కార్తీక త్రయోదశి
నేడు అవకాశం వున్న వారు, కార్తికమాసంలో నర్మదా నదికి వెళ్లి, నర్మదా నదిలో స్నానం చేయాలి...
దర్శనం మాత్రం చేత మానవులను పవిత్రం చేసే పరమ పవిత్రమైన నది నర్మద. పద్మ పురాణంలో నర్మద యొక్క గొప్పతనం ఉంది...
కార్తిక మాసంలో ఈ రోజు నర్మదలో స్నానం చేస్తే బ్రహ్మహత్యా పాపము వంటి పాపములు కూడ తొలగిపోతాయి.
సాలగ్రామం తీసుకొని, నిత్య పూజలు ఆచరించే వారికి, దానం చేయడం వల్ల చాలా ఫలితం దొరుకుతుంది.
పూర్వకాలంలో అవకాశం ఉన్నవారు నర్మదా నదికి వెళ్లేవారు.
అవకాశం లేని వాళ్ళు ఇంట్లో ఒక చెంబుడు నీళ్లలో పసుపు, కుంకుమ కలిపి ‘గంగేచ యమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి, తుంగభద్ర జలేస్మిన్ సన్నిధిం కురు’
అని సంకల్పం చెప్పుకుని శ్లోకం చదువుకుని ఆ నీళ్లను బకెట్ నీళ్లలో కలుపుకొని, ఆ నీళ్లతో స్నానం చేస్తే నర్మదా నది స్నాన ఫలితంతో సమాన ఫలితం మనకు వస్తుంది.
దానం
ఈ రోజున ఒత్తుల కట్ట దానం, కన్యా దానం, నర్మదా స్నానం, నర్మదా బాణ లింగ దానం చేయండి. గోశాలలో గోవుకు పోషణకు కావలసిన సంపద ఇవ్వండి.
పూజ
గోవును పూజించటం మహాపుణ్యం.
ఈరోజు భక్తిశ్రద్ధలతో గోసేవా సమితి దగ్గరికి కానీ, ఇంట్లో ఉన్న గోవు దగ్గరకు కానీ వెళ్ళండి. ఆ ఆవు కాలి గిట్టలకు పసుపు కుంకుమ బొట్టు పెట్టండి.
దాని చుట్టూ ప్రదక్షిణ చేయండి, అది కూడా దూడతో కలిపిన ఆవులను పూజించండి.
త్రయోదశి నాడు ఆవును పూజిస్తే అటువంటి వ్యక్తులు భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేసిన మహా ఫలితం పొందుతారు.
పూర్వం గౌతమ మహర్షి ఈనబోతున్న ఆవుచుట్టూ ప్రదక్షిణ చేయడం వలన భూప్రదక్షిణ చేసిన పుణ్యం వచ్చి అహల్య ఆయనకు భార్య అయింది. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో త్రయోదశి నాడు గోపూజ చేయడం చాలా గొప్పది.
ఈ రోజు తప్పక గోపూజ చేయండి.
గోవుకు ప్రదక్షిణ చేయండి, వాటి కోసం కొంత ద్రవ్యాన్ని వెచ్చించండి.
కార్తిక శుద్ధ త్రయోదశి
గురుబోధ
కార్తిక శుద్ధ త్రయోదశి రోజు గణపతి, విష్ణువు, శివాలయములకు వెళ్ళాలి. శివునికి గంధపు నీటితో అభిషేకం చేయాలి. అమ్మవారికి సంపెంగలు లేక కదంబ పువ్వులతో పూజ చేయాలి.
ఈ రోజు సాయంత్రం స్ఫటిక లింగం లేదా నర్మదా బాణలింగం దానం ఇవ్వాలి.
ఈ రోజు పుస్తకములు దానం ఇస్తే తెలివితేటలు పెరుగుతాయి.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు - లోకా సమస్తా సుఖినోభవన్తు
రేపటి తరానికి బతుకు, భద్రతలతోపాటు భారతీయత కూడా నేర్పండి.

0 Comments