వివాహ పొంతనలో జాగ్రత్తలు
ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి వివాహం చేయవచ్చా లేదా అనేది జాతకాలు పరిశీలించి నిర్ణయించడాన్ని వివాహ పొంతన అంటారు.
జాతకంలో 9 గ్రహాలు ఉంటాయి ఒక్కొక్క గ్రహానికి మూడు నక్షత్రాలు ఉంటాయి. మొత్తం 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలలో 9 నక్షత్రాలకు వివాహ పొంతన చేసే సమయంలో జ్యోతిష్యులు అత్యంత జాగ్రత్త వహించాలి.
ఉదాహరణకు అశ్విని మఖ మూల ఈ నక్షత్రాలు కేతు గ్రహంలో ఉంటాయి. అశ్విని మఖ పరవాలేదు కానీ మూలా నక్షత్రానికి వివాహ బంధం అత్యంత జాగ్రత్తగా ఏర్పాటు చేయాలి. ఈ నక్షత్రం ధనుస్సు లో ఉంటుంది. ఈ కారణంగా గురువు మరియు కేతువుకి సంబంధం ఏర్పడుతుంది గురు కేతువుల సంబంధం వివాహం వద్దు అనే పరిస్థితులను తీసుకొస్తుంది, అంతేకాకుండా మూలా నక్షత్రం కఠిన బ్రహ్మచారి అయిన హనుమంతుడు జన్మ నక్షత్రం. కావున ఈ నక్షత్రానికి వివాహ బంధం ఏర్పరిచే సమయంలో జ్యోతిష్యులు అత్యంత జాగ్రత్త వహించాలి.
భరణి నక్షత్రం కుజుడు, శుక్రుడు కాంబినేషన్లో ఉంటుంది కుజ శుక్రులకు గుణాన్ని పాడుచేసే లక్షణం ఉంటుంది. భరణి నక్షత్రం విషయంలో కూడా వివాహ పొంతనలో అత్యంత అవగాహనతో చేయాలి. రవి నక్షత్రమైన కృత్తికా నక్షత్ర జాతకులు అత్యంత పట్టుదల ఆత్మాభిమానంతో ఉంటారు వచ్చే జీవిత భాగస్వామి కాస్త సహనంతో సర్దుకుపోయే తత్వంగల వారిని వివాహ బంధంలో ఏర్పాటు చేయాలి. చంద్రుని నక్షత్రమైన హస్తా నక్షత్రం గురు ద్రోహాన్ని గురు కర్మను పొందిన నక్షత్రం ఇది. కుటుంబ విభజన వ్యక్తిత్వలోపాలతో కూడి ఉంటుంది. వీరికి జీవిత భాగస్వామిని ఏర్పాటు చేయడంలో జ్యోతిష్యులు అత్యంత అవగాహనతో చేయాలి.
కుజుడు నక్షత్రమైన ధనిష్ట నక్షత్రం. ఈ నక్షత్ర జాతకులు కుజుడి లక్షణాలైన అత్యంత వేగం ధైర్యం, ఆక్రోశం ఉంటాయి వీరిని వివాహం చేసుకునే జీవిత భాగస్వామి వీటన్నింటిని కంట్రోల్ చేసే శక్తి కలవారే ఉండాలి అటువంటి వారిని వివాహ పొంతనలో అమర్చాలి. తరువాత రాహు నక్షత్రమైన శతభిషం ఇది శని భగవానుని రాశిలో ఉంటుంది రాహువు కు దేనినైనా మల్టిపుల్ చేసే అవకాశం ఉంది కావున ఈ నక్షత్ర జాతకులకు వివాహ పొంతనలో అత్యంత జాగ్రత్త వహించాలి.
గురు భగవానుడు నక్షత్రం అయిన విశాఖ నక్షత్ర జాతకులకు సహనం ఓర్పు పట్టు విడుపు ఉన్న జాతకులను జీవిత భాగస్వామిగా అమర్చాలి. శని భగవానుని నక్షత్రమైన అనురాధా నక్షత్రం వీరికి మానసిక అనారోగ్యం వైవాహిక జీవితంలో అంచనాలు నిజం కాకపోవడం ఉంటాయి. వీరి విషయంలో కూడా వివాహ పొంతన జాగ్రత్తగా చేయాలి.
బుధుడి నక్షత్రాలైన ఆశ్లేష జేష్ట నక్షత్రాలకు జాతక విశ్లేషణ సూక్ష్మంగా పరిశీలించి జీవిత భాగస్వామిని అమర్చడం చేయాలి. జాతకంపై అవగాహన తక్కువ ఉన్నవారు అమ్మాయి అబ్బాయి నక్షత్రాలకు ఎన్ని గణాలు వచ్చాయి లేదా ఎన్ని పాయింట్లు వచ్చాయి అని పరిశీలించి జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం అనే ఒక విషయం ఆధారంగా వివాహం చేయడం అనేది కొన్ని సందర్భాలలో వివాహ జీవితం అత్యంత బాధాకరంగా మారుతుంది. వివాహ పొంతనలో అబ్బాయి మరియు అమ్మాయి యొక్క పూర్తి జాతకాలను క్షుణ్ణంగా పరిశీలించి జీవిత భాగస్వామి నిర్ణయించడం అనేది అత్యంత ప్రధాన అంశం.
.jpeg)
0 Comments