కుజదోషం - జ్యోతిష్య విశ్లేషణ
కుజదోషం గురించి చాలామంది చాలా రకాలుగా చెబుతూ ఉంటారు. కుజదోషానికి కొన్ని లక్షణాలు ఉంటాయి ఈ లక్షణాలు జాతకుడులో కనిపిస్తే కుజ దోషం ఉన్నట్లుగా తెలుసుకోవచ్చు. జాతకంలో కుజుడు లగ్నాత్తు లేదా శుక్ర లేదా చంద్రుడు నుండి 1 2 4 7 8 12 స్థానాలలో కుజుడు ఉన్నప్పుడు కుజదోషం ఉన్నట్టుగా భావిస్తారు.
కొందరు జ్యోతిష్యులు అయితే కుజదోషం ఉంది కానీ భంగం అయినది కావున కుజదోషం లేదు అని చెబుతుంటారు. ఈ కారణాల వలన జాతకుడు తనకు కుజదోషం ఉందా లేదా అనేది కన్ఫ్యూజ్ అవుతుంటారు. జాతకుడు తనకు కుజదోషం ఉందా లేదా అనేది కొన్ని లక్షణాలు తన జీవితంలో ఆక్టివేట్ అవుతుంటే కుజదోషం ఉందని ఉందని తెలుసుకోవచ్చు. కుజుడు జాతకంలో రెండవ స్థానంలో ఉన్నప్పుడు జాతకుడు సాధారణంగా మౌనంగానే ఉంటారు ఎవరితో అయినా ఘర్షణ వచ్చినప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలు చాలా కఠినంగా ఉంటాయి.
అంతేకాకుండా ఉమ్మడి కుటుంబంలో ఉన్నవారైతే కుటుంబం నుండి వేరేగా ఉండాలి అనే ఆలోచనలు వివాహానికి ముందు నుండే ఉంటాయి. నాలుగో స్థానంలో కుజుడు ఉన్నప్పుడు జాతకుడు ఏ విషయంలోనూ తృప్తి పొందడు. సొంత ఇల్లు కావాలని అన్ని సుఖ భోగాలను వదులుకుంటాడు. చేతిలో ఎంత డబ్బు ఉన్నప్పటికీ సుఖ భోగాలను అనుభవించలేడు. కుజుడు 7 లేదా8 స్థానాలలో ఉన్నప్పుడు ఆడవాళ్లకు అయితే మగవారిపైనా, మగవారైతే ఆడవాళ్ళ పైన విపరీతంగా వ్యామోహం ఉంటుంది.
వీరికి ఎన్ని సంబంధాలు చూసినప్పటికీ 25 సంవత్సరాల వయసు దాటిన తర్వాత మాత్రమే వివాహం అవుతుంది. ఆడవాళ్లకు ఎనిమిదో స్థానంలో కుజుడు ఉన్నప్పుడు వివాహం అయిన తర్వాత భర్తకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఎనిమిదో స్థానంలో కుజుడున్న అమ్మాయిలు వివాహానికి ముందు చిన్నగా పరిహారం చేయించుకోవాలి. 12వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు జాతకునికి శరీరం వేడిగా ఉంటుంది.
వీరు ఏదైనా ఒక కుర్చీలో గాని సోఫాలో గాని కొద్ది సమయం కూర్చుని లేచిన తర్వాత ఆ చైర్ కానీ సోఫా గాని కొద్దిసేపు వేడిగా ఉంటుంది. 12వ స్థానంలో కుజుడు ఉన్న జాతకులకు సంతానం ఆలస్యం అవుతుంది. ఈ జాతకులు కుజ గ్రహానికి చిన్నగా పరిహారం చేయించుకుంటే సంతాన విషయంలో కూడా ఆలస్యం కాకుండా ఉంటుంది. పై చెప్పిన లక్షణాలు జాతకుడికి ఉంటే కుజదోషం ఉన్నట్టుగా మీరు నిర్ధారించుకోవచ్చు. కుజదోషం అత్యంత ప్రమాదకరమైనది ఏమీ కాదు. కుజదోషం ఒకరికి ఉన్నప్పుడు కుజదోషం ఉన్న వారి తో వివాహం జరిపిస్తే దోష నివృత్తి అవుతుంది.

0 Comments