GET MORE DETAILS

వక్ర గురువుతో ఈ రాశుల వాళ్ళకి ఊహించని అదృష్టాలు, ఏనుగు కుంభస్థలాన్ని బద్దలు కొట్టే యోగం.

వక్ర గురువుతో ఈ రాశుల వాళ్ళకి ఊహించని అదృష్టాలు, ఏనుగు కుంభస్థలాన్ని బద్దలు కొట్టే యోగం.


జ్యోతిషశాస్త్రం ప్రకారం ఉచ్ఛస్థితిలో ఉన్న గ్రహం వక్రిస్తే నీచ బలం, నీచ స్థితిలో ఉన్న గ్రహం వక్రిస్తే ఉచ్ఛ బలం కలుగుతుంది. ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు ఈ నెల 12 నుంచి డిసెంబర్ 5 వరకు గురువు తన ఉచ్ఛ స్థితిలోనే వక్రించడం జరుగుతోంది. దీని వల్ల ఆ గ్రహానికి నీచ బలం కలిగినట్టయింది. అయితే, గురువు వక్రించినప్పటికీ కొన్ని రాశులకు మాత్రం రాజయోగాలు కలిగించడం జరుగుతోంది. 

వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకర, కుంభ రాశులు ఈ వక్రగతి వల్ల లబ్ది పొందబోతున్నాయి. 

వృషభం: ఈ రాశికి తృతీయ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు వక్రించడం వల్ల ఒకటికి రెండుసార్లు ధన యోగాలు కలిగే అవకాశం ఉంది. అతి తక్కువ ప్రయత్నంతో అత్యధికంగా ఆదాయం వృద్ది చెందే అవకాశం ఉంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. కొత్త పరిచయాలు బాగా ఉపయోగపడతాయి. రావలసిన సొమ్ము పూర్తిగా చేతికి అందడం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలకు మించి లాభాలనిస్తాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. 

సింహం: ఈ రాశికి వ్యయ స్థానంలో ఉన్న గురువు వక్రించడం వల్ల తప్పకుండా రాజయోగాలు కలుగు తాయి. ముఖ్యంగా అత్యంత ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి. విదేశీ సంపాదన యోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా తరచూ విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. శుభకార్యాలు, పుణ్య కార్యాల మీద ఖర్చు పెరుగుతుంది.

తుల: ఈ రాశికి దశమ స్థానంలో ఉచ్ఛపట్టిన గురువు వక్రించడం వల్ల మరింత మంచి ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంది. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు సైతం అందే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని స్థాయిలో యాక్టివిటీ పెరుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై ఆస్తి లాభం కలుగుతుంది. రాజపూజ్యాలు పెరుగుతాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు.

ధనుస్సు: రాశ్యధిపతి గురువు అష్టమ స్థానంలో వక్రించడం వల్ల ఈ రాశివారికి కెరీర్ పరంగా ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. ఉద్యోగ విషయంలో ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభిస్తుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అపారంగా లాభిస్తాయి. అత్యంత సంపన్నుడుగా, ఒక ప్రముఖుడుగా ఎదిగే అవకాశం ఉంది. ఆరోగ్య భాగ్యం కలుగుతుంది.

మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో ఉచ్ఛలో ఉన్న గురువు వక్రించడం వల్ల ఆదాయం విశేషంగా వృద్ధి చెందుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభించడం, జీతభత్యాలు బాగా పెరగడం వంటివి జరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లడం జరుగుతుంది. సంపన్న వ్యక్తితో పెళ్లి కుదురుతుంది.

కుంభం: ఈ రాశికి ఆరవ స్థానంలో ఉచ్ఛపట్టిన గురువు వక్రించడం వల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాల వల్ల ఆదాయం విశేషంగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత, అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. బంధువులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి భారీగా వస్త్రాభరణాలు కొనే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments