లక్ష్మీలలితా వాస్తు జ్యోతిషాలయం: ప్రభుత్వ ఉద్యోగం, దేవతా సర్పశాపం, పెళ్ళికి నిరాకరించడం - పరిహారం
ప్రభుత్వ ఉద్యోగం:
ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అనేది జాతకరీత్యా పరిశీలన చేయవచ్చు. చదువుకునే వారు ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగం చేయాలని కోరిక నూటికి నూరు శాతం ఉంటుంది అయితే ప్రభుత్వ ఉద్యోగం ఏ జాతకులకు లభిస్తుంది. ఏ సమయంలో వస్తుంది అనేది పరిశీలిస్తే ప్రభుత్వ ఉద్యోగానికి ప్రధాన కారక గ్రహం రవి భగవానుడు రవి భగవానుడు క్షత్రియ గ్రహంగా జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తుంది రవి భగవానుడు బలంగా ఉన్నప్పుడు రాజాశ్రయం లభిస్తుంది అనగా ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుందని చెప్పవచ్చు. రవి భగవానుడు కర్మ స్థానంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రవి భగవానుడి దశ అంతర్దశలోనూ ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నాలు చేయాలి. మరియు పంచమాధిపతి దశ, అంతర్దశలోను కూడా ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నాలు చేసినప్పుడు సఫలీకృతం అవుతారు. పంచమ స్థానం అనేది ఆలోచన బుద్ధి, ప్రణాళిక విధానం, తనకు తాను గుర్తింపును పొందడానికి పంచమ స్థానం ఎంతగానో సహకరిస్తుంది కావున ఏ లగ్నానికి అయినా పంచమ స్థానం అనేది జాతకుడిని సమాజంలో గుర్తింపును తీసుకొస్తుంది. కావున పంచమ స్థానం కూడా ప్రభుత్వ ఉద్యోగం లభించడంలో సహకారం ఉంటుంది కావున లగ్నానికి పంచమాధిపతి ఎవరైనా సరే వారి యొక్క దశ అంతర్దశలలో ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నాలు చేయాలి.శుక్ర భగవానుడు కూడా ప్రభుత్వ ఉద్యోగం లభించడానికి కారణం అవుతారు. శుక్ర భగవానుడు సుఖ జీవితానికి, విలాసవంతమైన జీవితం గడపడానికి, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావడానికి కారకుడు. ప్రైవేటు ఉద్యోగాలతో పోలిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు శ్రమ తక్కువ ఉండే అవకాశం ఉంది మనసుకు సంతోషాన్ని ఇస్తుంది ఒక విధమైన లగ్జరీ లైఫ్ అనుభవించే అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగం లభించే విషయంలో శుక్ర భగవానుడి యొక్క పాత్ర కూడా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం రావడానికి మరొక గ్రహం బుధుడు. బుధుడు పోటీ తత్వానికి కారకుడు ప్రభుత్వ ఉద్యోగం అనగా కాంపిటీషన్ తో కూడుకున్న వ్యవహారం. బుధ గ్రహం యొక్క దశ అంతర్దశలలో కూడా ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నాలు జరిగినప్పుడు ఉద్యోగం వస్తుంది. జాతకంలో పై గ్రహాల యొక్క దశ అంతర్దశలలో ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నాలు చేస్తే సఫలీకృతం అవుతారు. పోలీస్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ వింగ్, డిఫెన్స్ అకాడమీ, ఎలక్ట్రిసిటీ, అగ్నిమాపక దళం ఇటువంటి రంగాలలో ఉద్యోగాలు లభించాలంటే కుజుడు యొక్క పాత్ర కూడా కీలకంగా ఉంటుంది.
దేవతా సర్పశాపం:
జాతకంలో ఎవరికైనా దేవతా సర్ప శాపం ఉన్నదేమో తెలుసుకోవచ్చు. ఈ శాపం ఉన్నప్పుడు జీవితం అంతా కష్టాలమయంగా ఉంటుంది ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలతో విలవిలాడుతూ ఉంటారు. ఏడు తరాల వరకు పూర్వీకులు ఎవరైనా నాగుపామును చంపినా లేదా కర్రతో కొట్టినా ఈ శాపం ఏర్పడుతుంది. జాతక చక్రంలో లగ్నంలో రాహువు ఉన్నప్పుడు అనంత కాలసర్ప శాపం లేదా దోషం అంటారు. ఈ దోషం ఉన్నప్పుడు శారీరకంగా ఆరోగ్యంతో బాధపడతారు ఏదో ఒక మందులు వాడుతూ ఉంటారు వాడుతూ ఉంటారు ప్రతి పనిలోనూ ఆటంకాలు ఏర్పడతాయి ఎల్లప్పుడు ఊహల్లో జీవిస్తూ ఉంటారు. లగ్నం నుండి రెండవ స్థానంలో రాహువు ఉన్నప్పుడు దీనిని గుళికా కాలసర్ప శాపం లేదా దోషమంటారు. ఈ సందర్భంగా జీవితమంతా ధనపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు కుటుంబ పరంగా సంతోషం లేకుండా రుణ బాధలు ధనం నిల్వ లేకపోవడం జరుగుతుంది. నాలుగో స్థానంలో రాహువు ఉన్నప్పుడు శంకుపాల కాలసర్పశాపం లేదా దోషం అంటారు.ఈ దోషం ఉన్నవారికి గృహ సౌఖ్యం ఉండదు సొంత ఇల్లు నిర్మాణం చేయలేక పోతారు ఉన్నత చదువులు చదవలేక పోతారు. ఐదో స్థానంలో రాహు ఉన్నప్పుడు పద్మ కాలసర్ప శాపం లేదా దోషం అంటారు. దీనివలన సంతాన సమస్యలు ఉంటాయి అబార్షన్లు జరుగుతాయి. సంతానం కలగదు. ఒకవేళ సంతానం జన్మించినా పెద్దవాళ్లని ఎదిరిస్తూ ఉంటారు.సంతాన పరంగా సంతోషాన్ని కోల్పోతారు. ఏడో స్థానంలో రాహువు ఉన్నప్పుడు తక్షక కాలసర్పశాపం లేదా దోషం అంటారు. ఈ కారణంగా వివాహాలు ఆలస్యంగా జరగడం లేదా వివాహాలు కాకపోవడం లేదా భార్యాభర్తల మధ్య ఎల్లప్పుడూ ఏదో ఒక ఘర్షణ వాతావరణం ఉండడం జరుగుతాయి. ఎనిమిదవ స్థానంలో రాహువు ఉన్నప్పుడు ఆకస్మిక ప్రమాదాలు నష్టాలు ,కష్టాలు ఏర్పడతాయి. 12వ స్థానంలో రాహు ఉన్నప్పుడు శేషనాగ కాలసర్పశాపము లేదా దోషము అంటారు దీని వలన అత్యధిక ఖర్చులు పెరుగుతాయి సుఖాన్ని కోల్పోతారు బయట వాళ్లతో గొడవలు ఉంటాయి ఒక్కొక్కసారి ఎవరో చేసిన తప్పుకు వీళ్లు నింద పడుతుంటారు అకారణంగా పోలీస్ స్టేషన్ గుమ్మం ఎక్కాల్సి వస్తుంది. రాహువు వివిధ స్థానాలలో ఉన్నప్పుడు వివిధ రకాల ఫలితాలను ఇస్తూ ఉంటారు. రాహువు శుభగ్రహాలతో కలిసిన శుభగ్రహ వీక్షణ ఉన్నప్పుడు కష్టాల యొక్క తీవ్రత తగు ముఖం పట్టవచ్చు. ఒక్కొక్క రకమైన దోషానికి ఒక రకమైన పరిహారాలు ఉంటాయి. మీ జాతక చక్రం పరిశీలింప చేసుకొని చిన్నచిన్న పరిహారాలు పాటించిన యెడల దేవతా సర్ప దోషాలు లేదా శాపాలనేవి ఈ తరంతో ఆగిపోతాయి మిగిలిన జీవితం జాతకరీత్యా సంతోషంగా ఉంటుంది.
పెళ్ళికి నిరాకరించడం - పరిహారం:
ఈ మధ్యకాలంలో వివాహం చేసుకోవడం ఇష్టం లేకపోవడం లేదా వాయిదా వేయడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. కొంతమంది తల్లిదండ్రులు మా పిల్లలు పెళ్లి పట్ల ఆసక్తి చూపడం లేదండి వయసు 30 సంవత్సరాలు దాటిపోతున్నాయి అని అడుగుతున్నారు. కొన్ని ప్రత్యేకమైన జాతక లక్షణాలు ఉన్నప్పుడు జాతకులు వివాహం పై ఆసక్తి చూపించరు. ఇంకా మంచి ఉద్యోగం రావాలి ఇంకా మంచిగా సెటిల్ అవ్వాలి, అనుకున్న గోల్ రీచ్ అయిన తర్వాత వివాహం చేసుకుంటాను అని చాలామంది అంటున్నారు. వివాహం పట్ల ఆసక్తి లేకపోవడానికి జాతకంలో సర్ప దోషం ఉన్నప్పుడు ఇటువంటి ఆలోచనలు వస్తాయి. వీళ్లకు వివాహం పట్ల చాలా ఎక్కువ అంచనాలు ఉంటాయి. మరికొందరికి సంబంధాలు చూస్తూనే ఉంటారు కానీ ఇంతకన్నా మంచి సంబంధం వస్తుందని ప్రతి సంబంధాన్ని నిరాకరిస్తూ ఉంటారు. చివరికి వీరు వయసు దాటిపోయిన తర్వాత ఏదో ఒక సంబంధం చూసి ఓకే చేస్తారు లేదా కొంతమంది వివాహం కాకుండానే ఒంటరిగా మిగిలిపోతుంటారు. జాతకంలో కుజుడు రాహు నక్షత్రాలలో కానీ కేతు నక్షత్రాలలో కానీ ఉన్నప్పుడు ఇటువంటి మనస్తత్వం ఉంటుంది. కుజుడు కేతు నక్షత్రాలైన అశ్విని మఘ మూల ఈ నక్షత్రాలలో ఉన్నప్పుడు వివాహం పట్ల పెద్దగా ఆసక్తి చూపించరు. వాయిదా వేస్తూ ఉంటారు. కుజుడు రాహు నక్షత్రాలైన ఆరుద్ర స్వాతి శతభిషం ఈ నక్షత్రాలలో ఉన్నప్పుడు పెళ్లి పట్ల చాలా ఎక్కువ అంచనాలు ఉంటాయి. ఇంతకన్నా బెటర్ వస్తుంది అని ఆలోచనతో ప్రతి సంబంధాన్ని నిరాకరించి చివరికి లభించిన దానితో అడ్జస్ట్ అవుతారు. కుజుడు కేతువు నక్షత్రంలో ఉన్నప్పుడు పెళ్లి పట్ల ఆసక్తి తగ్గుతుంది, కుజుడు రాహు నక్షత్రంలో ఉన్నప్పుడు విపరీత అంచనాలు ఉంటాయి. మరొక కారణం లగ్నాధిపతి రాహువు లేదా కేతు నక్షత్రాలలో ఉన్నప్పుడు లేదా లగ్నాధిపతి కేతువు లేదా రాహువుతో కలిసి ఉన్నప్పుడు కూడా వివాహం పట్ల ఆసక్తి చూపించరు. ఇటువంటి జాతకులు లగ్నాధిపతి ఏ నక్షత్రాలతో కలిసి ఉన్నారు పరిశీలించి దానికి తగిన పరిహారం పాటించినప్పుడు సుమారు 90 రోజుల లో వివాహం జరిగే అవకాశం ఉంది. జాతక పరిశీలనలో మీకు కొద్దిగా అవగాహన ఉంటే వివాహం ఎందుకు ఆలస్యం అవుతుందో పరిశీలించుకుని దానికి తగిన పరిహారం కోసం సంప్రదించండి. సరియైన పరిహారాలు పాటించినప్పుడు మీకు తగిన జీవిత భాగస్వామి లభిస్తారు.
◾జాతక, ముహూర్త విషయాలకు ఫోన్ ద్వారా సంప్రదించవచ్చును.
◾శ్రీనివాస సిద్ధాంతి. ద్విస్వర్ణ కంకణ సన్మానిత, జ్యోతిషరత్న, (మెంబెర్ ఇన్ ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజీ ఫెడరేషన్.)
📱9494550355
0 Comments