GET MORE DETAILS

మధుమేహానికి విరుగుడు మునగాకు

 మధుమేహానికి విరుగుడు మునగాకు



వంటలకు ఘుమఘుమలను అందించే మునక్కాయలంటే ఇష్టం లేనిది ఎవరికి చెప్పండి. చారు, సాంబారు, పులుసుల వంటి వంటకాలలో మునక్కాయలను ఉపయోగించడం వలన రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. అయితే మునక్కాయలతోనే కాక మునగాకు, పువ్వులను కూడా వంటలలో ఉపయోగించవచ్చు. అమ్మమ్మల కాలంలో ఆషాఢమాసం వచ్చిందంటే మునగాకు కూర తప్పనిసరిగా ఇంట్లో ఉంటుంది. కాని ఈ కాలంలోని వారికి మునగాకుతో వంటకాల గురించి తెలిసింది తక్కువే. కాని దీనిలో బోలెడు పోషకాలున్నాయి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, ప్రోటీన్లు సమృద్ధిగా ఉన్నాయని పోషకాహార నిపుణులు అంటున్నారు.

మధుమేహం ఉన్నవారికి మునగాకు దివ్యౌషధం. రక్తంలోని చక్కెర స్థాయిలను నమతుల్యం చేయడమే కాక, మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. అంతేకాక, మానసికపరమైన ఆందోళనను, తలనొప్పిని, ఊపిరితిత్తుల వ్యాధులను, కీళ్ళనొప్పులను తగ్గించే శక్తి మునగాకుకు ఉంది. అందుకే రోజువారి ఆహారంలో మునగాకును చేర్చుకోవడం ఉత్తమం. ఈ మునగాకును కరివేపాకు ప్రత్యామ్మాయంగా కూడా కూరలలో వాడుకోవచ్చు. మునగాకు పప్పు, పచ్చడి, నువ్వులతో కలిపి పొడి లాంటి ఎన్నో వంటకాలను చేసుకోవచ్చు. మరి ఈనెలలో లేత మునగాకు దొరుకుతుంది. మరి తప్పకుండా మీ ఉపయోగిస్తారు కదూ. వంటకాలలో

Post a Comment

0 Comments