నవగ్రహాలలో రాజు "రవి" : శ్రీ మేధా విజయ కార్తికేయ జ్యోతిష్యాలయం - గురూజీ దినేష్ కార్తికేయ సెల్ : 95537 34194
వ్యక్తిగత జాతక చక్రంలో రవి బలహీనంగా ఉంటే వారికి అనారోగ్యము , అధికారుల నుండి వేధింపులు , తండ్రి లేదా పుత్రుల నుండి వ్యతిరేఖత , నేత్ర , గుండె సంబంధ వ్యాధులు , తండ్రి తరఫున బంధువులతో పడకపోవడం, ఏదైనా సాధించాలనే పట్టుదల లేకపోవడం , ఆత్మవిశ్వాసం లేకపోవడం , ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి.
రవికి తల్లి అతిధి, తండ్రి కశ్యపుడు. భార్యలు ఉష, ఛాయాదేవి. జాతక చక్రంలో రవి సింహరాశికి అధిపతి. మేషరాశిలో రవి ఉచ్ఛస్థితిని, తుల రాశిలో నీచ స్థితిని పొందడం జరుగుతుంది.
• జాతకంలో రవి బలంగా ఉంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది.
• రవి పై పాపగ్రహాల దృష్టి పడకూడదు.
• పితృదేవతలను దూషిస్తే రవికి కోపం వస్తుంది.
• రవి నమస్కారప్రియుడు, తర్పణ గ్రహీత, సూర్యునికి ఎదురుగా మల, మూత్ర విసర్జన, దంతావధీనం చేయరాదు.
• రవి బలం పెరుగుట కొరకు ఆదిత్యహృదయం పారాయణం చేయుట, సూర్యాష్టకం పారాయణ,
• రవి గ్రహానికి 6000 జపం చేయించి గోధుమలు దానం ఇవ్వడం వలన మంచి ఫలితం ఉండును.
• అంతేకాకుండా స్నానం చేసే నీటిలో కుంకుమపువ్వు, ఎర్రని పూలు వేసుకొని స్నానం చేస్తే రవిదోషం తగ్గును.
• తండ్రిని, తండ్రి సమానమైన వారిని గౌరవించడం వలన రవి దోష తీవ్రత తగ్గి అభివృద్ధి కలుగును.
రవి యొక్క ధ్యాన శ్లోకం:
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్.
తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్.
జపాకుసుమ - దాసన చెట్టు పువ్వు రంగులో,
సంకాశం - సమానమైన వాడు,
కాశ్యపేయం - కశ్యపు వంశంలో జన్మించినవాడు,
మహాద్యుతిమ్ - గొప్ప కాంతి కలిగినవాడు,
తమోరిమ్ - చీకటికి శత్రువు,
సర్వ పాపఘ్నం- అన్ని పాపాలు పోగొట్టేవాడు అయిన,
దివాకరమ్- సూర్యభగవానునికి,
ప్రణతోస్మి - నమస్కరిస్తున్నాను.
0 Comments