కార్తీకమాసం సందర్భంగా త్రయంబకేశ్వరాలయం, నాసిక్ శైవక్షేత్రం గురించి తెలుసుకుందాం.
త్రయంబకేశ్వరాలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ క్షేత్రం నాసిక్ పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రయంబకం లేదా త్రయంబకేశ్వర్ అని పిలిచే ఈ క్షేత్రాన్ని గోదావరి జన్మస్థానంగా పిలుస్తారు.
అయితే ఈ క్షేత్రానికి గోదావరి జన్మ స్థానం కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉంటుంది.
పురాణ ఇతిహాసం - చరిత్ర
త్రయంబకేశ్వరుడు అనగా పరమశివుడు. 'అంబక 'మంటే 'నేత్ర' మని అర్థం. మూడు నేత్రాలు గల దేవుడు త్రయంబకుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని - అనే మూడు తేజస్సులు మూడు నేత్రలుగా వెలసిన దేవుడు. పాలభాగంలోని మూడవ నేత్రమే అగ్నినేత్రం.
మన్మథుణ్ణి ఈ నేత్రాగ్నితోనే శివుడు భస్మం చేశాడు. స్వర్గం, ఆకాశం, భూమి - అనే మూడు స్థానాలకు సంరక్షకుడైన తండ్రి శివుడు అని కూడా త్రయంబక శబ్దాన్ని వివరిస్తారు.
'త్రయంబకం యజామహే - సుగంధిం పుష్టి వర్ధనమ్' మృత్యుంజయ మహామంత్రంతో మృత్యువు అనగా మరణం నుండి విడుదల చేయమని భక్తులు శివుణ్ణి ప్రార్థిస్తారు.
ఆలయ విశేషాలు
పూర్వపు ఆలయ విశేషాలు ఎక్కువగా లేకపోయినా ఇప్పటీ ఆలయాన్ని మాత్రం 1730 లో చత్రపతి శివాజీ సైన్యాధిపతి అయిన బాజీరావు పీష్వా నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది.
ఎక్కువభాగం దేవాలయ నిర్మాణానికి నల్లశాణపు రాయిని ఉపయోగించారు. ఈ ఆలయం హేమంత్‌పంతీ శైలికి చెందిన నిర్మాణం. ఆలయం చుట్టూ నిర్మాణం లోపలివైపు చతుర్స్రాకారంగానూ బయటి వైపుకు నక్షత్రాకారంగానూ ఉంటుంది.
కుశావర్తనం, గోదావరి పుట్టుక
గర్భగుడికి బైటవైపుగా నాలుగు ద్వారాలతో మండపం ఉంటుంది. గర్భగుడిలో కల శివలింగం భూమికి కొంత దిగువలో ఉంటుంది. దాని నుండి నిరంతరం నీటి ఊట ఊరుతూ ఉంటుంది. అది దేవాలయం ప్రక్కన కుశావర్తనం అనే సరోవరంలో కలుస్తూ ఉంటుంది.
కుశ అంటే ధర్భ, వర్తం అంతే తీర్ధం అని అర్ధం. దీనిలో స్నానం చేయడం వలన సర్వపాపాలు రోగాలు పోతాయని భక్తుల విశ్వాసం. గౌతముడు శివుని మెప్పించి గంగను తీసుకువచ్చు ప్రారంభంలో తన చేతినున్న ధర్భతో గౌతమి చుట్టూ తిప్పాడు. అలా తిప్పిన, ఆవర్తనమైన చోట బ్రహ్మగిరి నుండి గంగ నేలకు దిగి గోదావరిగా ప్రవహించడం మొదలిడింది.
రవాణా మార్గాలు
నాసిక్ నుండి దేవాలయానికి 28 కిలోమీటర్లు. ఇక్కడి నుండి బస్సులు ఉంటాయి. అలాగే రైల్వే స్టేషను నుండి దేవాలయం నలభై కిలోమీటర్లు. ఇక్కడి నుండి ప్రవేట్ వ్యాన్లు బస్సులు ఉంటాయి.
ఇతర దేవాలయాలు
గంగా గోదావరి దేవాలయం
🌿గంగా గోదావరి దేవాలయం అనేది నాసిక్ లో ఉంది. నాసిక్ లో రాంకుండ్ సమీపంలో గోదావరి కుడిగట్టున ఉన్న ప్రసిద్ధ దేవాలయం. ఈ గుడిలో గోదావరి మాత కొలువై ఉంది. ఈ నదిలో స్నానం చేయగానే ఈ మాతను దర్శించుకుంటారు.
బాలచంద్ర గణపతి మందిరం
బాలచంద్ర గణపతి మందిరాన్ని మోరేశ్వర్ దేవాలయం అనీ అంటారు. భారతదేశంలో 21 గణపతి పీటాల్లో ఒకటి అయిన ఈ కోవెల ఎంతో పురాతనమైనది.
ప్రవర సంగమం
గోదావరి ప్రవరా నదుల సంగమస్థలంలోని అందమైన ప్రదేశమిది. ఔరాంగాబాదుకు 40 కిలోమీటర్లు దూరం. రామాయణంలో ముడిపడి ఉన్న ఈ ప్రదేశంలో సిద్దేశ్వరం, రామేశ్వర, ముక్తేశ్వర ఆలయాలు ఉన్నాయి.
చాంగ్ దేవ్ మహరాజ్ మందిరం,
పుణతాంబ, కోపర్ గావ్ ఇక్కడ సాధువు చాంగ్ దేవ్ మహరాజ్ సమాధి ఉంది. గోదావరి ఒడ్డునే ఉన్న ఈ పుణతాంబ షిర్డికి దగ్గర్లో ఉంటుంది.
సుందర నారాయణ మందిరం
గోదావరికి సమీపంలో ఉన్న ఈ మందిరాన్ని 1756లో గంగాధర యశ్వంత చంద్రచూడు నిర్మించాడు. ప్రధానమూర్తి నారాయణుడు. ఆయనకు ఇరువైపులా లక్ష్మీ సరస్వతులు కొలువై ఉన్నారు.
🌸దీనికి దగ్గర్లోనే బదరికా కొలను ఉంటుంది. ఈ కొలనును ప్రముఖ మహారాష్ట్ర సాధువు సంత్ జ్ఞానేశ్వర్ తన జ్ఞానేశ్వరిలో ప్రస్తావించాడు. మార్చి21 నాడు ఆలయంలోని విగ్రహాల మీద సూర్య కిరణాలు ప్రసరించడం విశేషం.
🌿ఈ ఆలయ నిర్మాణశైలిలో మొగలుల వాస్తుశిల్ప ప్రభావం కనిపిస్తుంది..స్వస్తి..🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

0 Comments