టీ తాగేముందు నీళ్లు తాగడం మంచిదేనా..?
నిపుణులు ఏం చెబుతున్నారు..?ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది, కానీ ఇది మంచి పద్ధతి కాదు. అలా తాగితే గ్యాస్, అసిడిటీ, కడుపు మంట వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.టీ, కాఫీ అనేవి మన దైనందిన జీవితంలో ఓ భాగం. కొంతమంది ఉదయం లేవగానే టీ తాగనిదే ఏ పనీ మొదలుపెట్టరు. పని ఒత్తిళ్లు, ఇంట్లో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, అలసటగా ఉన్నా కప్పు టీ తాగాల్సిందే. అంతలా మనపై టీ ప్రభావం ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
మరికొందరు అయితే రోజుకి ఎన్నిసార్లు టీ తాగుతారో లెక్కే ఉండదు. అయితే మనలో చాలా మందికి టీ తాగే ముందు నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. ఇలా టీ తాగే ముందు లేదా తరువాత నీరు తాగటం మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది, కానీ ఇది మంచి పద్ధతి కాదు. అలా తాగితే గ్యాస్, అసిడిటీ, కడుపు మంట వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అందువల్ల టీ తాగే ముందు చల్లని నీరు కాకుండా.. కొంచెం గోరువెచ్చని నీరు తాగడం మేలు చేస్తుంది. ఇది కడుపులోని ఆమ్లాలను సమతుల్యం చేస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
ఉదయాన్నే ఒక గ్లాసు నీరు తాగితే శరీరానికి శక్తి సమానంగా పంపిణీ అవుతుంది. దీని వల్ల మీరు రోజంతా తేలికగా, యాక్టివ్‌గా ఉంటారని నిపుణులు వెల్లడిస్తున్నారు.ఇక టీ తాగిన తర్వాత వెంటనే నీరు అస్సలు తాగకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడి టీ తాగిన వెంటనే చల్లని నీరు తాగితే జీర్ణ వ్యవస్థ పనితీరుపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
ఇది కడుపులో అసౌకర్యం, వాంతులు, జలుబు, లేదా పంటి నొప్పి వంటి సమస్యలకు కారణమవుతుంది. వేడి-చల్లని పదార్థాలు తిన్న వెంటనే పళ్లలో తిమ్మిరి, సున్నితత్వం కూడా పెరుగుతుంది. కాబట్టి టీ తాగిన అరగంట తర్వాతే నీరు తాగడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే రోజుకు రెండు సార్లకంటే ఎక్కువగా టీ తాగడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అధికంగా టీ తాగడం వల్ల నీరసం, జీర్ణ సమస్యలు, నిద్రలేమి, అసహనం పెరుగుతాయి. అంతేకాకుండా ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఆమ్లాలు ఎక్కువై కడుపులో మంట, బలహీనత అనుభవిస్తారు. కాబట్టి టీ తాగే ముందు ఏదైనా తేలికపాటి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
టీకి బదులుగా కొన్నిసార్లు గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ తాగడం కూడా శరీరానికి మేలు చేస్తుంది. ఇవి యాంటీ ఆక్సిడెంట్లతో నిండిపోయి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. అయితే.. టీ తాగే ముందు చల్లని నీరు కాకుండా గోరువెచ్చని నీరు తాగడం మంచిది. కానీ టీ తాగిన వెంటనే నీరు తాగడం మాత్రం హానికరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

0 Comments