అయ్యప్ప దీక్ష అంటే ఏమిటి? అయ్యప్ప దీక్ష నియమావళి మరియు వివరాలు.
నిశ్చలమైన (చంచలము కానట్టి) మనస్సుతో సంకల్పిచడాన్ని దీక్ష అంటారు. మనస్సును, వాక్కును, శరీరమును త్రికరణ సుద్దిగా నడిపింపజేస్తానని స్పంకల్పించి, ఇంధ్రియాలను చెడు కర్మల నుండి మరల్చి సత్కర్మలలొ వినియోగించుటకు ఫ్రతిగ్న చెసుకొనుటను దీక్ష అంటారు.
అహింస, సత్యము, ఆస్థేయము, బ్రహ్మచర్యం, అపరిగ్రహము అనే మహవ్రతాలను మనోవాక్కాయ కర్మల ద్వారా ఆచరించుటను దీక్ష అంటారు.
అయ్యప్ప దీక్ష నియమావళి
దీక్షా సమయంలో అయ్యప్పలు పాటించవలసిన నిత్యనియమావళి:
1. ప్రతిదినము ఉదయమే సూర్యోదయమునకు ముందుగా మేల్కొని కాల కృత్యములు తీర్చుకుని, చన్నీళ్ళ శిరస్నానం ఆచరించి, స్వామికి దీపారాధన గావించి, స్వామి స్తోత్రములు పఠించి తరువాతనే మంచి నీరైనను త్రాగాలి. సాయంత్రము వేళ కూడా చన్నీళ్ళ శిరస్నానం చేసి, స్వామికి దేవతార్చన జరిపి, రాత్రిపూట భిక్ష చేయాలి.
2. రోజూ ఉదయం, సాయంత్రం ఏదో ఒక దేవాలయమును దర్శించాలి.
3. నల్లని దుస్తులు మాత్రమే ధరించాలి.
4. కాళ్ళకు చెప్పులు లేకుండా తిరగాలి.
5. మెడలో ధరించిన ముద్రమాలను ఎట్టిపరిస్థితిలోనూ తీయరాదు. అయ్యప్ప సాన్నిధ్యము చేరుటకు కనీసము 41 రోజులు ముందుగా దీక్ష ఆరంభించాలి.
6. దీక్ష కాలమందు గడ్డము గీసుకొనుటగాని క్షవరం చేయించుకొనుట గాని పనికి రాదు. గోళ్ళు కూడా కత్తిరించకొనరాదు.
7. అస్కలిత బ్రహ్మచర్యము పాటించుతూ యోగిగా జీవించుట అయ్యప్పకు ఎంతో అవసరము. ఇంటిలో ఒక వేరు గదిలో వుండుట శ్రేయస్కరము. దాంపత్యజీవితము మనోవాక్కాయకర్మములందు తలచుట కూడ అపరాధము.
8. మెత్తటి పరుపులు, దిండ్లు ఉపయోగించరాదు. నేల మీద కొత్త చాప పరచుకొని పరుండట ఉత్తమము.
9. అయ్యప్పలు శవమును చూడరాదు. బహిష్టయిన స్త్రీలను చూడరాదు. అట్లు ఒకవేళ చూసిన యెడల ఇంటికి వచ్చి, పంచగవ్య శిరస్నానమాచరించి, స్వామి శరణు ఘోష చెప్పిన పిదపనే మంచి నీరైనా త్రాగవలెను.
10. దీక్షలో 'స్వామియే శరణమయ్యప్ప' అనే మూల మంత్రమును ఎప్పుడూ జపించవలెను.
11. దీక్షా సమయంలో స్త్రీల నందరిన్నీ (భార్యతోసహా) దేవతామూర్తులుగా భావించాలి.
12. తమ పేరు చివర 'అయ్యప్ప' అని పదము చేర్చాలి. ఇతరులను 'అయ్యప్ప' అని పిలవాలి. స్త్రీ అయ్యప్పలను 'మాలికాపురం' లేదా 'మాతా' అని పిలవాలి.
13. అయ్యప్పలను ఎవరైనా భిక్షకు (భోజనమునకు) పిలిస్తే తిరస్కరించరాదు.
14. అయ్యప్పల నుదుట ఎప్పుడు విభూధి, చందనము, కుంకుమ బొట్టు ఉండాలి.
15. మద్యము సేవించుటగాని, పొగాకు పీల్చుట వంటి దురలవాటు మానుకొనవలెను. తాంబూలం కూడా నిషిద్ధమే.
16. రోజు అతి సాత్వికాహారమునే భుజింపవలెను. రాత్రులందు అల్పాహారము సేవించవలెను.
17. తరచూ భజనలలో పాల్గొనుట అత్యుత్తము. స్వామి శరణు ఘోష ప్రియుడు కాబట్టి ఎంత శరణు ఘోష జరిపితే స్వామికి అంత ప్రీతి.
18. హింసాత్మక చర్యలకు దూరముగా వుండాలి. అబద్దమాడుట, దుర్బాషలాడుట చేయరాదు. అధిక ప్రసంగములకు దూరముగా వుండాలి.
19. ప్రతి దినము స్వామికి అర్చన చేసి, తర్వాత ఇష్టదైవమును ప్రీతికొద్ది ధ్యానించాలి.
20. అష్టరాగములు, పంచేంద్రియములు, త్రిగుణములు, విద్య, అవిద్యలకు దూరముగా వుండాలి. ఇదే పదునెట్టాంబడి.
21. శక్తి కొలది దీక్షా సమయములో కనీసము ఒకసారైనా నల్గురు అయ్యప్పలకు భిక్ష పెట్టుట మంచిది.
22. స్వామి వారికి కర్పూరం ప్రీతి కనుక ఉదయం, సాయంత్రం కూడా కర్పూర హారతి ఇవ్వాలి.
23. దీక్షా సమయంలో వయస్సు, హోదా, అంతస్తు సర్వము మరచి సాటి అయ్యప్పలకు పాదాభివందనము చేయుటకు వెనుకాడరాదు. దీక్షా సమయంలో తల్లిదండ్రులకు పాదాభివందనము చేయవచ్చును. కానీ దీక్షలేని ఇతరులకు పాదాభివందనం చేయరాదు.
అయ్యప్ప స్వామిని ను హరిహరసుతుడని, ధర్మశాస్త, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. అయ్య ( విష్ణువు), అప్ప ( శివుడు) అని పేర్ల సంగమం తో 'అయ్యప్ప' నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలై లో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. శబరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి.
కేరళలోనే "కుళతుపుళ"లో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. "అచ్చన్ కోవిల్"లో పుష్కల, పూర్ణ అనే దేవేరులసమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి యేటా ఐదుకోట్లమంది భక్తులు దర్శనార్ధులై వెళుతుంటారు. కంచిలోని కామాక్షి అమ్మవారి ప్రధాన ఆలయం వెనుకవైపు చేతిలో కొరడాతో అయ్యప్ప తన ఇరువురు దేవేరులతో దర్శనమిస్తారు. ఇదే రూపంలో కంచిలోని ఇతర దేవాలయాలలో కూడా దర్శనమిస్తారు.
మహిశాసురుని సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమయిన తరువాత మహిషి బ్రహ్మను ఈ విధంగా కోరింది. శివుడికి మరియు కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్నెవరూ జయించకూడదు. అదీ కూడ ఆ హరిహర తనయుడు పన్నెండేళ్ళపాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవా ధర్మం నిర్వర్తించాలి, అలా కానిపక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి. 'తధాస్తు' అని మహిషికి వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మ.
క్షీరసాగరమధనం అనంతరం దేవతల కు, రాక్షసుల కు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం ధరించి కార్యం నిర్వహిస్తాడు. తరువాత అదేరూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము, 30వ రోజు శనివారం, పంచమి తిధి, ఉత్తరా నక్షత్రం వృశ్చికా లగ్నమందు శాస్త(అయ్యప్ప) జన్మించాడు.
ఇతడు శైవుల కు, వైష్ణవుల కు ఆరాధ్య దైవం. తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు ధర్మశాస్త. అయ్యప్ప స్వామి ధర్మప్రవర్తన, ధర్మనిష్ఠ లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. తన భక్తులు ఏయే ధర్మాలని పాటించాలో, ఏ నియమనిష్ఠలతో వుండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు. అప్పటి నుండి ఆయన 'ధర్మశాస్త'గా ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. అందుకే ఆయనకి 'ధర్మశాస్త' అనే పేరు కూడా వుంది.
అదే సమయంలో దైవ ప్రేరణవలన వేట నిమిత్తం అటుగా వస్తాడు పందళ దేశాధీశుడు, గొప్ప శివభక్తుడు అయిన రాజశేఖరుడు. సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని తలంచిన రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురమునకు తీసుకువెళ్తాడు. ఆ శిశువును చూసి అతని రాణి కూడ ఎంతగానో ఆనందిస్తుంది. ఆయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళా విశేషము వలన ఏడాది తిరిగే సరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది. మణికంఠుని సాత్విక గుణాలవల్ల కొందరు 'అయ్యా అని మరికొందరు 'అప్పా అని మరికొందరు రెండు పేర్లూ కలిపి 'అయ్యప్ప' అని పిలిచేవారు.
తగిన వయసురాగానే మహారాజు కొడుకులిద్దర్నీ గురుకులానికి పంపిస్తాడు. రాజ గురువు అయ్యప్పను అవతారపురుషునిగా గుర్తిస్తాడు. అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేయిస్తాడు. గురుకులం లో విద్యనభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్యపట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి. తల్లికి అది ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది. నేవెళ్ళీ తీసుకు వస్తానని చెప్పి బయలుదేరుతాడు అయ్యప్ప.
అడవిలో నారదుడు మహిషిని కలిసి అయ్యప్పను గురించి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడు అని హెచ్చరిస్తాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళుతుంది. వీరి యిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు సమస్త దేవతలు అదృశ్యరూపంలో వస్తారు. ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చూస్తూ మహిషిని ఎదిరించాడు. అయ్యప్ప మహిషిల మధ్య జరిగే భీకరయుద్ధంలో చివరిగా మహిషిని నేలపై విసిరికొడతాడు.
ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా ఆయనను స్తుతిస్తూ ఆయన ముందుకు వస్తారు. అప్పుడు శ్రీ అయ్యప్ప ఇంద్రునితో దేవేంద్రా! నేను చిరుతపులి పాలు తెచ్చే నెపంపై యిలా వచ్చాను. కాబట్టి మీరందరూ చిరుతలై నాకు తోడ్పడండి అని అడుగుతాడు. ఆయన కోరికపై అందరు చిరుతపులులుగా మారిపోయారు. ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమైన చిరుతగా మారిపోయాడు. చిరుతల దండుతో అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు.
రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చేయాలనుకొంటాడు. కాని తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వలదని మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. అందుకు నియమం ఏమంటే తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని. అలా కట్టిన ఆలయం శబరిమలలో ఉంది. అక్కడ అయ్యప్ప స్థిరనివాసం ఏర్పరచుకొని తన భక్తుల పూజలందుకొంటున్నాడని భక్తుల విశ్వాసం.
స్వామియే శరణం అయ్యప్ప!
శబరిమలై ఆలయము:
ఈ ఆలయము ఇదు శాస్త్రాలయాల తో ప్రసిద్ధిచెందినది . అరణ్యాల మధ్య లో శబరిమలైకి ఎదురుగా ఉన్న" పొన్నంబల " మేడలో అయ్యప్ప స్వామి "జీవన్ముక్తుని" గా ఉంటాడు .
శబరిమలై
శబరిమలై అంటే శబరి యొక్క పర్వతము అని అర్ధం.
దేవాలయ నిర్మాణము
అంతట అయ్యప్ప ఈ పర్వతముపై కల అయ్యప్పస్వామి దేవాలయము భారతదేశ ప్రసిద్ది చెందిన, అధిక జనసమ్మర్ధం కలిగిన దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయమునకు మాలధారణ చేసుకొని నలుభైఒక్క రోజు నియమాలను పాటించిన భక్తులు కార్తీకమాసం మరియు సంక్రాంతి సమయాలలో విపరీతంగా వస్తారు.
నిత్య పూజా క్రమంలో గాని, దేవాలయానికి వెళ్ళి గాని అయ్యప్పను దర్శించుకోవడం ద్వారా గాని అయ్యప్పను పూజించడం సాధారణంగా ఇతర దేవుళ్ళ పూజలాగానే ఉంటుంది. అయితే దీక్ష తీసుకొని అయ్యప్ప దర్శనం కోసం వెళ్ళడానికి కఠినమైన నియమాలను అనుసరిస్తూ ప్రతిదినమూ చేసే భజన పూజాది కార్యక్రమాలలో కొంత వైశిష్ట్యం కనిపిస్తుంది.
దీక్ష, మాల, నియమాలు
భక్తులు కార్తీకమాసం నుండి దాధాపు మార్గశిర పుష్య మాసాల వరకు దృఢమైన నియమాలను ఆచరిస్తూ ఉంటారు. ఐహికమైన సౌఖ్యాలను పరిత్యజించడం, మద్య మాంస ధూపమపానాది వ్యసనాలకు దూరంగా ఉండడం, స్వామి చింతనలో స్వామి భక్తులతో సమయం గడపడం, సాత్విక జీవనం అవలంబించడం ఈ దీక్షలో ముఖ్య లక్షణాలు. వీరి దినచర్య తెల్లవారు ఝామున లేచి చన్నీటి స్నానం చేయడంతో మొదలవుతుంది. నల్లని వస్త్రాలు, తులసిమాల, నుదుట విభుదిపై గంధం బొట్టు ధరిస్తారు. దినంలో అధిక భాగం పూజ భజనాది కార్యక్రమాలలో గడుపుతారు. కటికనేల మీద పడుకొంటారు. అందరినీ "స్వామి" అని సంబోధిస్తారు. దుర్భాషణాలకు దూరంగా ఉంటారు. ఇలా ఒక మండలం పాటు నియమాలతో గడుపుతారు. ఇలా అయ్యప్ప స్వామి దీక్షకు ఒక స్పష్టమైన, కొంత క్లిష్టమైన విధానం రూపు దిద్దుకొంది.
దీక్ష తీసుకోవాలనుకొనే భక్తుడు గురుస్వామి వద్దనుండి ఉపదేశంతో మాలను ధరిస్తాడు. మాలా ధారణ అనంతరం తన మనస్సునూ, శరీరాన్ని భగవంతునికి అంకితం చేయాలి. అందరినీ భగవంతుని రూపాలుగా భావించాలి. అయ్యప్ప శరణు ఘోషను విడువకూడదు. నిత్యం భజన కార్యక్రమంలో పాల్గొనాలి.
• భజన
• పడిపూజ
• హరివరాసనం
అయ్యప్ప పూజ చివరిలో "హరివరాసనం" లేదా "శ్రీ హరిహరాత్మజాష్టకం"గానం చేయడం ఒక సంప్రదాయం. శబరిమల ఆలయంలో రాత్రిపూట మందిరం మూసేముందు ఈ స్తోత్రాన్ని పాడుతారు. ఇదే విధానాన్ని ఇతర ఆలయాలలోను, ఉత్సవాలలోను, పూజలలోను పాటిస్తున్నారు. ఈ స్తోత్రాన్ని "కుంబకుడి కులతూర్ అయ్యర్" రచించాడు. 1955లో స్వామి విమోచనానంద ఈ స్తోత్రాన్ని శబరిమలలో పఠించాడు.
1940, 50 దశకాలలో ఇది నిర్మానుష్యమైన కాలంలో వి. ఆర్. గోపాలమీనన్ అనే భక్తుడు సన్నిధానం సమీపంలో నివశిస్తూ ఉండేవాడు. మందిరంలో హరివరాసనాన్ని స్తోత్రం చేస్తూ ఉండేవాడు. ఆ అరణ్యప్రాంతంలో వన్యమృగాలకు భయపడేవాడు కాదు. అప్పట్లో "ఈశ్వరన్ నంబూద్రి" అనే అర్చకుడు ఉండేవాడు. తరువాత గోపాలమీనన్ శబరిమల నుండి వెళ్ళిపోయాడు. అతను మరణించాడని తెలిసినపుడు చింతించిన ఈశ్వరన్ నంబూద్రి ఆరోజు ఆలయం మూసివేసే సమయంలో "హరివరాసనం" స్తోత్రం చదివాడు. అప్పటినుండి ఈ సంప్రదాయం కొనసాగుతున్నది.
హరవరాసనం చదువుతున్నపుడు గర్భగుడిలో ఒక్కొక్కదీపం కొండెక్కిస్తారు. చివరికి ఒక్క రాత్రిదీపం మాత్రం ఉంచుతారు. ఈ శ్లోకం నిద్రపోయేముందు అయ్యప్పకు జోలవంటిది. శ్లోకం అయిన తరువాత నమస్కారం చేయవద్దని, "స్వామి శరణు" అని చెప్పుకోవద్దని చెబుతారు. ఈ స్తోత్రంలో 8 శ్లోకాలున్నాయి.
మొదటి శ్లోకం.
హరివరాసనమ్ విశ్వమోహనమ్
హరిదధీశ్వరమ్ ఆరాధ్యపాదుకమ్
అరివిమర్దనమ్ నిత్యనర్తనమ్
హరిహరాత్మజమ్ దేవమాశ్రయే
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా
శబరిమల యాత్ర:
దీక్ష స్వీకరించి నియమాలతో మండలం గడిపిన భక్తులు శబరిమలై యాత్ర చేస్తారు. ఈ దీక్ష స్వామి సన్నిధాన సందర్శనంతో ముగుస్తుంది. శబరిమల కేరళలోని పత్తినంతిట్ట జిల్లాలో పశ్చిమ కనుమల్లో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం క్రిందకు వస్తుంది. గుడి సముద్ర మట్టం నుంచి సుమారు 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు మరియు 18 కొండల మద్య కేంద్రీకృతమై ఉంటుంది.ఇక్కడికి యాత్రలు నవంబర్ నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి. మండల పూజ (నవంబర్ 17), మకరవిళక్కు (జనవరి 14) ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు. జనవరి 14 వ రోజును ఆలయంలో మకర జ్యోతి దర్శన మిస్తుంది. మిగతా అన్ని రోజుల్లోనూ గుడిని మూసే ఉంచుతారు. కానీ ప్రతీ మళయాళ నెలలో ఐదు రోజుల పాటు తెరచియుంచుతారు.
ఎరుమేలి
శబరిమలై యాత్ర "ఎరుమేలి"తో మొదలవుతుంది. ఎరుమేలిలో "వావరు స్వామి"ని భక్తులు దర్శించుకొంటారు. (అయ్యప్ప పులిపాలకోసం అడవికి వెళ్ళినపుడు అతనిని అడ్డగించిన ఒక దొంగ అనంతరం స్వామి సన్నిహిత భక్తునిగా మారాడు. అతడే వావరు స్వామి. "నన్ను దర్శించుకోవాలని వచ్చిన భక్తులు ముందుగా నిన్ను దర్శించుకొంటారు" అని అయ్యప్ప వావరుకు వరమిచ్చాడట.
ఈ వావరు స్వామి ఒక ముస్లిం కులస్తుడు. ఈ వావరు ఇక్కడ కొలువున్నది కూడా ఒక మసీదులోనే) దర్శనానంతరం భక్తులు వావరుస్వామి చుట్టూ రకరకాల వేషధారణతో "పేటై తులాల" అనే నాట్యం చేస్తారు. (మహిషితో యుద్ధం చేసేటపుడు అయ్యప్ప చేసిన తాండవం పేరు "పేటై తులాల"). ఈ ఎరుమేలి వద్ద ఉన్న "ధర్మశాస్త" ఆలయంలో అయ్యప్ప స్వామి ధనుర్బాణధారియై ఉంటాడు. ఇక్కడ వినాయకుడు కూడా కొలువై ఉంటాడు. ఈయనను "కన్నెమూల గణపతి" అని అంటారు. ఇక్కడ భక్తులు కొబ్బరికాయ కొడతారు.
పాదయాత్ర
ఇక్కడినుండి భక్తుల పాదయాత్ర మొదలవుతుంది. పాదయాత్రకు రెండు మార్గాలున్నాయి. "పెద్ద పాదం" అనేది కొండలమధ్య దట్టమైన అరణ్యంలో ఉన్న కాలిబాట. ఇది ఎనభై కిలోమీటర్ల దారి. దారిలో పెరుర్తోడు, కాలైకట్టి అనే స్థలాలున్నాయి. (మహిషితో అయ్యప్పస్వామి యుద్ధం చేస్తుండగా కాలైకట్టివద్దనుండి శివకేశవులు యుద్ధాన్ని చూశారట). ఇక్కడికి కొద్ది దూరంలోనే అళదా నది (మహిషి కార్చిన కన్నీరు నదీరూపమైందట) ఉంది. ఈ నదిలో స్నానం చేసి భక్తులు నదినుండి ఒక రాయిని తీసుకు వెళతారు. ఆ రాతిని "కళిద ముకుంద" (మహిషి కళేబరాన్ని పూడ్చిన చోటు) వద్ద పడవేస్తారు. తరువాత యాత్ర ముందుకు సాగి పెరియానపట్టమ్, చెరియానపట్టమ్ అనే స్థలాలగుండా పంబ నది చేరుకొంటుంది. అక్కడే "పంబ" అనే గ్రామం కూడా ఉంది. ఇక్కడినుండి స్వామి సన్నిధానానికి ఏడు కిలోమీటర్ల దూరం.
చిన్నపాదం మార్గంలో బస్సులు కూడా తిరుగుతాయి. బస్సులపై పంబానది వరకు చేరుకోవచ్చు. చివరి ఏడు కిలోమీటర్లు మాత్రం కాళినడకన వెళ్ళాలి.
సన్నిధానం
భక్తులు పంబానదిలో స్నానం చేసి "ఇరుముడి"ని తలపై పెట్టుకొని అయ్యప్ప శరణు ఘోషతో "నీలిమలై" అనే కొండ మార్గం ద్వారా ప్రయాణిస్తారు. కన్నెస్వాములు (తొలిసారి దీక్ష తీసుకొన్నవారు) తమతో తెచ్చిన ఒక బాణాన్ని దారిలో "శరమ్ గుత్తి" అనే చోట ఉంచుతారు. ఇక్కడినుండి అయ్యప్ప సన్నిధానంకు ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది.
సన్నిధానం వద్ద ఉన్న 18 మెట్లను "పదునెట్టాంబడి" అంటారు. 40 రోజులు దీక్ష తీసుకొని ఇరుముడి ధరించినవారు మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అర్హత కలిగి ఉంటారని కధనం. ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది. సన్నిధానానికి, 18 మెట్లకు నమస్కరిస్తూ స్తోత్రాలు పఠిస్తూ మెట్లను ఎక్కుతారు. ఈ ఆళయంలో స్వామి కొలువైన సందర్భంగా 18 వాయిద్యాలను మ్రోగించారట.
సన్నిధానంలో "పానవట్టం"పైన అయ్యప్ప కూర్చుని ఉన్న భంగిమలో దర్శనమిస్తాడు. స్వామియే శరణం అయ్యప్ప స్వామి కూర్చున్న తీరు శివలింగాన్ని తలపిస్తుందని. ఒంపు తిరిగిన ఎడమచేయి మోహిని అవతారాన్ని తెలియజేస్తుందని చెబుతారు
అయ్యప్ప స్వామి
ఈయనను హరిహరసుతుడని, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. అయ్య విష్ణువు), అప్ప శివుడు) అని పేర్ల సంగమం తో 'అయ్యప్ప' నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలై లో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శశబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు.
బరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోనే "కుళతుపుళ"లో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. "అచ్చన్ కోవిల్"లో పుష్కల, పూర్ణ అనే దేవేరులసమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి యేటా ఐదుకోట్లమంది భక్తులు దర్శనార్ధులై వెళుతుంటారు
జనన కారణము:
అయ్యప్ప జననము సరిగా ఎవరికీ తెలీదు . ఎన్నో కధలలో కొన్నింటిని మతపెద్దలు ప్రచారములో పెట్టేరు .
1.క్షీరసాగరమధనం అనంతరం దేవతల కు, రాక్షసుల కు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం దరించి కార్యం నిర్వహిస్తాడు. తరువాత అదేరూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు.
2. భస్మాసురుడు అనే రాఖసుడు శివుని కై తపస్సు చేసి ... తానూ ఎవరి తలపై చేసి వేస్తే వారు భస్మము అయిపోయేతట్లు వారము పొంది తాను పొందిన వరకు పనిచేయునది , లేనిది పరీక్ష నిమిత్తము శివుని తలపై నే చేయి వేయుటకు పూనుకొనగా చావు భయము తో శివుడు పారిపోయి గురివింద గింజ లో దాక్కోనెను . శివుని రక్షించే కార్యములో విష్ణువు 'మోహినీ ' రూపము ఎత్తి భస్మాసుర వధ గావించెను .
ఏది ఏమైనా వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము, 30వ రోజు శనివారం, పంచమి తిధి, ఉత్తరా నక్షత్రం వృశ్చికా లగ్నమందు శాస్త(అయ్యప్ప) జన్మించాడు. ఇతడు శైవుల కు, వైష్ణవుల కు ఆరాధ్య దైవం. తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు ధర్మశాస్త. అయ్యప స్వామి . ఇలా హరి హరులకు బిడ్డ పుట్టుటకు కారణముంది . మహిష ను సంహరించాదానికే... ఈ మహిష ఎవరు ? .
పూర్వము త్రిమూర్తుల అంశ తో జన్మించిన దత్తాత్రేయుడు .. ఆ త్రిమూర్తుల భార్యలైన - సరస్వతి ,లక్ష్మీ , పార్వతి ల అంశతో జన్మించిన 'లీలావతి'ని పెళ్లి చేసుకుంటాడు . లోకోద్ధారణ ముగిశాక అవతారము చాలిద్దామని దత్తాత్రేయుల వారు అంటే మరికొంతకాలము ఇక్కడే సుఖిద్దామని భార్య కోరగా , దత్తు నకు కోపము వచ్చి"మహిషి" గా జన్మించమని శపిస్తాడు . శక్తి స్వరుపిని అయిన లీలావతి భర్తను "మహిష" గా పుట్టుడురుగాక అని ప్రతి శాపముతో ఇద్దరు రంబాసురుడు అనే రాక్షసుడు కి యక్షకి దత్తుడు మహిషాసురుడు గాను , కరంబాసురుడు అనే రాక్షసుడుకి లీలావతి మహిషి గాను జన్మించిరి . మహిసాసుర మర్దిని తో (దుర్గాదేవి ) మహిసాసురుడు చనిపోగా మహిష తపమాచరించి బ్రహ్మ వద్ద ఎన్నో వరాలు పొంది చివరికి చావు ఉండకూడదని వారము అడుగుతుంది . పుట్టిన వానికి గిట్టక తప్పదు అని ఇంకో వారము కోరుకోమంటాడు బ్రహ్మ . హరి హర సుతుని చేతిలో తప్ప మరెవరి చేతి లో చావు లేకుండా వరము కోరిననది . హరి హరులు వివాహమాడారు గదా .. వారికి బిడ్డ పుట్టాడనే తెలివితో కోరుకున్నదీ వరము . తీరా అయ్యప్ప జన్మతో మహిష మరణిస్తుంది .
మహిషి వధ
అడవిలో నారదుడు మహిషిని కలిసి అయ్యప్పను గురించి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడు అని హెచ్చరిస్తాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళుతుంది. వీరి యిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు సమస్త దేవతలు అదృశ్యరూపంలో వస్తారు. ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చూస్తూ మహిషిని ఎదిరించాడు. అయ్యప్ప మహిషిల మద్య జరిగే భీకరయుద్ధంలో చివరిగా మహిషిని నేలపై విసిరికొడతాడు ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది.
దేవతలంతా ఆయనను స్తుతిస్తూ ఆయన ముందుకు వస్తారు. అప్పుడు శ్రీ అయ్యప్ప ఇంద్రునితో దేవేంద్రా! నేను చిరుతపులి పాలు తెచ్చే నెపంపై యిలా వచ్చాను. కాబట్టి మీరందరూ చిరుతలై నాకు తోడ్పడండి అని అడుగుతాడు. ఆయన కోరికపై అందరు చిరుతపులులుగా మారిపోయారు. ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమైన చిరుతగా మారిపోయాడు. చిరుతల దండుతో అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు.
అయ్యప్ప చరితము:
హరి హర పుత్రుడైన అయ్యప్ప పందల రాజ్యాన్ని పాలించే "రాజషేఖరపాన్ద్యుడు "నకు పంపానదీ తీరాన లభిస్తాడు . సర్పం నీడన పవళించి ఉన్న అతనికి " మణికంఠుడు " అని పేరు పెట్టి విద్యా బుద్దులు నేర్పిస్తాడు .
మనికంటుడు అనగా మన అయ్యప్ప స్వామి .. గురుకులం లో చదువుకునే రోజుల్లో వారి గురువు ఎడల్ అత్యంత భక్తీ శ్రద్దలతో వుండేవాడు . సాక్షాత్తు భగవంతుడైనప్పటికీ గురువు ద్వార సకల విద్యలు నేర్చుకున్నాడు . అయితే గురుదక్షిణగా గురువు కోరికపై అంధుడు , ముగావాడైన ఆయన పుత్రునికి మాట , ద్రుష్టి ప్రసాదించి తన గురుభక్తిని చాటుకున్నాడు . ప్రజలను భయభ్రాంతులకు లోను చేస్తున్న "వానరుడనే " బందిపోటు దొంగను ఓడించి అతనికి దివ్యత్వాన్ని బోధించాడు .
తండ్రి అప్పజేప్పబోయిన సింహాసనాన్ని త్యజిస్తాడు మనికంటుడు . ఆయన కోరికమేర తను బాణం వేసిన చోట ఓ ఆలయం నిర్మించి ఇచ్చేందుకు ఒప్పుకుంటాడు తండ్రి . అదే శబరిమల ఆలయము . అందులో మనికంటుడు అయ్యప్ప స్వామి గా అవతరిచాడు .
ఎవరైతే నియమ నిష్టలతో సేవించి "పదునేట్టాంపడి " నెక్కి దర్శిస్తారో వారికి ఆయురారోగ్య ఇష్వర్యాలను పర్సాదిస్తాడు . మాటలు రాణి వారికి మాటలు వచ్చే మహిమాన్వితమైన ప్రదేశమిది . చూపులేనివారికి చూపునిచ్చే కన్నుల పండువైన ప్రదేశమిది . భగవంమహిమ కలిగిన శబరిమలై లో గల దివ్య ఔషధాల వనములికా పరిమళ ప్రభావం తో కూడిన ప్రాణవాయువును పీల్చగానే ఎంతటి అనారోగ్యమైనా చక్కబడుతుంది . సంతానము , సౌభాగ్యము , ఆరోగ్యము , ఐశ్వర్యము మొదలైన కోరిన వరాలనిచ్చే స్వామి అయ్యప్ప
శబరిమల అయ్యప్ప ఆలయ విశిష్టత:
ఆరోజుల్లో శబరిమల వెళ్ళడానికి ఎరుమేలిమార్గం అనే ఒకే ఒక దారి ఉండేది. నెలసరి పూజలకు ప్రత్యేకపూజలకు ఆలయ సిబ్బంది, తాంత్రి, మేల్ శాంతి ఈ మార్గంలో వెళ్ళివచ్చేవారు. పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో శబరిమల యాత్రకి బృందాలుగా వెళ్ళడం అప్పటి నుండి ఆనవాయితీగా వస్తోంది.
సుమారు 200 సంవత్సరాల క్రితం అంటే (1819)లో 70 మంది శబరిమల యాత్ర చేసారని, ఆ సంవత్సర ఆదాయం ఏడురూపాయలని పందళరాజు వంశీయుల రికార్డులలో ఉంది. 1907వ సంవత్సరంలో శబరిమలలో అయ్యప్ప దేవాలయం పైకప్పు (గర్భగుడి) ఎండుగడ్డి, ఆకులతో కప్పబడివుండేది. అప్పుడు అక్కడ శిలా విగ్రహానికే పూజలు జరిగేవి. 1907-1909 మధ్యకాలంలో దేవాలయం అగ్నికి ఆహుతి అవడంతో మరల దేవాలయాన్ని పునఃనిర్మించినట్లు తెలుస్తోంది.
ఈసారి శిలా విగ్రహానికి బదులు, అయ్యప్ప విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేసి ప్రతిష్టించారు. పంచలోహావిగ్రహం ప్రతిష్ఠించాకే శబరిమల వైభవం పెరిగింది. ఈ దేవాలయం 1935 వరకు తిరువాంకూరు మహారాజా సంస్థానంవారి ఆధీనంలో ఉండేది. 1935లో దీనిని తిరువాంకూరూ దెవస్థానం బోర్డువారికి అప్పగించబడింది. ఆ తరువాతే భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో జ్యోతి దర్శనానికే కాకుండా మండల పూజ కొరకు కూడా శబరిమలలో దేవాలయం తెరవడం మొదలుపెట్టారు.
చాలక్కాయమార్గం, వడిపెరియారు మార్గం ఏర్పడి తరువాత పంబా ప్రాజెక్టు నిర్మాణంలో శబరిమలకు వచ్చే భక్తుల రద్దీ పెరిగింది. అనంతరం 1945వ సంవత్సరం నుండి భక్తుల సంఖ్య ఇంకా పెరగడంతో విషు, పంకుని ఉత్తారం, ఓణం వంటి పండుగదినాలలొ కూడా తెరవడం ప్రారంభించారు.
శబరిమలకివెళ్ళే భక్తులు పెరగడాన్ని చూసి కొందరికి కన్ను కుట్టి 1950లో దెవలయాన్ని, విగ్రహాన్ని ధ్వంసం చేసారు. అలా పరశురామ నిర్మితమైన దేవాలయం మూడుసార్లు అగ్నికి ఆహుతి అయింది. దేవస్థానం బోర్డు, భక్తుల విరాళాలతో ఇప్పుడున్న దేవాలయాన్ని పునఃనిర్మించి ఇప్పుడున్న పంచలోహ అయ్యప్ప విగ్రహాన్ని చెంగనూరు వాస్తవ్యులు శ్రీ అయ్యప్పన్, శ్రీనీలకంఠన్ అనే శిల్పులిరువురూ కలిసి రూపుదిద్దారు.
దేవస్థానం ముఖ్యతాంత్రి శ్రీకాంతారు శంకర తాంత్రి 1951 జూన్ నెలలో (07-06-1951) వేదపండితుల మంత్రాలమధ్య, భక్తుల శరణుఘోష మద్య ప్రతిష్ఠ జరిగింది. అప్పటి వరకు కేరళీ కేళివిగ్రహంగా కీర్తించబడిన అయ్యప్ప భారతీకాళి విగ్రహంగా కీర్తించబడి, నేడు భూతళీకేళివిగ్రహంగా ప్రపంచమంతటా కీర్తించబడుతున్నాడు.
శబరిమల తపస్వి శ్రీవిమోచనానందస్వామి కృషి ఎంతో మెచ్చుకోదగ్గది.
1950లో శబరిమల అయ్యప్ప ఆలయం అగ్నికి ఆహుతి అయినప్పుడు, శ్రెవిమోచనానందస్వామి హిమాలయాలలో సంచరిస్తున్నారు.బదరీనాథ్ లో ఈ వార్త విని ఒక్క శబరిమలలో దేవాలయన్ని ధ్వంసం చేసారు, కానీ, భారతదేశమంతటా అయ్యప్ప దేవాలయాలు నిర్మించి, అతిత్వరలో ప్రపంచమంతటా నిన్ను కీర్తించేటట్లు చేస్తానని శపథం చేసి, ఆ మహానుభావుడు కాశీ, హరిద్వార్, పూనా, బొంబాయి, కరుపత్తూరు, శ్రీరంగపట్టణం, మున్నగు పట్టణాలలో అయ్యప్పదేవాలయాలు నిర్మించడానికి దోహదం చేసారు. నేడు ఆయన కోరిక నెరవేరి దేశమంతటా ఎన్నొ అయ్యప్ప దేవాలయాలు నిర్మించారు.నేడు శబరిమల యాత్రకు భారతీయులే కాక విదేశీయులూ వచ్చి దర్శించుకోవడం విశేషం.
శబరిమలకు వచ్చే భక్తులు పెరగడంతో 1980 నుండి దేవస్థానం బోర్డువారు శ్రద్ధ తీసుకొని పంబపై వంతెన, పంబ నుండి విద్యుద్దీపాలు, మంచి నీటి కొళాయిలు, స్వాముల విశ్రాంతి కోసం పెద్ద షెడ్లు నిర్మించారు.
1984 వరకు పదునెట్టాంబడిని ఎక్కడానికి పరశురామ నిర్మితమయిన రాతిమెట్లపైనుండే ఎక్కేవారు. వారువెళ్ళే పడిని బట్టి ఆ మెట్టుపై కొబ్బరికాయ కొట్టి మెట్లు ఎక్కే ఆచారం ఉండేది. మెట్లు అరిగిపోయి, అన్ని మెట్లపై కొబ్బరికాయలు కొట్టడం వలన భక్తులు అనేక ఇబ్బందులకు గురికావడం చూసి, భక్తుల విరాళాలతో పదునెట్టాంబడికి 1985వ సంవత్సరంలొ పంచలోహ కవచాన్ని మంత్రతంత్రాలతో కప్పడం జరిగింది. దీనివలన 18 మెట్లు ఎక్కడం సులభరతమైంది. భక్తుల రద్దీ పెరగడం వలన తొక్కిసలాటలు లేకుండా ఉండటానికి వీలుగా, 1982లో ప్లై ఓవరు బ్రిడ్జి కట్టి దానిపై నుండి పదునేట్టాంబడి ఎక్కిన తర్వాత క్యులో వెళ్ళడానికి ఏర్పాటు చేసారు.
కొండపైనుండి మాలికాపురత్తమ్మ గుడివరకు ప్లైఓవరుబ్రిడ్జి కట్టడం వలన యాత్రీకులు తిరగడానికి వీలుగావుంది. 1989-90లోనే పంబామార్గంలో కొంతభాగం, సన్నిధానం ఆవరణలో మొత్తం భాగం సిమెంటు కాంక్రీటు చేసి, బురద లేకుండా చేసి భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా తయారు చేసారు.
1985 నుండి పక్కా బిల్డింగులెన్నో అక్కడ నిర్మించబడి, శబరిమల స్వరూపాన్ని మార్చాయి. బెంగళూరు భక్తుడొకరు శబరిమలగర్భగుడిపైన, చుట్టూ బంగారు రేకులతో తాపడం చేయడానికి పూనుకొని 2000 సంవత్సరంలో పూర్తిచేయడంతో శబరిమల స్వర్ణదేవాలయంగా మారింది.
శబరిమలలో వంశపారంపర్య ముఖ్యపూజారిని తాంత్రి అని పిలుస్తారు. వీర్ని పరశురాముడు పూజ కొరకు ఆంధ్రాలో కృష్ణాజిల్లా నుండి తీసుకెళ్ళారని చెబుతారు. ప్రస్తుతం, శ్రీరాజీవ్ తాంత్రి ఆధ్వర్యంలో శబరిమల దేవాలయంలో పూజలు జరుపబడుతున్నాయి. శబరిమల దేవాలయంలో పూజలు జరిపించడానికి మేల్ శాంతిని (పూజారి) ప్రతి సంవత్సరం లాటరీ ద్వారా ఎన్నుకొంటారు. దేవస్థానంవారికి వచ్చిన దరఖాస్తులని పరిశీలించి పదింటిని సెలక్టు చేసి వారి పేర్లను రాసి ఒక డబ్బాలో ఉంచి,అయ్యప్ప విగ్రహం ముందుంచి ఒక చిన్నపిల్లవాని చేత లాటరీ తీయిస్తారు. ఎవరు పేరు వస్తే, వారు ఆ సంవత్సరనికి మేల్ శాంతిగా శబరిమలలో వ్యవహరిస్తారు.
స్వామి వారి ఆభరణాలను పందళంలో భద్రపరచి ఉంచుతారు. ప్రతీయేటా జనవరి 14 తారీఖునాటికి (మకరసంక్రాంతి) శబరిమల మూడుపెట్టెలలో పందళం నుండి 84 కిలోమీటర్లు ఆడవులలో నడుచుకొని మోసుకువస్తారు. ఈ ఆభరణాలు తేవడానికి పందళంలో భాస్కరన్ పిళ్ళే వారి కుటుంబం ఉంది. వీరు మొత్తం 11 మంది. దీక్షలో ఉండి (65 రోజులు) తిరువాభరణాలను శబరిమల మోసుకువస్తారు.
వీరు జనవరి 12 మధ్యాహ్నం పందళంలో బయలుదేరి మధ్యలో రెండు రాత్రిళ్ళు విశ్రాంతి తీసుకొని, 14 తారీఖున సాయంత్రం 6 గంటలకు శబరిమల సన్నిధానం చేరుతారు. ఆభరణాల వెంట పందళరాజు వంశస్తులలో పెద్దవాడు కత్తి పట్తుకొని నీలిమల వరకు వచ్చి అక్కడ విశ్రమిస్తాడు. తిరు ఆభరణాలు స్వామివారికి అలంకరించి కర్పూరహారతి గుళ్ళో ఇవ్వగానే తూరుపుదిక్కు పొన్నంబలమేడు నుండి భక్తులకు జ్యోతి దర్శనం అవుతుంది. పదునెనిమిది మెట్లు ఎక్కడానికి ఇరుముడి లేకుండా తాంత్రీ, పందళరాజు, తిరువాభరణాలు మోసేవారు ఎక్కుతారు.
మరల జరవరి 20వ తారీఖునాడు పందళరాజు వెంటరాగా తిరువాభరణాల మూడు పెట్టెలను తిరిగి పందళం తీసుకు వెళ్ళి భద్రపరుస్తారు.
అయ్యప్ప భక్తజనవత్సలుడు. ఆయన అనుగ్రహం ఉంటే మనం సాధించలేనిదంటూ ఏమీ లేదు. ఆయనను ఒకసారి దర్శించుకున్న భక్తులు మళ్ళీ మళ్ళీ ఆయన దర్శనం కోసం మరొక సంవత్సరం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. అదీ ఆయన మహిమ.
ఓం స్వామియే శరణమయ్యప్ప!!
శరణుఘోష ప్రియుడు
అయ్యప్ప 'ఓంస్వామియే శరణమయ్యప్ప, హరిహరసుతనే శరణమయ్యప్ప, ఆపద్బాంధవునే శరణమయ్యప్ప!' అంటూ అయ్యప్ప భక్తులు భగవంతుని శరణుకోరే విధానాన్నే శరణు ఘోష అని వ్యవహరిస్తారు. అడవులలో కొండలలో నడచి వెళ్ళే స్వాములకు (భక్తులకు) శరణు ఘోష రక్ష. యాత్రచేసే బృందం అందరూ ఒక్కసారి స్వామివారి శరణు ఘోష చెప్పి అడవిని దద్దరిల్లజేస్తారు. ఒక రకంగా అడవిలో రాళ్ళు, ముళ్ళు కాళ్ళకు గుచ్చుకున్నా బాధ తెలియకుండా అయ్యప్పస్వామిపైనే మనసు లగ్నం చేసి నడవడం ఒక ఎత్తయితే బిగ్గరగా చేసే శరణుఘోషకి భయపడి అడవిలో తిరిగే క్రూరమృగాలు దూరంగా పారిపోతాయి.
నెత్తిపైన ఇరుముడి వుండడం వలన దిక్కులు చూడడానికి, ఇష్టం వచ్చినట్లు నడవడానికి కుదరదు. ఒక వైపు ఇరుముడిని కాపాడుకుంటూ నేలవైపు చూస్తూ భక్తి శ్రద్దలతో స్వామివారి శరణు ఘోష చెబుతూ ప్రయాణించడమే యాత్రలో విశేషం. వ్యర్థ ప్రసంగాలకు యాత్రలో సమయం చిక్కదు. శబరిమల యాత్రలో విశిష్టత అదే!
అయ్యప్ప కులం, మతం, అంతస్తు, హోదా అనీ మరచి అయ్యప్పస్వామి వారి ముందు అంతా సమానమేనని తెలియజేసే యాత్ర, సర్వమానవ సౌభ్రాతృత్వానికి అర్థం తొలిసారిగా శబరిమల యాత్రలోనే తెలుస్తుంది. ముక్కు ముఖం తెలియకపోయినా, అడవిలో సాటి అయ్యప్ప భక్తునికి చేతిని అందించి సాయం చేస్తారు. నడవలేని స్వాములకు చేయూత అందించి నడిపిస్తారు. ఒక్కొక్కసారి ఇద్దరు స్వాములు కలిసి నడవలేని స్వామి రెండుచేతులను వారి భుజాల పై వేసుకొని అతన్ని మోస్తూ నడిపిస్తారు.
అడవిలో క్రూరమృగాలు తిరుగుతున్నా శబరిమల యాత్ర చేసే అయ్యప్ప భక్తులకు హాని చేయకుండా వుండడానికి (ఎరుమేలి నుండి వనయాత్ర 70 కిలోమీటర్లు) యాత్ర ప్రారంభంలో మంత్రించి నీళ్ళు జల్లుతారని చెబుతారు. అదికాక అడవిలో అక్కడక్కడ 'వడివడివాడు ' పేర మందు గుండు సామాగ్రితో అడవి దద్దరిల్లేలా ఔట్లు పేలుస్తారు. యాత్ర చేసే స్వాములు ఒక రూపాయి ఇస్తే వారి పేరు మైకులో చెప్పి ఔట్లు పేల్చే పద్దతి అక్కడ వుంది. కేరళలో చాలా దేవాలయాలలో ఇప్పటికీ అడవులలో లేకపోయినా ఔట్లు పేల్చే సాంప్రదాయం వుంది.
శబరిమల యాత్ర చేయించడానికి, అయ్యప్ప దీక్ష సక్రమంగా కొనసాగించడానికి గురుస్వామి నావకు చుక్కానివంటివాడు. మిలట్రీ కమేండరు సైనికులకు శిక్షణ ఇచ్చి యుద్దానికి తయారు చేసినట్లు గురుస్వామి బృందంలో వెంట వచ్చే స్వాములకు భక్తి శిక్షణ ఇచ్చి క్రమశిక్షణతో యాత్రను జరిపిస్తారు. గురుస్వామి బృందంలో ఉన్న స్వాములను ప్రోత్సహించి అడవి మధ్యలో వారి పేర ఔట్లు పేల్చేటట్లు చేస్తారు.
యాత్రలో ఇది ఒక తీయని అనుభవం. మంచి గురుస్వామి దొరికితే దీక్ష, యాత్ర నల్లేరు మీద బండి ప్రయాణంలా సాగుతుంది. గురుస్వామి నిస్వార్థపరుడై, ఆధ్యాత్మిక భావం కలిగి అయ్యప్ప దీక్ష, శబరిమలయాత్ర చాలాసార్లు చేసి అక్కడ జరిగే పూజలు, పద్దతులు తెలుసుకొని తన వెంట వచ్చే స్వాములకు పూజలు, భజనలు శ్రద్దగా చేయించి, మెడలో మాల విసర్జన చేసే వరకు బృందంలో వెంటవచ్చే అందరు స్వాములకు బాధ్యత వహించి యాత్ర నుండి సురక్షితంగా ఇంటికి చేర్చాలి. అలా సేవాభావం, అంకితభావంతో చేసే వాడే నిజమైన గురుస్వామి. అటువంటి గురుస్వామి వెంట వెళ్తేనే శబరిమల యాత్రాలక్ష్యం నెరవేరుతుంది. సద్గురునాథనే శరణుమయ్యప్ప!
స్వామి శరణు ఘోషప్రియుడు కాబట్టే యాత్రలోనే కాకుండా నిత్యం చేసే పూజలు, భజనలలో కూడా శరణుఘోషకే ఎక్కువ ప్రధాన్యత ఇచ్చి, స్వాములందరి చేత శరణాలు చెప్పించి గురుస్వామి పూజలు జరిపిస్తారు. మండల కాలం (నలభై ఒక్క రోజుల) పూజ, భజన సమయంలో శరణు ఘోష చెప్పడం వలన దీక్షలో యాత్రలో నిద్రపోతున్నా నోటి నేంట స్వామివారి శరణాలే పలుకుతాయి. ' అహం బ్రహ్మస్మి, తత్వమసి ' సిద్ధాంతంతో అయ్యప్ప దీక్ష ముడిపడి ఉంది. తనలో అయ్యప్పని దర్శించుకొని ఇతరులలో కూడా అయ్యప్పను దర్శించాలి. ఆ భావనతోనే దీక్షలో ఎవరైనా స్వామి కనిపించగానే శరణం అని చెప్పి నమస్కరించడం, ఒక్కొక్కసారి పాదాభివందనం చేయడం అయ్యప్ప దీక్షలో శరణాగతికి నిదర్శనం.
మానవ సేవే మాధవ సేవగా చెప్పేది కూడా అయ్యప్ప దీక్ష అవడం వలన విరివిగా దాన ధర్మాలు చేస్తూ, అన్నదానం జరిపిస్తారు. సాటి మనిషికి సాయం చేసే అహంకారాన్ని వదుకుకొంటారు. బ్రహ్మచర్య వ్రతం, చన్నీటి స్నానం, నేలపై పడక, మితాహారం, సాత్వికాహారం, ఒంటిపూట భోజనం, దీపారాధన, పూ భజనలు రోజూ చేయడం వలన మంచి క్రమశిక్షణ అలవడి ఆధ్యాత్మికంగా ఎదగడానికి బాగా తోడ్పడుతుంది.
స్వామి ఆరాధనే ధ్యేయంగా భక్తి యాత్ర
అయ్యప్ప భక్త ప్రహ్లాద,కన్నప్పల కథలు మనం చదివాం.కానీ ఇప్పుడు భక్త అయ్యప్పలను స్వయంగా చూస్తున్నాం.కానీ అదే రకమైన అకుంఠిత దీక్ష,దృఢత్వం గలవారు లేకపోలేదు.నియమ,నిబంధనలను గాలికి వదిలేసి,పేరుకు మాత్రమే భక్తులయ్యేవారు లెక్కలోకి రారు.నిజమైన ఆరాధనలో నిండా మునిగిపోయే స్వాముల గురించే ఇప్పుడు ప్రస్తావించేది.ఒక నిజమైన ఆధ్యాత్మిక దృష్టిపరులకు అది అసాధ్యమేమీ కాదు.స్వామి ఆరాధనే ధ్యేయంగా గలవారికి నలబై ఒక్క రోజులు ఒక్క లెక్కకాదు.నిష్కల్మష,సహసోపేత భక్తి భావనే అంతటి ఉన్నత స్థానానికి ఎవరినైనా తీసుకెళుతుంది. అటువంటి అసలైన అయ్యప్పలకు దైనందిన జీవనంలోని సుఖాలు,సౌఖర్యాలు గుర్తుకురావు.
ఏడాది పొడువున చైన్ స్మోకింగ్, మద్యపానం,ఇతరత్రా దురలవాట్లతో కాలం గడిపేవారు సైతం ఆ సమయంలో వాటికి దూరం కావడం చూస్తే ఎంతటి కార్యమైనా మనిషికి సాధ్యమే అనిపిస్తుంది. కాకపోతే ప్రతి ఒక్కరికి ఉండవలసింది,ఆ మేరకు దృడమైన సంకల్పం మాత్రమే అన్నది స్పష్టమవుతుంది. అయ్యప్ప దీక్ష తీసుకోవాలన్న తలంపే చాలామందికి రాదు. వచ్చిన వారిలో దానిని ఆచరణలోకి తెచ్చేవారు మరీ తక్కువ. ఆచరించే ప్రతి ఒక్కరిలో ధృడ చిత్తం ఉంటేనే అది సాధ్యం.అలా అని దీక్ష తీసుకుంటున్న అయ్యప్పల సంఖ్య తక్కువేమీ లేదు.ఏడాది కేడాది కొత్తగా దీక్ష స్వీకరిస్తున్న కన్నెస్వాముల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సంవత్సరంలో జోరుగా సాగే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి-మూడు నెలల్లో అయ్యప్ప వ్రతదీక్ష స్వీకరించి,కేరళలోని శబరిమలకు వెళ్ళి వస్తున్న వారి సంఖ్య ఒక అంచనా ప్రకారం సుమారు యాబై లక్షలు.
ఎందుకు భయం?
అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడానికి చాలామంది ముందుకు రారు.ఎందువల్ల? ఈ ప్రశ్నకు చాలామందికి తెలిసిన జవాబు "అది అత్యంత కఠినతరమని". ఇదొక్కటి మాత్రమే కాదు,వారు "శబరిమల యాత్ర" తప్పనిసరిగా చేయాలి.నలబై ఒక్క రోజులకు బదులు ఏదో కొద్ది రోజులు మాల వేసుకొని,శబరిమల వరకు వెళ్ళకుండా, మరెక్కడో ఒక అయ్యప్పస్వామి ఊరువెళ్ళి దీక్షను ముగించే వారి గురించి కూడా వింటున్నాం. నిబంధన ప్రకారమైతే దీక్ష ఎంత కఠినమో శబరిమల యాత్ర కూడా అంతే సాహసోపేతం. చాలామందిని భయపెడుతున్న అంశాలలో ఇదీ ప్రధానమైంది. దైవం వల్ల పరిపూర్ణ విశ్వాసం,ప్రేమతో ముందుకు వస్తే అలాంటి భయాలేవీ ఉండవు.
యాత్ర అంత కష్టమా?
నిజానికి "శబరిమల"యాత్ర అంత కష్టమా?ఎందరు దీక్ష కష్టాలు లేకుండా సివిల్ డ్రెస్సులో అక్కడికి వెళ్ళి రావడం లేదు? పిల్లలు, వృద్ధ స్త్రీలు,వృద్దులు, వికలాంగుల సైతం అనేక కష్టాలకు ఓర్చుకుంటూ అడవి మార్గంలో కాలినడకన వెళ్ళగా లేనిది అన్నీ ఉన్న అనేకమంది అందుకు ముందుకు రాకపోవడానికి అసలైన కారణం "సంకల్ప లోపం". వారికి నిజంగా దైవం మీద భక్తి ఉంటే ఎవరికీ తెలియని ఆధ్యాత్మిక శక్తి స్వయంగా వారిని నడిపించుకుంటూ వెళుతుంది. దీక్ష తీసుకున్న వారికి అడుగడుగునా కష్టాలు కలగడం సహజం. అవి కేవలం స్వామి పరీక్షలే తప్ప మరోటి కాదనుకోవాలి.
చివరకు ఆ భగవంతుడి మీదే సమస్త భారాలు వేసి అన్నింటినీ, అందరినీ వదిలి అడవి మార్గంలో బయలుదేరుతారు. నియమాలు,నిష్టల విషయంలో ఏ మేరకు క్రమశిక్షణను పాటిస్తామన్న దానిపైనే వారి భక్తి నాణ్యత ఆధారపడి ఉంటుందన్నది గుర్తుంచుకోవాలి. మొట్టమొదటి సారి దీక్ష తీసుకొనే వారు విధిగా పెద పాదం గుండానే వెళ్ళాలన్న నియమం ఒకటి ఉంది. భయపడే వారు భయపడుతున్నా, ప్రగాఢ భక్తి తత్పరతతో ఆ మార్గం గుండానే వెళుతున్నవారు లక్షల సంఖ్యలో కనిపిస్తారు.
"పెద పాద" మార్గమంతా చిట్టడవి!
అయ్యప్ప ఇరుమేలి నుండి పంబదాకా ఉన్న పెదపాదం మార్గం మొత్తం చిట్టడవి. అసాధారణంగా పెరిగిన వృక్షాలు, కొండలు, లోయలగుండా ప్రయాణం సాగుతుంది. ఎరుమేలి వరకు బస్సులో వెళ్ళవచ్చు.అక్కడ్నించి యాత్రికులు పంబమీదుగా శబరిమల దాకా కాలి నడకన వెళ్తారు. తలపై ఇరుముడులు పెట్టుకొని,పాదరక్షలు లేకుండా కీకారణ్యంలో రాళ్ళు రప్పల మీదుగా, అస్త వ్యస్తమైన మార్గం గుండా రాత్రింబవళ్ళు సాగుతారు.నిజానికి అది దేశంలోని మొత్తం 27 టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లలో ఒకటి. అయ్యప్పలు సంచరించేకాలంలో వనంలోని క్రూరమృగాలు దూర ప్రాంతానికి వలస పోతాయని చెబుతారు. ఇన్నేళ్ళుగా సాగుతున్న ఈ యత్రలో ఒక్క పెద్ద వన్యమృగమైనా స్వాములను ఇబ్బంది పెట్టిన సందర్భం లేదు.
"మకర జ్యోతి"దర్శన భాగ్యం
ప్రతి సంవత్సరం జనవరి 15 సంక్రాంతి పర్వ దినాన దర్శనమిచ్చే "మకరజ్యోతి"ని దర్శనం చేసుకోవడం ప్రతి ఒక్క స్వామికీ పెద్ద పరీక్ష అనాలి. ఆ రోజు అయ్యప్ప జ్యోతిరూపంలో ప్రత్యక్షమౌతాడు. కాబట్టి ప్రతి ఒక్కరికీ ఆ అద్భుతాన్ని కళ్ళారా చూడాలన్న కాంక్ష ప్రగాఢంగా ఉంటుంది. లక్షలాది స్వాముల శరణుఘోషుల మధ్య, కర్పూర హారతుల ధూపకాంతుల నడుమ ఆకాశంలో మకర నక్షత్రం మిలమిలా మెరుస్తుంది.
ఎక్కడ ఉంది?
దక్షిణ భారతంలోని పశ్చిమ కనుమలకు చెందిన దట్టమైన అరణ్యంలో కొండకోనల మధ్య శబరిమల నెలకొని ఉంది. రాష్ట్ర రాజధాని తిరువనంతపురం (ట్రివేండ్రం)కు 180 కి.మీ.దూరంలో ఉంటుంది. రైలులో వెళ్ళే యాత్రికులకు కొట్టాయం లేదా ఎర్నాకులం (కొచ్చి) అనుకూలమైన కూడళ్ళు. రోడ్డు మార్గంలో అయితే ఎరుమేలికి 64 కి.మీ.దూరం, పంబ నుండి 5 కి.మీ.దూరం ఉంటుంది.శబరిమల వరకూ వాహన సౌకర్యం లేదు. పంబ వరకు వాహనంలోనో లేదా కాలినడకనో వెళ్ళి,అక్కడ్నించి తప్పనిసరిగా కాలినడకన కానీ, లేదా డోలీలో కానీ వెళ్ళాల్సిందే.
ఎవరైనా వెళ్ళవచ్చు!
శబరిమలకు ఎవరైనా,ఎప్పుడైనా వెళ్ళవచ్చు.కాకపోతే అక్కడ అయ్యప్పస్వామి దేవాలయం తెరచే కాలం మాత్రం సంవత్సరంలో ఆయా నిర్థిష్ట సమయాలలోనే. అటు దైవభక్తి, ఇటు ప్రకృతి ఆరాధన రెండూ ఏకకాలంలో కావాలనుకునే వారికి శబరిమల ఒక అద్భుతమైన యాత్ర.కాబట్టి, దీక్ష తీసుకోని వారి సైతం అక్కడికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవచ్చు.కాకపోతే ఆలయం ముందున్న పరమ పవిత్రమైన పద్దెనిమిది మెట్లను మాత్రం కేవలం దీక్షపరులైన "అయ్యప్ప"లు మాత్రమే అధిరోహిస్తారు.
శ్రీ అయ్యప్ప వారి దివ్య చరితము
దేవతలపై పగ సాధించాలని మహిషి అనే రాక్షసి బ్రహ్మగురించి తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. శివుడికి కేశవుడికి పుట్టిన కొడుకు తప్ప నన్నెవరూ జయించకూడదు. అదీ కూడ ఆ హరిహర తనయుడు పన్నెండేళ్ళపాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవా ధర్మం నిర్వర్తించాలి. అలా కానిపక్షంలో అతడు కూ నా ముందు ఓడిపోవాలి'' అని వరం కోరింది మహిషి. తధాస్తు అనేసి తన లోకానికి వెళ్ళిపోయాడు బ్రహ్మ. పాల సముద్రంలో ఉద్భవించిన అమృతాన్ని దేవ, దానవులకు పంచడానికై శ్రీహరి మోహినీ రూపాన్ని దాల్చాడు. పరమేశ్వరుడు ఆ సర్వాంగ సుందరియైన మోహిని పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము, 30వ రోజు శనివారం పంచమి తిధి, ఉత్తరా నక్షత్రం వృశ్చిక లగ్నమందు శాస్త(అయ్యప్ప) జన్మించాడు. ఇతడు శైవులకు, వైష్ణవులకు ఆరాధ్య దైవం. తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు ధర్మశాస్త.
అదే సమయంలో దైవ ప్రేరణవలన వేట నిమిత్తం అటుగా వచ్చాడు రాజశేఖరుడు అనే పందళ దేశాధీశుడు, శివభక్తుడు. సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని నమ్మాడు. రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురానికి తీసుకువెళ్ళాడు. ఆ శిశువును చూసి అతని రాణి కూడ ఎంతగానో ఆనందించింది. వారెంతో వాత్సల్య అనురాగాలతో ఆ శిశువును పెంచసాగారు. ఆయన అంతఃపురంలో అడుగుపెట్టిన వేళా విశేషమేమోగాని, ఏడాది తిరిగే సరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవించింది. మణికంఠుని సాత్విక గుణాలవల్ల కొందరు అయ్యా అని మరికొందరు అప్పా అని, మరికొందరు రెండు పేర్లూ కలిపి అయ్యప్ప అని పిలిచేవారు. తగిన వయసురాగానే మహారాజు కొడుకులిద్దర్నీ గురుకులానికి పంపించారు. రాజ గురువు అయ్యప్పను అవతారపురుషునిగా గుర్తించాడు. అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేశాడు. అయ్యప్ప అడవికి బయలుదేరాడు.
ఇంతలో నారధుడు మహిషి అనే రాక్షసిని కలిసి ``నీ చావు దగ్గరపడింది. రేపో, మాపో చస్తావని'' హెచ్చరించాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి సిద్ధపడి చెంగున ఒక్క దూకు దూకింది. వీరి యిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు వచ్చిన దేవతలతో పాటు గరుడ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురష, సిద్ధ, సాధ్య, నారదాది ఋషి పుంగవులతో నింగి నిండిపోయింది. వీరి భీకరయుద్ధంలో భాగంగా ఆ మహిషిని ఒక్క విసురు విసిరాడు. నేల మీదపడి రక్తసిక్తమై కన్నీటితో చావు మూలుగులు మూలుగుతున్న ఆ మహిషి శరీరంపై తాండవమాడాడు. ఆ దెబ్బకి ఆ గేదె మరణించింది. దేవతలంతా ఆయన ముందుకు వచ్చారు. అప్పుడు శ్రీ అయ్యప్ప ``దేవేంద్రా! నేను చిరుతపులిపాలు తెచ్చే నెపంపై యిలా వచ్చాను. కాబట్టి మీరందరూ చిరుతలై నాకు తోడ్పడండి'' అన్నాడు. అందరు చిరుతపులులుగా మారిపోయారు. ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమైన చిరుతగా మారిపోయాడు. చిరుతదండుతో అయ్యప్ప తన రాజ్యం చేరాడు.
అయ్యప్ప మంత్రిని పిలిచాడు ఇవిగో చిరుతపులులు, మీ వైద్యుణ్ణి పిలిచి పులి పాలు కావాలో చెప్పమను'' అన్నాడు. మంత్రి అయ్యప్ప పాదాలపై పడి శరణుకోరాడు. అయ్యప్ప అతడ్ని క్షమించాడు. అనంతరం ``తండ్రీ! నా జన్మకారణం నెరవేరింది. తము్మడైన రాజరాజన్నే పట్టాభిషిక్తుణ్ని చేయండి. నేను శబరిమలై చేరి సమాధిపొందుతాను నాకు ఆలయం కట్టించండి. నేను ఇక్కడ నుండి ఒక కత్తి విసురుతాను. అదెక్కడ పడితే అక్కడే చిన్ముద్ర. అభయహస్తాలతో సమాధిలో కూర్చుని అనంతరం పరమాత్మలో చేరతాను. నా చెంతనే మల్లిగపురత్తమ్మకు స్థానం య్యివండి. మిత్రుడైన వావరన్కు ఓ ఆలయం కట్టించండి.
సమాధికి వెళుతూ ఇలా అన్నాడు స్వామి, తండ్రీ! సంవత్సరానికి ఒక్కసారి మకర సంక్రాంతినాడు ఇతర భక్తులతోబాటు మీరు అక్కడికి వచ్చి నా దర్శనం పొందవచ్చు. నేను ధరించే ఆభరణాలన్నీ యిప్పుడు మీకు యిస్తాను. నా ఆలయానికి వచ్చినప్పుడు వీటిని కూడా తెచ్చి నా విగ్రహానికి అలంకరించి ఆనందించండి. నాకు ఎడమవైపుగా లీలా కుమారి కోసం నిర్మించే ఆలయంలోనే మా అన్నగారైన శ్రీ గణపతికి కుడురవన్, కుడుశబ్దన్ కురుప్పన్ మొదలైన భూతగణాలకి, నాగరాజుకి తావిచ్చి ప్రతిష్టలు జరిపించండి. బాబరన్కి ఎరుమేలిలో ఆలయం నిర్మించండి. నా దర్శనానికి వచ్చే వారంతా ముందుగా మీ దర్శనం చేసుకోవాలి. అటు తర్వాతనే నా దర్శనానికి రావాలి'' అని తన ఆభరణాలను తీసి యిచ్చేశాడు. ఆపై అయ్యప్ప సమాధినిష్ఠుడయ్యాడు. శబరిమలై ఆలయం వెలిసింది. శరణాగత రక్షకుడైన శ్రీ అయ్యప్ప స్వామివారి దివ్యాతి దివ్యమైన చరిత్ర సంపూర్ణం.

 
 
 
 
 
 
0 Comments