ఆలుమగలు.. ఎవరి దారి వారిదే!
• ఒకే గదిలో ఉంటున్నా మనసుల మధ్య గోడలు.
• ఇప్పుడు సమాజంలో పరిస్థితి ఇదే...
• ఇద్దరూ సంపాదిస్తున్నా ఖర్చులు పంచుకోరు...
ప్రస్తుత సమాజంలో ఆలుమగల బంధం గురించి సోషల్ మీడియాలో ఓ పోస్టు తెగ వైరల్ అవుతోంది. దీంతో నిజమే కదా... అంటూ నెట్టింట పెద్ద చర్చే జరుగుతోంది. ఇంతకీ ఏంటా పోస్ట్? ఎందుకు వైరల్ అవుతోంది.. ఇప్పుడు తెలుసుకుందాం.
వివాహమా? ఒప్పందమా?
'పేరుకే హస్బెండ్ అండ్ వైఫ్.. ఎవరి సంపాదన వారిదే... ఎవరి ఖర్చులు వారివే. కలిసి ఉండడం మాత్రం ఒకే చోటు. అలా తయారైంది ఇప్పుడు సిచ్యుయేషన్..' అంటూ ఓ నెటిజన్ 'ఎక్స్'లో పోస్ట్ చేయగా నిజమే కదా.. అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇద్దరూ పెళ్లి మంటపంలో అగ్నిసాక్షిగా ఏడడుగులు వేశారు. అడుగులు ఒక్కసారే వేశారు. కానీ మార్గాలు మాత్రం తర్వాత వేరయ్యాయి. ఒకే గదిలో ఉంటారు. కానీ మనసుల మధ్య గోడలు! అంతర్లీనంగా విడి పోయిన బంధం, కేవలం కలిసి ఉన్న ఛాయలు మాత్రమే కని పిస్తున్నాయి. ఖర్చులు పంచుకోరు.. ఎవరి డబ్బులు వారివే.. ఇది నిజమైన వివాహమా? లేక కేవలం ఒప్పందమా? ఇది సహజమైన మార్పా? లేక నిస్సహాయతా? భవిష్యత్తులో ఈ బంధం, ఈ బంధాలు ఎలాంటి మలుపు తీసుకోనున్నాయి.. వివాహ వ్యవస్థ పూర్తిగా మారిపోనుందా? ప్రేమతో నిండిన బంధమా? లేక కేవలం ఓ అబ్లిగేషన్ మాత్రమేనా? ఇది కొత్త తరహా వివాహమా? లేక బంధానికి వచ్చిన కొత్త రూపమా? ఈ మార్పు సహజమా? లేక సమాజం మౌనంగా అంగీకరి స్తున్న విచిత్రమా? అనే ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇద్దరి సంపాదన, ఖర్చులు వేర్వేరు...
ఈ రోజుల్లో పెళ్లయిన మూన్నళ్లకే ముచ్చట తీరిపోతోంది. కలిసి బతకడం మా వల్ల కాదంటూ విడాకులు తీసుకుంటున్నారు. నవ దంపతులు కూడా కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. సంప్రదాయ వివాహాల్లో కుటుంబం, గోత్రం, ఆస్తి, అంతస్తు, మంచి ఉద్యోగం అన్నీచూసుకుని జాతకాలు కుదిరితేనే పెళ్లిచేస్తున్న ఇంటలు కూడా నెలల వ్యవధిలోనే అపోహలతో విడిపోయే పరిస్థితులు వస్తున్నాయి. విడాకులకు కాస్త దూరంగా ఉంటున్న దంపతులు కూడా ఎవరిదారి వారిదే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఇద్దరూ సంపా దిస్తున్నారు.. కానీ ఖర్చులు మాత్రం వేర్వేరు. ఇద్దరు కలిసి ఉండేది ఒకేచోటు. అయినా మనస్సులు మాత్రం ఒకటి కాదు. ఇప్పుడు ఇదే పరిస్థితి ఉంది. ఏ బంధమైనా ఎక్కువ కాలం నిలబడేది.. ముఖ్యంగా భార్యభర్తల మధ్యన ప్రధానంగా ఉండాల్సింది కమ్యూనికేషన్. ఇది లేకపోవడంతోనే వారి వైవాహిక బంధం బీటలువారు. తోంది. అందుకే ఆర్థికసమస్య లైన, కుటుంబ వ్యవహారమైనా ఇద్దరు ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకుంటే బంధం బలంగానే ఉంటుంది. లేదంటే బంధం తెగిపోయే ప్రమాదం ఉంది.
0 Comments