GET MORE DETAILS

Supreme Court: ఆధార్‌ కేవలం గుర్తింపు పత్రమే...

Supreme Court: ఆధార్‌ కేవలం గుర్తింపు పత్రమే...



• పౌరసత్వ నిర్ధారణకు, ఓటర్ల జాబితా కోసమో వినియోగించరాదు.

• సుప్రీంకోర్టుకు తెలిపిన ఎన్నికల సంఘం.

ఆధార్‌ కార్డును గుర్తింపు కోసమే వినియోగించాలని, పౌరసత్వ నిర్ధారణ కోసమో, బిహార్‌లో సవరించిన ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చడానికో. తొలగించడానికో ఉపయోగించరాదని ఇప్పటికే ఆదేశాలు జారీచేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలిపింది. 1950నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 23(4) సెక్షన్‌ ప్రకారం ఆధార్‌ను వ్యక్తిగత గుర్తింపునకు, ధ్రువీకరణకు మాత్రమే వినియోగించేలా ఉత్తర్వులు జారీచేయాలని న్యాయవాది అశ్వినీ కుమార్‌ ఉపాధ్యాయ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు సెప్టెంబరు 8న సరిగ్గా ఇదే ఆదేశం జారీచేసిందని కేంద్ర ఎన్నికల కమిషన్‌ వివరించింది. ఆ ఆదేశాలను పాటించాలంటూ బిహార్‌ ప్రధాన ఎన్నికల అధికారికి సెప్టెంబరు 9న తాము సూచించామని తెలిపింది. ఆధార్‌ పౌరసత్వ ధ్రువీకరణకు కానీ, పుట్టిన తేదీ, చిరునామాల నిర్దారణకు కానీ వాడరాదని 2023లోనే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ స్పష్టం చేసిన సంగతినీ గుర్తుచేసింది.

Post a Comment

0 Comments