GET MORE DETAILS

చక్కనైన ఆరోగ్యం మీ సొంతం కావాలంటే...?

 చక్కనైన ఆరోగ్యం మీ సొంతం కావాలంటే...?



ఆరోగ్యమే  అన్నింటికంటే ఎక్కువ  అన్న  విషయం 2020  వరకు  మనకు తెలిసేలా  చేసింది  మన రోగనిరోధక  వ్యవస్థ  బలంగా  ఉంటే  ఎలాంటి  వైరస్లనైనా సదుర్కోగలమని  తెలియజేసింది. రోగనిరోధక  వ్యవస్థ  హానికరమైన వ్యాధుల నుంచి  మనల్ని  కాపాడుతుంది. అయితే రోగనిరోధక  వ్యవస్థని  బలంగా మార్చుకోవడం  ఒక్కరోజులో జరిగే పనికాదు.  క్రమం తప్పకుండా  ఆరోగ్యమైన  జీవనశైలిని  అలవాటు  చేసుకుంటే ఇది  సాధ్యమవుతుంది. దీర్ఘకాలం  ఆరోగ్యంగా  జీవించాలంటే  చెడు  అలవాట్లకు  దూరంగా ఉండాలి. చెడు  అలవాట్లు  ఆరోగ్యాన్ని  బాగా  దెబ్బతీస్తాయి.  మంచి అలవాట్లు మీ  రోగనిరోధక శక్తిని  బలోపేతం  చేయడంలో   మనకు  ఆరోగ్యం  సమకూర్చడంలో  సహావపడతాయని  గుర్తుంచుకోవాలి.  దీర్ఘకాలం  మెరుగైన  ఆరోగ్యంతో  జీవించాలంటే  ఈ కింది అలవాట్లను  క్రమం  తప్పకుండా  పాటించండి.

1) తరచుగా వ్యాయామం చేయండి :

వ్యాయామం  మనల్ని  రోజంతా  ఉల్లాసంగా  ఉండేలా       చేస్తుంది.  మెరుగైన  ఆరోగ్యం  కోసం  క్రమం  తప్పకుండా  వ్యాయామం  చేయాలి.  మెరుగైన ఆరోగ్యం కోసం శారీకంగా,  మానసికంగా  చురుగ్గా ఉండటం చాలా ముఖ్యం.  ఇండీకు ఉదయం, సాయంత్రం  వాకింగ్, వ్యాయామం  చేయడం  పెరయోజనకరంగా  ఉంటుంది.  వీటితో  పాటు  యోగా,  ప్రాణాయామాలు  చేయండి.  తద్వారా  మనకు  మానసిక  ప్రశాంతత  చేకూరుతుంది.

2) ఒత్తిడికి లోనవ్వకండి :

ఎక్కువ  ఒత్తిడి  మన  మానసిక  ఆరోగ్యాన్ని  దెబ్బతీస్తుంది. మొదట్లో  ఇది  మానసిక ఆరోగ్యం పై ప్రభావం చూపి,  క్రమంగా  శారీరక  ఆరోగ్యానికి  కూడా  తీవ్ర  నష్టం  కలిగిస్తుంది.

ఒత్తిడి, ఆందోళనను  ఎలా  తగ్గించుకోవాలి ?

నిరాశకు  లోనైనప్పుడు  దాని నుంచి ఎలా  బయటపడాలి ?

మానసిక  స్థితిని  ఎలా మెరుగుగుపర్చుకోవాలి ?

అనే  విషయాలపై  అవగాహన  పెంచుచుకోవాలి.  మన  రోజు  వారి  ఒత్తిడిని ఎలా  ఎదుర్కోవాలో  తెలుసుకోవడం   కూడా చాలా  ముఖ్యం.

3) బ్రేక్ ఫాస్ట్ మానేయొద్దు :

ఉదయాన్నే  బ్రేక్ ఫాస్ట్  చేయడాన్ని  ఏ  పరిస్థితిలోనైనా  మానేయకూడదు.  ఎందుకంటే   బ్రేక్ ఫాస్ట్  మనల్ని  రోజంతా  యాక్టివ్ గా,  ఆరోగ్యాంగా  ఉంచుతుంది.  ఇతర  భోజనంతో  పోలిస్తే  ఉదయం  బ్రేక్ ఫాస్ట్  తీసుకోవడం  చాలా  అవసరం.  ఎందుకంటే  రాత్రంతా  శరీరానికి  ఆహారం  అందక  పోషకాలన్నీ  అయిపోయే స్థితిలో  ఉంటాయి.  ఇలాంటి  సమయంలో  ఎక్కువ  పోషకాలతో  నిండిన  బ్రేక్ ఫాస్ట్ ని  తీసుకోవడం  వల్ల  రోజంతా  చురుగ్గా  ఉండవచ్చు.

4) నిద్రకు ప్రాధాన్యం ఇవ్వండి :

మెరుగైన ఆరోగ్యం కోసం రోజూ  సరిపడా  నిద్రపోవడం  తప్పనిసరి.  ప్రతిరిజూ  కనీసం 6 నుంచి  8 గంటలు నిద్రపోవాలని  వైద్యులు సలహాలిస్తారు.  రాత్రి  ఆలస్యం  చేయకుండా  నిద్రపోయి  ఉదయాన్నే  లేచే  వారిలో  హార్మోన్లు  ఎప్పుడూ  సమతుల    స్థాయిలో   ఉంటాయి.  తద్వారా  మనలోని  ఒత్తిడి  ఆందోళన  తగ్గుతాయి.  సరైన  నిద్ర  లేకపోతే  ఆరోజంతా   నీరసంగా,  ఆందోళనకరంగా  ఉంటాము.  ఇది మన  శారీరక,   మానసిక  ఆరోగ్యాన్ని  ప్రభావితం  చేస్తుంది.  రాత్రి  10 నుంచి  11 దాటక  ముందే నిద్రపోవడం  మంచిది.  నిద్రకు  కొన్ని  గంటల  ముందే  భోజనం   చేయడం  వల్ల  ప్రశాంతంగా  నిద్రపోవచ్చు.

5) మంచి ఆహారం తీసుకోండి :

ఆరోగ్యంగా  ఉండడానికి తప్పనిసరిగా  మంచి  పోషకాలున్న  ఆహారాన్నే  తీసుకోండి.  సమతుల్య  ఆహారం  మన  శరీరానికి  అవసరమైన  అన్ని  పోషకాలను  అందిస్తుంది.  మన  శరీరం,  మనసు  సజావుగా  పనిచేయడానికి  మనం  తీసుకునే  ఆహారం  పట్ల  తప్పనిసరిగా  శ్రద్ధ  వహించాలి.  మన  జీవనశైలిని   మెరుగుపర్చడానికి  మనం  తీసుకునే  ఆహారం  ముఖ్య  పాత్ర  వహిస్తుందని  గుర్తుంచుకోండి.

Post a Comment

0 Comments