GET MORE DETAILS

జనవరి 1 నుంచి భారత్ ట్యాక్సీ యాప్ : ఓలా, ఉబర్, రాపిడోలకు దీటుగా కేంద్ర నిర్వహణ

జనవరి 1 నుంచి భారత్ ట్యాక్సీ యాప్ : ఓలా, ఉబర్, రాపిడోలకు దీటుగా కేంద్ర నిర్వహణ



న్యూఢిల్లీ: జనవరి 1 నుంచి ఢిల్లీలో భారతదేశపు మొట్టమొదటి ట్యాక్సీ సర్వీస్ 'భారత్ ట్యాక్సీ' యాప్ కేంద్రం ప్రారంభించనున్నారు. ఉబర్, ఓలా, రాపిడో ప్రైవేట్ క్యాబ్స్ కు దీటుగా భారత్ ట్యాక్సీ యాప్ ను కేంద్రం తీసుకొస్తుంది. భారత్ ట్యాక్సీ సర్వీ కేంద్రం సన్నాహాలు చేస్తుంది. జీరో కమిషన్ మోడల్ లో ఈ యాప్ను సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ నిర్వహిస్తుంది.

యూజర్ ఫ్రెండ్లీ బుకింగ్: కార్లు, ఆటోలు, బైక్లు ఇలా అన్ని వాహనాలు ఈ సేవ ద్వారా అందుబాటులో ఉంటాయి. ఈ యాప్ ఆండ్రాయిడ్, రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు తమ మొబైల్ నంబర్తో రిజిస్టర్ చేసుకోవచ్చు. పికప్, డ్రాప్-ఆఫ్ స్థానాలను నమోదు చేసుకొని, రైడ్ను ఎంచుకోవచ్చు. లైవ్ ట్రాకింగ్ కూడా అందుబాటులో ఉంది. ఈ యాప్ లో యూజర్ ఫ్రెండ్లీ మొబైల్ బుకింగ్, పారదర్శక ఛార్జీలు, రియల్-టైమ్ వెహికల్ ట్రాకింగ్, పలు భాషల ఇంటర్ఫేస్, 24ఐ7 కస్టమర్ సపోర్ట్ అందుబాటులో ఉంటుంది. సెక్యూరిటీ పరంగా దిల్లీ పోలీసులు, ఇతర ఏజెన్సీలతో సర్టిఫైడ్ డ్రైవర్ ఆన్బోర్డింగ్, రైడ్ వివరాలు ట్రాక్ చేయవచ్చు.

రద్దీ సమయాల్లో ధరల కట్టడి భారత్ ట్యాక్సీ యాప్ ద్వారా రద్దీ సమయాల్లో ధరల పరుగుదలను అరికట్టాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. డ్రైవర్లు రైడ్లను క్యాన్సిల్ చేయండి, బుకింగ్ల రద్దు వంటి ఫిర్యాదులను పరిష్కరించడానికి నిబంధనలు రూపొందించింది. ఈ యాప్ డ్రైవర్లకు అధిక ఆదాయం, మెరుగైన పనిని అందిస్తుందని కేంద్రం తెలిపింది. డ్రైవర్లు ఛార్జీలో 80 శాతం వరకు నేరుగా పొందుతారు. ఇందుకోసం నెలవారీ క్రెడిట్ సిస్టమ్ రూపొందించినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. ఈ ప్లాట్ఫామ్ తో డ్రైవర్లు ప్రైవేట్ కంపెనీలపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందని పేర్కొంది.

త్వరలో 20 నగరాలకు: ప్రభుత్వ సమాచారం మేరకు ఇప్పటి వరకు భారత్ టాక్సీ యాప్లో 56,000 మంది డ్రైవర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. మొదటి దిల్లీలో ఈ యాప్ ను ప్రవేశపెడుతున్నారు. అలాగే గుజరాత్లోని రాజ్కోట్ లో ట్రయల్ వేస్తున్నారు. రాజ్ కోట్ లో ఫిబ్రవరి 1న ప్రారంభం కానుంది. ఆపై దేశంలోని 20కి పైగా నగరాలలో ఈ యాప్ ను విస్తరించనున్నారు.

Post a Comment

0 Comments