GET MORE DETAILS

ఆధార్ ‘పుట్టిన తేదీ’ చెల్లదు! యూఐడీఏఐ కీలక నిర్ణయం ?

 ఆధార్ ‘పుట్టిన తేదీ’ చెల్లదు! యూఐడీఏఐ కీలక నిర్ణయం ?



 ఎన్నికల వేళ ఆధార్ జారీ సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. పుట్టిన తేదీ ధ్రువీకరణకు ఇక నుంచి ఆధార్ చెల్లదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇక నుంచి జారీ చేస్తున్న ఆధార్ కార్డుల్లో ఈ విషయాన్ని కార్డుపైనే పేర్కొంటోంది. శుక్రవారం నుంచి కొత్తగా ఆధార్ కార్డు ప్రింట్ తీసుకునే వారందరికీ కార్డుపై 'ఆధార్ అనేది గుర్తింపు రుజువు మాత్రమే. పౌర సత్వం లేదా పుట్టినతేదీకి కాదు' అని ప్రచురితమై వస్తోంది. గతంలో సన్ ఆఫ్, డాటర్ ఆఫ్, వైఫ్ ఆఫ్.. అని బంధుత్వం కూడా ఉండగా.. రెండేళ్ల కింద తొలగించి దాని స్థానంలో కేరాఫ్ అని ప్రచురిస్తోంది.

Post a Comment

0 Comments