GET MORE DETAILS

ముంచుకొస్తున్న ‘మిచాంగ్’ తుపాను. ఇప్పుడు తుఫాను ఎక్కడ ఉందో చూడాలనుకుంటున్నారా...?

ముంచుకొస్తున్న ‘మిచాంగ్’ తుపాను. ఇప్పుడు తుఫాను ఎక్కడ ఉందో చూడాలనుకుంటున్నారా...?


➤ ఏపీకి భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక

➤ రేపు తుపానుగా మారనున్న తీవ్ర వాయుగుండం

➤ నెల్లూరు - మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం

➤ తుపాను తీరం దాటే సమయంలో 100 కిలోమీటర్ల వేగంతో గాలులు

➤ మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరిక 

➤ తుపాను నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అలర్ట్



 బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం రేపు తుపానుగా మారనుంది. తుపాను నేపథ్యంలో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, పిడుగులు కూడా పడే అవకాశం ఉందని చెప్పారు. మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రస్తుతం వాయుగుండం నెల్లూరుకు 860 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 910 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. నెల్లూరు - మచిలీపట్నం మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో సముద్ర తీరంలో అలలు ఎగసిపడతాయని, 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు.

అప్రమత్తమైన ప్రభుత్వం : భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమయింది. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి తుపానుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్ రెడ్డి మాట్లాడుతూ తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశామని చెప్పారు. జిల్లాల స్థాయిలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశామని తెలిపారు. మరోవైపు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సన్నద్ధమయ్యాయి. నౌకలను, అత్యవసర సామగ్రిని నౌకాదళ కమాండ్ సిద్ధం చేసింది. తుపాను తీవ్రత ఎక్కువగా ఉండే జిల్లాల్లో నిత్యావసర సరకులకు లోటు రాకుండా పౌరసరఫరాల విభాగం చర్యలు తీసుకుంటోంది.

డిసెంబర్ 4 సాయంత్రం 'మిచాంగ్' తుఫాను చెన్నై-మచిలీపట్నం మధ్య దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ను ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు వదంద తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) అంచనా వేసింది. తుఫాను కారణంగా తిరువళ్లూరులో భారీ వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఉదయం (శనివారం) అల్పపీడనంగా కేంద్రీకృతమై చెన్నైకి ఆగ్నేయ నుంచి 790 కి.మీ దూరంలో ఉంది.  తాజాగా వాయువ్య దిశలో కదిలే అవకాశం ఉందని, ఇది రేపటి తీవ్ర అల్పపీడనంగా మారి తుఫానుగా తీవ్రమవుతుంది. డిసెంబర్ 4 నాటికి చెన్నై, మచిలీపట్నం మధ్య దాటుతుందని వాతావరణ అధికారులు భావిస్తున్నారు. దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడులో వచ్చే నాలుగు రోజులు, ప్రధాన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. డెల్టా జిల్లాల్లో డిసెంబర్ 1, 2 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, డిసెంబర్ 3న తిరువళ్లూరు నుంచి మైలదుత్తురై ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, పక్కనే ఉన్న వేలూరు, తిరువణ్ణామలై, కళ్లకురిచ్చి, పెరంబూర్, తంజావూరు, తిరువారూర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. డిసెంబర్ 4న తిరువళ్లూరులో అతి భారీ వర్షాలు కురుస్తాయని, చెన్నై, కాంచీపురం, రాణిపేట్, వెల్లూరు, తిరుపత్తూరు, తిరువణ్ణామలై, చెంగల్‌పట్టులో భారీ నుంచి అతి భారీ వర్షాలు, విలుపురం, కళ్లకురిచిలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

తుపాను పట్ల అప్రమత్తంగా ఉండండి: సీఎం జగన్‌:

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కాస్తా తీవ్ర వాయుగుండంగా మారి రేపటికి(ఆదివారం) తుపానుగా మారే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.

మిచాంగ్‌ తుపానుగా నామకరణం చేసిన ఈ తుపాను.. ఈ నెల 4వ తేదీన ఏపీలోని నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉండటంతో అధికారులంతా సన్నద్ధంగా ఉండాలన్నారు సీఎం జగన్‌. ఈ మేరకు తుపాను పరిస్థితులపై సీఎం జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా తుపాను పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు సీఎం జగన్‌. ‘తుపాను పట్ల అప్రమత్తంగా ఉండండి. సహాయక చర్యల్లో ఎలాంటి లోటూ రాకూడదు. తుపాను పరిస్థితులు నేపథ్యంలో అన్నిరకాల చర్యలు తీసుకోవాలి. సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభావిత జిల్లాల కలెక్టర్లు సర్వసన్నద్ధంగా ఉండాలి.

కరెంటు, రవాణా వ్యవస్థలకు అంతరాయాలు ఏర్పడితే వెంటనే వాటిని పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. తుపాను ప్రభావం అధికంగా ఉన్న తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. అవసరమైన చోట సహాయశిబిరాలు ఏర్పాటు చేయాలి.రక్షిత తాగునీరు, ఆహారం, పాలు శిబిరాల్లో ఏర్పాటు చేసుకోవాలి. ఆరోగ్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసుకోవాలి’ అని  సీఎం జగన్‌ ఆదేశించారు.

ఎనిమిది జిల్లాలకు నిధులు విడుదల చేసింది సీఎం జగన్‌ ప్రభుత్వం.  తిరుపతి జిల్లాకు రూ. 2 కోట్ల నిధులు,  నెల్లూరు, ప్రకాశం. బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, అంబేద్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాలకు రూ. 1 కోటి చొప్పున నిధులు విడుదల చేశారు.


ఇప్పుడు తుఫాను ఎక్కడ ఉందో చూడాలనుకుంటున్నారా...? CLICK HERE

Post a Comment

0 Comments