చెట్టుకు ప్రదక్షిణము చేయడం వల్ల ఫలితం - మనఃశాంతి, లక్ష్మీకటాక్షం, మంత్రఫలితం గురించి.
మన పురాణాలు చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే వచ్చే శక్తిని మంత్రోక్తంగా వర్ణించాయి.
రావి చెట్టు:
ఒకసారి చుడితే "ఓం నమో నారాయణాయ" అష్టాక్షరీ మంత్రమును 108 సార్లు జపం చేసిన ఫలితం పొందుతారు.
మర్రి చెట్టు:
"ఓం క్లీం కృష్ణాయ గోపీజనవల్లభాయ స్వాహా" అనే కృష్ణమంత్రం జపం చేసిన ఫలితం లభిస్తుంది.
తులసి చెట్టు:
లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది."
కడిమి చెట్టు (కదంబవృక్షం):
లలితా సహస్రనామ, బాలా మంత్ర, షోడశాక్షరీ మంత్ర జపం చేసిన ఫలితాన్ని ఇస్తుంది.
మేడి చెట్టు (ఔదుంబర వృక్షం):
అమ్మవారి యొక్క నవార్ణ మంత్రము, శ్రీ దత్త మూల మంత్ర అనుష్ఠాన ఫలితం పొందుతారు.
బిళ్వ వృక్షం:
ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే "ఓం నమః శివాయ" పంచాక్షరీ మంత్రాన్ని 1000 సార్లు జపించిన ఫలితం.
జమ్మి చెట్టు:
శని అనుగ్రహం పొందటానికి మార్గం.
రావి చెట్టు:
గురువు అనుగ్రహం కలుగుతుంది.
జిల్లేడు చెట్టు:
సూర్య భగవానుడి అనుష్ఠాన ఫలితం లభిస్తుంది.

 
 
 
 
 
 
0 Comments