చుండ్రు సమస్యలు - చుండ్రు తగ్గించే చిట్కాలు
కొందరిని చుండ్రు సమస్య చాలా వేధిస్తుంది. వాళ్లు రకరకాల షాంపూలు ప్రయత్నించి విఫలమవు తుంటారు. అయితే ఈ సమస్యను సింపుల్ హోమ్ రెమిడీస్తో దూరం చేసుకోవచ్చు. చుండ్రు వదలాలంటే ఈ చిట్కాలు ఫాలో అయిపోండి.
ఆలివ్ ఆయిల్ లో సహజసిద్ధంగా చుండ్రును తొల గించే గుణాలున్నాయి. వారంలో రెండు రోజులు తలకు ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ఆలివ్ ఆయిల్ పట్టించి తలచుట్టూ టవల్ లేక షవర్ క్యాప్ పెట్టుకుని పడుకోవాలి. ఉదయాన్నే ఏదైనా షాంపూతో తలస్నానం చేస్తే సరి.
నిమ్మ ఆకులు అందరికీ అందుబాటులో ఉంటాయి. కొన్ని నిమ్మ ఆకులను తీసుకుని అరగంట పాటు నీళ్లలో మరిగించాలి. తరువాత ఆ ఆకులను పేస్ట్ మాదిరిగా చేసుకుని తలకు పట్టించాలి. నలభైనిమిషాల పాటు అలా వదిలేసి తరువాత నీళ్లతో శుభ్రంగా కడిగేసుకోవాలి.
ప్రతి ఇంట్లోనూ కలబంద మొక్క ఉంటుంది. ఈ మొక్కలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలుంటాయి. ఇవి చుండ్రును సమర్థవంతంగా తొలగిస్తాయి. తలకు అలోవెరా జెలు పట్టించి నలభై నిమిషాలు వదిలేయాలి. తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి ఇలాచేస్తే చుండ్రు సమస్య దూరమవుతుంది.
గుప్పెడు మెంతులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే పేస్ట్ మాదిరిగా చేసుకుని తలకు పట్టించాలి. అరగంటపాటు అలా వదిలేసి తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి నెల పాటు చేస్తే చుండ్రు సమస్య శాశ్వతంగా పోతుంది.
చుండ్రు తగ్గించే చిట్కాలు:
1. Neem Leaves (వేపాకులు)
Telugu: వేపాకులను నీళ్లలో మరిగించి, ఆ నీటితో తల స్నానం చేయండి.
English: Boil neem leaves in water and use that water for hair wash. It kills dandruff-causing fungus naturally.
2. Lemon & Coconut Oil (నిమ్మరసం + కొబ్బరి నూనె)
Telugu: రెండు స్పూన్ల కొబ్బరి నూనెలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి తలపైన మసాజ్ చేయండి.
English: Mix lemon juice with coconut oil and massage your scalp. Wash after 30 minutes.
3. Aloe Vera Gel (గృతకుమారి జెల్)
Telugu: గృతకుమారి జెల్ ని తలపైన రాసి 20 నిమిషాల తర్వాత కడగండి.
English: Apply fresh aloe vera gel on the scalp, leave it for 20 mins, then rinse. Helps reduce itching & dandruff.
4. Fenugreek Seeds (మెంతులు)
Telugu: మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయం గ్రైండ్ చేసి తలపైన రాసి 30 నిమిషాల తర్వాత కడగండి.
English: Soak fenugreek seeds overnight, grind into a paste, apply on scalp, and wash after 30 mins.
5. Amla Powder (ఉసిరి పొడి)
Telugu: ఉసిరి పొడిని నీళ్లలో కలిపి పేస్ట్ లా చేసి తలపైన రాయండి.
English: Amla nourishes the scalp and prevents dandruff & hair fall.
6. Ayurvedic Oils (ఆయుర్వేద నూనెలు)
Telugu: భృంగరాజ్ ఆయిల్, నీమ్ ఆయిల్, లేదా త్రిఫలాది తైలము వారానికి రెండు సార్లు వాడండి.
English: Use Ayurvedic oils like Bhringraj, Neem, or Triphala oil twice a week for healthy scalp.
Extra Tips (అదనపు సూచనలు)
• తల ఎప్పుడూ శుభ్రంగా ఉంచండి (Keep scalp clean)
• ఎక్కువ కెమికల్ షాంపూలు వాడకండి (Avoid harsh shampoos)
• ఎక్కువ నీళ్లు తాగండి (Drink enough water)
• జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వకండి (Don’t comb wet hair)
0 Comments