GET MORE DETAILS

Summer: ఎండలతో జాగ్రత్త. కీలక సూచనలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం.

 Summer: ఎండలతో జాగ్రత్త. కీలక సూచనలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం.



తాజాగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ప్రజలకు కీలక సూచనలు చేసింది. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని రకాల సూచనలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా ఆహారం, వంటగదికి సంబంధించి ఈ చిట్కాలను తూచా తప్పకుండా పాటించండి అని పేర్కొన్నారు.

ఎండలు దండికొడుతున్నాయి. తెలంగాణలో వర్షం కారణంగా ఒక రోజు వాతావరణం చల్లబడ్డా మళ్లీ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 10 గంటలకే అడుగు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. మే నెలలో ఎండ ప్రతాపం మరింత ఎక్కువగా ఉండడం ఖాయమని వాతావరణ నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎండల నుంచి జాగ్రత్తగా ఉండడానికి పలు చిట్కాలు పాటించాలని చెబుతున్నారు.

ఇందులో భాగంగానే తాజాగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ప్రజలకు కీలక సూచనలు చేసింది. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని రకాల సూచనలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా ఆహారం, వంటగదికి సంబంధించి ఈ చిట్కాలను తూచా తప్పకుండా పాటించండి అని పేర్కొన్నారు.

• ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లో వంట చేయకూడదని చెబుతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో విపరీతమైన వేడి ఉంటుంది. ఈ సమయంలో వంట గదిలో వేడితో పాటు, ఎండ వేడి కారణంగా త్వరగా డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం వంట చేయకుండా ఉండడమే బెటర్‌ అని చెబుతున్నారు.

• ఇక వంట గదిలో ఉన్న డోర్లు, కిటికీలకే పూర్తిగా తెరిచి ఉంచాలి. ఒకవేళ కిచెన్‌లో ఎగ్జాస్టర్ ఫ్యాన్‌ ఉంటే ఆన్‌ చేసుకోవాలి. లోపలి గాలి బయటకు వెళ్లేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

• తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రోటీన్‌ ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎండకారణంగా శరీరంలో నీటిశాతం తగ్గుతుంది. ప్రోటీన్‌ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే జీర్ణం కావడానికి ఎక్కువ నీరు అవసరపడుతుంది. దీంతో సమ్మర్‌లో ప్రోటీన్‌ ఎక్కువగా ఉన్న ఫుడ్‌ తీసుకుంటే డీహైడ్రేషన్‌ సమస్య తలెత్తే అవకాశం పెరుగుతుంది.

• ఇక సమ్మర్‌లో కాఫీ, టీ, ఆల్కహాల్‌కు వీలైనంత దూరంగా ఉంటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల శరీరంలో డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

Post a Comment

0 Comments