ఇవి తింటే డార్క్ సర్కిల్స్ మాయం
పోషకాహారం లోపం, తగినంత నిద్రలేకపోవడం, విపరీతమైన అలసటలాంటి కారణాల వల్ల కళ్ల కింద నల్లని వలయాలు (డార్క్ సర్కిల్స్) ఏర్ప డుతుంటాయి. వీటిని తొలగించుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం...
◾కీర, పుచ్చకాయలలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని తరచూ తినడం వల్ల శరీ రంలో రక్త ప్రసరణ మెరుగుపడడంతోపాటు చర్మానికి తగినంత తేమ అందుతుంది. దీంతో కళ్ల కింద వాపు, నల్ల మచ్చలు తగ్గుతాయి.
◾టమాటాలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కళ్ల కింద నల్లని వలయాలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. రోజూ ఆహారంలో టమాటాలను చేర్చుకోవడం వల్ల సమస్య తీరుతుంది.
◾బొప్పాయి పండులో పపైన్ అనే ఎంజైమ్తో పాటు ఎ, సి విటమిన్లు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. పండిన బొప్పాయి పండును తినడం వల్ల కళ్ల కింద చర్మం కాంతి వంతంగా మారుతుంది.
◾బీట్ రూట్ లో చర్మాన్ని రక్షించే యాంటీ ఆక్సి డెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మం పొరల్లో పేరుకున్న వ్యర్థాలను తొలగిస్తాయి. వారానికి రెండుసార్లు బీట్రూట్ను ఆహారంలో చేర్చుకుంటే మొటిమలు, నల్ల మచ్చలతోపాటు కళ్ల కింద ఏర్పడే డార్క్ సర్కిల్స్ మాయమవు తాయి.
◾పాలకూర, తోటకూరల్లో కె విటమిన్ అధికంగా ఉంటుంది. ఇది చర్మానికి రక్త ప్రసరణ అందేలా చేస్తుంది. రోజూ ఈ ఆకుకూరలను తింటూ ఉంటే కళ్ల కింద చర్మం బిగుతుగా ఛాయగా మెరుస్తుంది.
◾చర్మం తేమతో నిండి ఉంటే కళ్ల కింద నల్లని వలయాలు రావు. కాబట్టి రోజుకి కనీసం నాలుగు గ్లాసుల మంచినీరు తాగడం అలవాటు చేసుకోవాలి.
◾బాదం, పల్లీలు, బ్రోకలీ, పొద్దు తిరుగుడు గింజలు, గుమ్మడి గింజల్లో ఇ విటమిన్ అధి కంగా ఉంటుంది. రోజూ వీటిని తగుమాత్రంలో తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం కనిపిస్తుంది.
◾రోజుకు ఒక నారింజ పండు తినడం వల్ల కొల్లా జెన్ ఉత్పత్తి పెరిగి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో డార్క్ సర్కిల్స్ వాటంతట అవే మాయమవుతాయి.
.jpeg)
0 Comments