GET MORE DETAILS

కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతం నోచుకుంటే... ?

కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతం నోచుకుంటే... ?



కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతం నోచుకుంటే సిరిసంపదలకు , అన్నవస్త్రాలకు లోటుండదని పురోహితులు చెబుతున్నారు. మర్రిపండ్లను బూరెలుగా , మర్రి ఆకులను విస్తర్లుగా పెట్టి పూజలు చేయటం పురాతనకాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. మహిళలు , పురుషులనే బేధం లేకుండా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు.

ఈ వ్రతాన్ని ఆచరించే భక్తులు ఇంటిల్లిపాది ఉపవాసాలుండి శివుడిని ధ్యానిస్తారు. పరిశుభ్రమైన నీరు , ఆవుపాలు , చెరుకు , కొబ్బరికాయలు , తమలపాకులు , పువ్వులతో పూజలు చేసి కర్పూర నీరాజనం చేస్తారు. అనంతరం నక్షత్ర దర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదం తీసుకోవాలి.

కార్తీక మాసంలో కొన్ని ప్రాంతాల్లో నవగ్రహ దీపాల నోముగా నోస్తారు. ఈ నోములో ముందుగా గణపతి ఆరాధన చేసి , తరువాయి శివలింగార్చనచేసి , నవధాన్యాలను కొద్దికొద్దిగా తీసి వాటిపై వేస్తూ దీప ప్రమిదల నుంచి ఓం నమఃశ్శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు స్మరిస్తారు. తరువాత అమ్మవారికి సంబంధించిన స్తోత్ర పారాయణ చేసి తొమ్మండుగురు బ్రాహ్మణులకు ఆ దీపాలను దానం ఇస్తారు. దానం చేసేటప్పుడు యథాశక్తి   నిండు మనస్సుతో ఇవ్వాలి.

ఈ నోము శుభతిథులలో సాయంత్రం వేళల్లో మాత్రమే జరగాలి. నోము అనంతరం అక్షతలను గృహం ఈశాన్య భాగంలో కొద్దిగా చల్లి , కుటుంబంలో అందరూ శిరస్సుపై చల్లుకోవాలి. ఇది సర్వ రక్షాకరంగా కుటుంబాన్ని కాపాడుతుందని పురోహితులు చెబుతున్నారు.

Post a Comment

0 Comments