వాహనం - నరదృష్టి
లక్ష్మీ లలిత వాస్తు జ్యోతిషాలయం.
శ్రీనివాస సిద్ధాంతి
9494550355.
సాధారణంగా మనుషులకు నరదృష్టి ఉన్నట్టే వాహనాన్ని కూడా నరదృష్టి సోకుతూ ఉంటుంది. దీనివలన యజమానులు చాలా ఇబ్బందులకు గురి అవుతూంటారు. వాహనం కొన్న తర్వాత కలిసిరాకపోవడం,కొన్ని,కొన్ని సార్లు ఆటంకాలు ఎదురవుతూ ఉండటమూ, ఆ వాహనం లో ప్రయాణం చేసినప్పుడు పనుల్లో ఆటంకాలు వస్తు ఉండటమూ, వాహనాలు దారి మధ్యలో ఇబ్బంది పెడుతూ ఉండటం ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి.ఈ కారణాల వలన వాహనానికి నరదృష్టి సోకుతుందని తెలుసుకోవచ్చు. అయితే వీటికి కూడా పరిహారం ఉంది.శనివారం నాడు సూర్యాస్తమయం అయిన తర్వాత బండిని శుభ్రంగా నీళ్లతో కడిగి గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టాలి. ఒక చిన్న పటిక ముక్కకు నల్లటి దారం కట్టి బండికి కట్టాలి.తరువాత రెండు నిమ్మకాయలు రెండు చక్రాల కింద ఉంచి నిమ్మకాయలు మీదుగా బండిని పోనివ్వాలి. మరుసటి రోజు ఉదయాన్నే హనుమాన్ టెంపుల్ దగ్గర బండికి పూజ చేయించాలి. ఈ విధంగా చేస్తే టూవీలర్ వాహనానికి నరదృష్టి మొత్తం పోతుంది.అదే విధంగా నాలుగు చక్రాల వాహనం కారుకి వేరే రకమైన పరిహారం వుంది.కారులో వెడుతున్నప్పుడు పనులు సరిగా కాకపోవడం కానీ లేదా అప్పుడప్పుడు కారుకు గీతలు పడడం అద్దాలు పగిలిపోవడం జరుగుతూ ఉంటాయి. వీటికి కారణం నరదృష్టి అని చెప్పవచ్చు.ఏదైనా శనివారంనాడు సూర్యాస్తమయం తర్వాత కారుని శుభ్రంగా కడిగి గంధం, కుంకుమ బొట్టు పెట్టి, పట్టిక ముక్కకు నల్లదారం కట్టి దానిని కారుకి కట్టాలి.దానితో పాటు నాలుగు నిమ్మకాయలు నాలుగు ఎండు మిరపకాయలు కూడా కట్టాలి మరునాడు ఉదయం ఏదైనా శివాలయం వద్ద కారుకి పూజ చేయించాలి. ఈ విధంగా మూడు నెలలకు ఒకసారి బండికి కానీ కారు కానీ ఈ పరిహారం చెయ్యడం వలన వాహన వలన ఇబ్బందులు తగ్గి అన్నివేళలా అనుకూలంగా కలిసివస్తుంది.
0 Comments