డాక్టర్ జాకీర్ హుస్సేన్ దేశానికి అందించిన సేవలు అమోఘం ఆయన కీర్తి అజరామరంజననం 08-02-1897 మరణం 03-05-1969
భారతరత్న 3వ రాష్ట్రపతిగా మరియు తన సంపదనంతా భారతదేశానికి ధారాదత్తం చేసిన గొప్ప దానకర్ణుడిగా భారతదేశం నా ఇల్లు, ప్రజలందరూ నా కుటుంబం" అని చెప్పిన గొప్ప దేశభక్తుడు డా: జాకిర్ హుస్సేన్ ఆయన 1897 ఫిబ్రవరి 8న హైదరాబాదులో జన్మించారు
అతి చిన్న వయసులో 23 సంవత్సరాల వయస్సులో ఢిల్లీ దగ్గర జాతీయ ముస్లిం విశ్వవిద్యాలయాన్ని స్థాపించి, దానికి జామియా మిల్లియా ఇస్లామియా అనే పేరు పెట్టారు
బ్రిటిష్ వారితో పోరాటానికి మహాత్మా గాంధీతో కలిసి నడిచారు "బేసిక్ విద్య" పై కఠోర ప్రయత్నాలు చేసి భారతదేశంలో విద్యాభ్యుదయానికి శ్రమించారు ఉత్తమ దార్శనికుడిగా భారత విద్యావిభాగ మార్గదర్శకునిగా గుర్తింపు పొందారు
స్వాతంత్ర్యం తరువాత అలీఘర్ ముస్లిం యూనివర్శిటి వైస్ ఛాన్సలర్ పదవి అలంకరించారు వైస్ ఛాన్సలర్ పదవీకాలం ముగిసిన తరువాత 1956 లో పార్లమెంటు సభ్యునిగా నామినేట్ చేయబడ్డారు 1957లో బీహారు గవర్నరుగా తన సేవలను అందించారు.
ఉప రాష్ట్రపతిగా తదనంతరం భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అత్యల్పకాలం రాష్ట్రపతి పదవి నిర్వహించిన మొదటి వ్యక్తి రాష్ట్రపతి పదవిలో ఉండగా మరణించిన తొలి వ్యక్తి కూడా ఆయనే
ఈయన చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం 1963 లో ‘భారతరత్న’ పురస్కారాన్ని అందించి సత్కరించింది.
0 Comments