మన ఆరోగ్యం : మునగాకు అద్భుత మహిమలు
“300 వ్యాధులకు సంజీవని – మునగ ఆకు!”
మన పూర్వీకులు వేల ఏళ్లుగా మునగ ఆకును ఔషధంగా ఉపయోగించడం యాదృచ్ఛికం కాదు. ఆయుర్వేదంలో 300కు పైగా వ్యాధులకు ఇది సేవించే శక్తి కలిగి ఉందని గ్రంథాలు, ఆధునిక పరిశోధనలూ చెబుతున్నాయి.
మునగాకులో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు
• మునగాకులో విటమిన్లు, మినరల్స్, అమినో యాసిడ్లు అపారం.
• విటమిన్ A క్యారెట్ కంటే 10 రెట్లు అధికం.
• క్యాల్షియం పాలలో ఉన్నదానికంటే 17 రెట్లు ఎక్కువ.
• ప్రోటీన్ పెరుగు కంటే 8 రెట్లు ఎక్కువ.
• పొటాషియం అరటిపండ్ల కంటే 15 రెట్లు అధికం.
• విటమిన్ C, E, K పుష్కలంగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
పరిశోధనల్లో తేలిన మునగా అద్భుతాలు
• మహిళలు రోజుకు 7గ్రా మునగాకు పొడి 3 నెలలు తీసుకుంటే
• 13.5% బ్లడ్ షుగర్ తగ్గిందని పరిశోధనలు పేర్కొన్నాయి.
• మునగాకు యాంటీ–క్యాన్సర్ శక్తి కలిగి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.
• లంగ్, లివర్, ఓవేరియన్, మెలానోమా వంటి క్యాన్సర్లను నిరోధించే సామర్థ్యం.
• యాంటీ ట్యూమర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావం థైరాయిడ్‌ను సహజంగా సమతుల్యం చేస్తుంది.
• రక్తంలోని షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేసే క్లోరోజెనిక్ యాసిడ్ ఇందులో సమృద్ధిగా ఉంటుంది.
100 గ్రాముల మునగాకులో ఉన్న పోషకాలు
• నీరు – 75.9%
• పిండి పదార్థాలు – 13.4 గ్రా
• ఫ్యాట్స్ – 1.7 గ్రా
• ప్రోటీన్లు – 6.7 గ్రా
• కాల్షియం – 440 మి.గ్రా
• ఫాస్పరస్ – 70 మి.గ్రా
• ఐరన్ – 7 మి.గ్రా
• విటమిన్ C – 200 మి.గ్రా
• ఎనర్జీ – 97 క్యాలరీలు
మునగాకు - ఇంటి దగ్గరే ఉన్న ఔషధం
• ప్రారంభ దశ కీళ్ల నొప్పులకు మునగాకు కట్టులు అద్భుతం.
• చర్మ రోగాలు, వ్రణాలకు లేపనం రూపంలో ప్రయోజనం.
• దృష్టి మాంద్యం, రేచీకటికి మునగ రసం ఉపశమనం.
• కాల్షియం లోపం, ప్రోటీన్ లోపాలను సరిచేస్తుంది.
గర్భిణులు, బాలింతలకు – అమృతం.
• చిన్నారుల ఎముకలను బలపరుస్తుంది.
• పాలిచ్చే తల్లుల్లో పాలు పెరగడానికి సహాయం.
మునగాకు ఉపయోగాలు – ఇంట్లోనే వైద్యశాల
అస్తమా, టీబీ, దగ్గు
మునగ ఆకులు నీటిలో మరిగించి, మిరియాలు–నిమ్మరసం కలిపి తాగితే ఉపయోగం.
విరోచనాలు
మునగ రసం + కొబ్బరి నీళ్లు + తేనె = తక్షణ ఉపశమనం.
మొటిమలు, బ్లాక్‌హెడ్స్
మునగాకు రసం + నిమ్మరసం ముఖానికి రాస్తే చర్మం కాంతివంతం.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
• మహిళలకు సహజ కాల్షియం సంపద - రోజూ మునగాకు తీసుకుంటే ఎముకలు బలపడతాయి.
• మునగాకు - మనకు లభించిన వరప్రసాదం
• అన్ని ఆకుకూరల్లో ఇంత పుష్టికరమైన, రోగనిరోధక శక్తి నింపే ఆకు మరొకటి లేదు.
• ప్రతి ఇంట్లో, ప్రతి వంటలో దీనికి తప్పక స్థానం ఉండాలి.
• ఇన్ని గుణాలు ఉన్న మునగాకును నిర్లక్ష్యం చేయడం తగదు.
• ప్రతిరోజూ ఆచరణలోకి తెస్తే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది.
.jpeg)
0 Comments