GET MORE DETAILS

వివాహం ఎప్పుడు జరుగుతుంది?

 వివాహం ఎప్పుడు జరుగుతుంది?



ఒక జాతకుడికి వివాహం ఏ దశాబుక్తుల సమయంలో జరుగుతుంది. ఏ గ్రహాల దశ వివాహం జరగడానికి సపోర్ట్ చేస్తాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఒక కుటుంబంలో గృహ నిర్మాణం వ్యాపారం వీటి గూర్చి తెలుసుకోవడం కన్నా తమ కుటుంబంలోని సంతానానికి వివాహం ఎప్పుడు జరుగుతుంది అనేది ముఖ్యమైన విషయం గా చెప్పవచ్చు. జాతక చక్రంలో వివాహానికి ముఖ్య కారకుడు శుక్ర భగవానుడు. ఏ లగ్న జాతకులకి అయినా కుటుంబాధిపతి మరియు కళత్రధిపతి మరియు శుక్ర భగవానుడు ఈ మూడు గ్రహాలు వివాహ విషయంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. ఏ లగ్న జాతకులకు అయినా రెండవ స్థానాధిపతి లేదా ఏడవ స్థానాధిపతి లేదా శుక్ర భగవానుడు వీరిలో ఏదైనా గ్రహం యొక్క దశ అంతర్దశలు జరుగుతున్నప్పుడు వివాహం జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా వృషభం లోను తుల రాశిలోనూ ఉన్న గ్రహాల యొక్క దశాబుక్తుల కాలంలో కూడా వివాహం జరిగే అవకాశం ఉంది. జాతకంలో రెండవ స్థానాధిపతి ఏడవ స్థానాధిపతి శుక్రులతో సంబంధం ఏర్పడిన లేదా శుక్రుడు యొక్క నక్షత్రాలలో ఉన్నప్పటికీ ఆయా దశాబుక్తుల కాలంలో వివాహం జరిగే అవకాశం ఉంది. మరియు శుక్ర భగవానుని యొక్క నక్షత్రాలలో ఏ గ్రహం ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క దశ భుక్తులలో కూడా వివాహం జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో వివాహం జరుగుతుంది అని చెప్పినప్పటికీ ఆగ్రహాలకు శని భగవానుడు కుజుడు రాహువు కేతువు ఈ గ్రహాలతో కానీ ఆయా రాశులతో కానీ సంబంధం ఏర్పడినప్పుడు వివాహం జరగడంలో ఆటంకాలు సంభవిస్తాయి. రాహు కేతువులు లగ్నానికి కానీ కుటుంబ స్థానానికి కానీ సప్తమ అష్టమ స్థానాలకు సంబంధం ఏర్పడినప్పుడు వివాహం ఆలస్యం అవుతుంది. శని భగవానుడు లగ్నానికి కానీ సప్తమ స్థానానికి గాని కుటుంబ స్థానంలో కానీ క్షీణ చంద్రుడుతో కానీ సంబంధం ఏర్పడితే జాతకుడు వివాహపరంగా ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుజుడు ఈ స్థానాలతో సంబంధం ఏర్పడితే కుజదోషం కారణంగా వివాహం ఆలస్యం అవుతుంది. వివాహ ఆలస్యానికి సమస్యలు కలిగించే గ్రహాలను పరిశీలించి వాటికి తగిన పరిహారాలు పాటించిన యెడల వీలైనంత త్వరలో వివాహం జరుగుతుంది.

జాతక, ముహూర్త విషయాలకు ఫోన్ ద్వారా సంప్రదించవచ్చును.  

ద్విస్వర్ణ కంకణ సన్మానిత.

జ్యోతిషరత్న, 

శ్రీనివాస సిద్ధాంతి

9494550355

Post a Comment

0 Comments