు తరలించి చేతులు దులుపుకోకుండా వారికి సేవలు చేయడం, మన భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేసిన వారి పట్ల బాధ్యతయుతంగా ఉండేలా చేయడం, అందరూ తమ తల్లిదండ్రులను పేమానురాగాలతో చూసుకునేలా చేయడం మొదలైనవి ఈ దినోత్సవం ముఖ్యోద్దేశాలు.
0 Comments