అతి మూత్ర వ్యాధి తగ్గటానికి
◾జీలకర్రను దోరగా వేయించి పొడి చేసుకొని, దీనికి సమంగా పాత బెల్లం లేదా తాటి బెల్లం కలుపుకుని, దంచి ముద్ద చేసి నిలువ చేసుకొని రోజూ రెండు పూటలా, తినడానికి గంట ముందు పది గ్రాముల మోతాదుగా సేవించాలి.
◾నేరేడు పండు చూర్ణం అర చెంచా మోతాదుగా, తేనెలో కలిపి రోజూ రెండు పూటలా ఆహారం తినడానికి గంట ముందు సేవించాలి.మధుమేహం ఉన్నవాళ్లు, తేనె కు బదులుగా గోరువెచ్చని నీళ్లతో వాడండి.
◾పచ్చి ఉసిరిక పండు దొరికినప్పుడు, దంచి రసం10mL తీసుకుని, దానిలో రెండు చెంచాల తేనె కలిపి, రోజూ రెండు పూటలా తినడానికి మందు వాడాలి.
☝️ పైన చెప్పిన మూడు యో గాలలో ఏదైనా చేయవచ్చు.
0 Comments