GET MORE DETAILS

తెలంగాణ కొల్లాపూర్ బరిలో 'బర్రెలక్క'. 7 అంశాల 'మేనిఫెస్టో'

తెలంగాణ కొల్లాపూర్ బరిలో 'బర్రెలక్క'. 7 అంశాల 'మేనిఫెస్టో'


కొల్లాపూర్ లో హేమా హేమీలతో తలపడుతున్న పేద నిరుద్యోగ 25 యేళ్ళ దళిత యువతి



  తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించి సోషల్ మీడియాలో తెగ ఫైమస్ అయిన బర్రెలక్క(శిరీష) కొల్లాపూర్ నుంచి పోటీ చేస్తోంది.

  నామినేషన్ వేసే నాటి నుంచి ఇవాళ్టి వరకు ప్రధాన పార్టీలకు సవాల్ విసురుతోంది. నిరుద్యోగుల తరపున బరిలో ఉన్నానని చెబుతూ…అందరి దృష్టిని ఆకర్షిస్తున్న బర్రెలక్క టాక్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్ గా మారింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న ఆమెకు అనేక ప్రాంతాల వారు మద్దతుగా నిలుస్తున్నారు.

  కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేస్తోంది బర్రెలక్క. అయితే ఆమెకు విజిల్ గుర్తు కేటాయించింది ఈసీ. ఇక నిరుద్యోగుల తరపున బరిలో శిరీషకు పలు ప్రజాసంఘాలతో పాటు విద్యార్థి సంఘాల నేతలు, నిరుద్యోగులు మద్ధతు పలికుతున్నారు. జానపద కళాకారులు కూడా సపోర్టు ఇస్తున్నారు. మహిళల నుంచి మంచి స్పందన కూడా లభిస్తోంది. ఇక కొల్లాపూర్ లో తనను గెలిపిస్తే ఏం చేస్తాననే అనే విషయంపై కూడా క్లారిటీతో ఉంది శిరీష. ఇందుకోసం తక్కువ అంశాలతో మేనిఫెస్టోను ప్రకటించింది. మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తోంది.

మేనిఫెస్టోలోని అంశాలివే...

1. ఎమ్మెల్యే గెలిస్తే నిరుద్యోగుల అంశంపై అసెంబ్లీలో ప్రశ్నిస్తా. సరైన సమయంలో నోటిఫికేషన్లు వచ్చేలా మాట్లాడుతాను.

2.పేదవారికి ఇండ్ల నిర్మాణం.

3.ఆర్టికల్ 41 ప్రకారం నిరుద్యోగులకు భృతి ఇప్పిస్తాను.

4.ప్రతి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు.

5.ఉచిచ విద్య, వైద్యం ఇవ్వడానికి పాటుపడుతాను.

6.నిరుద్యోగులకు ప్రత్యేక కోర్సులు - ఫ్రీ కోచింగ్.

7 యువత ఉన్నత చదువులకు ఉచిత కోచింగ్ ఇవ్వడంతో పాటు అండగా ఉంటాను.

ఎవరీ శిరీషా…?

  నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మరికల్ గ్రామానికి చెందిన కర్నె శిరీష.. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసింది. ఎన్ని డిగ్రీలు చదివినా ప్రభుత్వ ఉద్యోగాలు రావడం లేదని, అందుకే బర్లు కాసుకుంటున్నానని తీసిన వీడియోతో వార్తల్లోకి ఎక్కింది శిరీషా. బర్లు కాసుకుంటున్న వీడియోతో బర్రెలక్కగా పేరొందిన శిరీషా… సోషల్ మీడియాలో తెగ ఫేమ్ సంపాదించింది. తన ఇంటర్వూలతో కూడా వార్తల్లో నిలిచింది. ఓ దశలో ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ కూడా జరిగింది. అయితే ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో…. అనూహ్యంగా ఆమె నిరుద్యోగుల ప్రతినిధిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఇప్పుడు ఇదే కొల్లాపూర్ రాజకీయాల్లో ఆసక్తికరమైన అంశంగా మారింది.

   కొల్లాపూర్ బరిలో నిల్చున్న బర్రెలక్క అలియాస్ శిరిషకు మద్దతుగా కూడా ఓ ప్రచార పాట విడుదలైంది. నిరుద్యోగులను జాగృతం చేసేలా రూపొందించిన ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. 'కదిలే ఓ అడుగు…యువతకు నువ్వు వెలుగు…కదిలింది మన బర్రెలక్క అదిగో లేవరా యువత'' అంటూ సాగుతున్న పాటకు మంచి ఆదరణ లభిస్తోంది.

Post a Comment

0 Comments