GET MORE DETAILS

ప్లేట్లెట్స్ అంటే ఏమిటి ? ఎందుకు తగ్గుతాయి ? ప్లేట్లెట్స్ ఎవరికి, ఎప్పుడు ఎక్కించాలి ?

ప్లేట్లెట్స్ అంటే ఏమిటి ? ఎందుకు తగ్గుతాయి ? ప్లేట్లెట్స్ ఎవరికి, ఎప్పుడు ఎక్కించాలి ?



మా అబ్బాయి వయసు తొమ్మిదేళ్లు. ఈమధ్య వైరల్ ఫీవర్ తో చాలా ఇబ్బంది పడ్డాడు. ప్లేట్లెట్స్ తగ్గాయ న్నారు. హైదరాబాద్ తీసుకుపోయి ప్లేట్లెట్స్ ఎక్కించి వైద్యం చేసిన నాలుగైదు రోజులకు ఆరోగ్యం మెరుగుపడింది. అసలీ ప్లేట్లెట్స్ అంటే ఏమిటి? అవెందుకు తగ్గుతాయి? ప్లేట్లెట్స్ తగ్గినట్లు ఎలా తెలుస్తుంది? దయచేసి వివరంగా తెలియజేయండి.

- జి. యాదగిరి, ఆలేరు

రక్తకణాల్లో ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్లెట్స్ అని ప్రధానంగా మూడు రకాల కణాలు ఉంటాయి. ఈ మూడూ ఎముక మజ్జ (బోన్ మారో) నుంచి ఉత్పత్తి అవుతాయి. తెల్ల రక్తకణాలు వ్యాధి నిరోధకాలుగా పనిచేస్తూ, శరీరం రోగాలమయం కాకుండా కాపాడుతుంటాయి. ఎర్రరక్తకణాల్లో ఉండే హిమోగ్లోబిన్ ద్వారా శరీరం మొత్తానికి అవసరమైన ఆక్సిజన్ అందుతుంది. ఇక మిగిలినవి ప్లేట్లెట్స్. శరీరానికి గాయం అయినప్పుడు రక్తం గడ్డకట్టడానికి అవి తోడ్పడతాయి. ఇవి ప్రతి వ్యక్తిలోనూ ఒకే విధంగా ఉండాలని లేదు. సాధారణంగా ఒక వ్యక్తిలో ఇవి 1.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకు ఉంటాయి. పైగా ఇవి ఒక్కోరోజు ఒక్కోలా ఉండవచ్చు. ప్లేట్ లెట్ కణం జీవిత కాలం ఏడు నుంచి పదిరోజుల వరకు ఉంటుంది. ఆ తర్వాత అవి చనిపోతాయి. ఎముక మజ్జలో ఏర్పడిన కొత్త ప్లేట్లెట్స్ మళ్లీ రక్తంలో చేరతాయి. ప్లేట్లెట్స్ విధుల్లో ముఖ్యమైనది రక్తస్రావాన్ని నివారించడం. శరీరానికి గాయమైనపు పడు కాసేపు రక్తం స్రవిస్తుంది. ఆ తర్వాత దానం తట అదే ఆగిపోతుంది. ఈ ప్రక్రియ వెనక రక్తనాళం, ప్లేట్ లెట్లు, రక్తం గడ్డకట్టే వ్యవస్థల పాత్ర చాలా కీలక మైనది. ఇలా రక్తాన్ని గడ్డకట్టించడం ద్వారా ప్రాణర క్షణ కలిగించే కీలకమైన కణాలే ప్లేట్లెట్స్, శరీరంలో ప్లేట్లెట్స్ తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. డెంగ్యూ, మలేరియా, వైరల్ ఇన్ఫెక్షన్స్ తదితర కారణాల వల్ల శరీరంలో ప్లేట్లెట్స్ తగ్గు తాయి. దాంతోపాటు కొంతమందిలో ప్లేట్ లెట్ల ఉత్పత్తి తక్కువగా ఉండటానికి కారణం వారిలో పుట్టుకతో ఉండే లోపాలే. కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల మందులు వాడటం వల్ల కూడా ప్లేట్లెట్ల సంఖ్య తగ్గుతుంది. గుండెసంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు రక్తం పలుచబడటానికి వాడే మందుల వల్ల కొందరిలో ప్లేట్లెట్ల సంఖ్య, నాణ్యత తగ్గిపోయే అవకాశం ఉంది. శరీరంలో ప్లేట్లెట్స్ మరీ తక్కువగా ఉన్నప్పుడు ఏ గాయమూ లేకపో యినా రక్తస్రావం అవుతుంది. ప్లేట్ లెట్లు తమ విధిని సక్రమంగా నిర్వర్తించలేకపోతే రక్తస్రావం దలేకపోతే రక్తస్రావం ఆగదు. దానికి ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోవడం గానీ, ప్లేట్ లెట్ల నాణ్యత తగ్గిపోవడంగానీ కారణం కావచ్చు. ప్లేట్ లెట్ల సంఖ్య సాధారణంగానే ఉన్నా అవి నాణ్యంగా లేకపోతే రక్తస్రావం ఆగదు.

ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గితే కనిపించే లక్షణాలు:

సాధారణంగా ప్లేట్ లెట్ల సంఖ్య పదివేలకు తగ్గే వరకు ఏలాంటి లక్షణాలూ కనిపించవు. ఒకవేళ అంతకన్నా తగ్గితే మాత్రం శరీరంలోని వివిధ అవ యవాల్లోని లోపలి పొరల్లోంచి రక్తస్రావం మొదలవు తుంది. నోటి లోపలి పార, చిగుర్లు, ముక్కు లోపలి పారల్లోంచి రక్తస్రావం కావచ్చు. ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిన ప్రతిఒక్కరిలోనూ అనారోగ్య లక్షణాలు కని పించాలని లేదు. కొందరిలో ఏ లక్షణాలు కనిపిం చవు. ముఖ్యంగా డెంగ్యూ ఉన్నప్పుడు తీవ్ర జ్వరం ఉంటుంది. వ్యాధి లక్షణాలన్నీ ఉంటాయి. తీవ్రమైన జ్వరం, ఒళ్లునొప్పులు ఉంటాయి. అలాంటప్పుడు ప్లేట్లెట్ల సంఖ్య ఎంత ఉందో పరీక్షించి, వైద్యప రంగా తగిన చర్యలు, జాగ్రత్తలు తీసుకుంటారు.

ప్లేట్లెట్స్ ఎవరికి, ఎప్పుడు ఎక్కించాలి ?

ఈమధ్య ఎవరికైనా జ్వరం వస్తే వైరల్ ఫీవరని హాస్పిటల్లో అడ్మిట్ చేసి, ప్లేట్లెట్స్ ఎక్కించేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనే అనుమానం ప్రజల్లో ఉంటోంది. అసలు ప్లేట్లెట్స్ ఎవరికి ఎక్కించాలి? ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కించాలి? వివరంగా చెప్పండి.

- ఆర్.సుబ్బారెడ్డి, అనంతపురం

శరీరంలో ప్లేట్లెట్లు ఏమాత్రం తగ్గినా వెంటనే ప్లేట్లెట్లు ఎక్కించాలనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అది సరికాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ) మార్గదర్శకాల ప్రకారం ప్లేట్ లెట్ల సంఖ్య పదివేల కంటే తగ్గితేగానీ వాటిని ఎక్కిం చకూడదు. ఒకవేళ పదివేల కన్నా ఎక్కువగా ఉండి రక్తస్రావం అవుతుంటే మాత్రం ప్లేట్లెట్లు ఎక్కిం చాల్సి ఉంటుంది. శరీరానికి సహజంగానే తగ్గిపో యిన ప్లేట్లెట్స్ను తిరిగి ఉత్పత్తి చేసుకునే శక్తి ఉంటుంది. అందుకే అత్యవసర సమయాల్లో మాత్రమే ప్లేట్లెట్స్ ఎక్కించాలి.

సరైన వ్యాధి నిర్ధారణ అవసరం:

శరీరంలో ప్లేట్లెట్ల సంఖ్య ఎందుకు తగ్గుతుం దనే అంశంపై సరైన వ్యాధి నిర్ధారణ జరిగితే చికిత్స సులువవుతుంది. డెంగ్యూ కారణంగా కొందరిలో ప్లేట్లెట్ల సంఖ్య చాలా వేగంగా పడిపోతూ ఉంటుంది. వీరికి డెంగ్యూ చికిత్సతో పాటు అవస రాన్ని బట్టి ప్లేట్లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా ప్లేట్లెట్ల సంఖ్య పడిపోతే వారం పదిరో జుల్లో ఆ పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది. మలేరియా కారణంగా ప్లేట్లెట్లు పడిపోతే మలేరియాకే చికిత్స అందిం చాలి. ఏవైనా మందుల కార ణంగా ప్లేట్ లెట్లు పడిపోతూ ఉంటే వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ, ఆ మందులు మానే యాల్సి ఉంటుంది. ముందు ప్లేట్లెట్లు పడిపోవడా నికి సరైన కారణం తెలుసుకుని చికిత్స చేయించుకో వాలి.

అందుబాటులో అత్యాధునిక చికిత్సా విధానాలు:

శరీరంలో ఏ కారణంతో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గినా ఇప్పుడు మెరుగైన వైద్యం అందించగలుగుతున్నారు. గతంలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గితే రోగులు చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉండేది. కానీ అందివస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఇప్పుడు అత్యాధునిక విధానాల్లో చికిత్స అందిస్తుండటం వల్ల చాలా మందిని ప్రాణాపాయం నుంచి రక్షించగలుగుతు న్నారు. రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గితే దాత నుంచి లేదా సేకరించిన రక్తం నుంచి కేవలం ప్లేట్లెట్లను మాత్రమే వేరుచేసి ఎక్కించే అధునాతన సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. సింగిల్ డోనార్ ప్లేట్ లెట్స్ (ఎస్ఎపీ), రాండమ్ డోనార్ ప్లేట్లెట్స్ (ఆర్డీపీ) అనే రెండు పద్దతులలో రక్తం. నుంచి ప్లేట్ లెట్లను వేరు చేసి, అవసరమైన వారికి ఎక్కిస్తు న్నారు. ఎస్ఓపీ విధానంలో దానుంచి నేరుగా ప్లేట్లె ట్లను సేకరిస్తారు. ఆర్డీపీ విధానంలో సేకరించిన రక్తం నుంచి ప్లేట్లెట్లను వేరుచేస్తారు. అయితే ఎస్ డీపీ విధానంలో ఒకసారికి 50 వేల నుంచి 60 వేల వరకు ప్లేట్లెట్లను సేకరించే అవకాశం ఉంటుంది.

డాక్టర్ కె. కరుణ కుమార్,

సీనియర్ హెమలో ఆంకాలజిస్ట్,

బ్లడ్ డిసీజెస్ స్పెషలిస్ట్,

యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్.

Post a Comment

0 Comments