GET MORE DETAILS

వేద జ్యోతిష‌శాస్త్రంలో రాహువు ఓ ర‌హ‌స్య‌మైన‌, అస్ప‌ష్ట‌మైన గ్ర‌హంగా పేర్కొంటారు.

 వేద జ్యోతిష‌శాస్త్రంలో రాహువు ఓ ర‌హ‌స్య‌మైన‌, అస్ప‌ష్ట‌మైన గ్ర‌హంగా పేర్కొంటారు. 



కాలానుగుణంగా రాశులు, న‌క్ష‌త్రాలు మారుతుంటాయి. ఈ సంచారం కార‌ణంగా 12 రాశుల జీవితాల్లోని వివిధ మార్గాల్లో ప్ర‌భావితం చేస్తాయి. ఈ నెల 23న రాహువు శ‌త‌భిష న‌క్ష‌త్రంలోకి ప్ర‌వేశించాడు. వేద జ్యోతిష‌శాస్త్రంలో రాహువు ఓ ర‌హ‌స్య‌మైన‌, అస్ప‌ష్ట‌మైన గ్ర‌హంగా పేర్కొంటారు. కాలానుగుణంగా రాశులు, న‌క్ష‌త్రాలు మారుతుంటాయి. 

ఈ సంచారం కార‌ణంగా 12 రాశుల జీవితాల్లోని వివిధ మార్గాల్లో ప్ర‌భావితం చేస్తాయి. ఈ నెల 23న రాహువు శ‌త‌భిష న‌క్ష‌త్రంలోకి ప్ర‌వేశించాడు. వ‌చ్చే ఏడాది ఆగ‌స్టు 2 వ‌ర‌కు అదే న‌క్ష‌త్రంలో ఉంటాడు. సొంత న‌క్ష‌త్రంలోకి ప్ర‌వేశించ‌డం ద్వారా రాహువు చాలా ప్ర‌భావ‌వంతంగా ఉంటాడు. ప్ర‌భావాలు ముఖ్యంగా రాహువు ప్ర‌భావంలో ఉన్న రాశుల‌పై క‌నిపించ‌నున్నాయి. రాహువు స్వభావం అనూహ్యంగా ఉంటుంది. దాని ప్ర‌భావం ప్ర‌తి వ్య‌క్తికి, ప్ర‌తి ఇంటికీ భిన్నంగా ఉంటుంది. ఈ సంచార స‌మ‌యంలో ప‌లు రాశి వ్య‌క్తులు ఆక‌స్మిక లాభాలు, కొత్త అవ‌కాశాలు, ఊహించ‌ని విజ‌యం, వారి జీవితాల్లో పెద్ద మార్పులు చూస్తారు.

క‌ర్కాట‌క రాశి

క‌ర్కాట‌క రాశి ఎనిమిదో ఇంట రాహువు సంచ‌రిస్తున్నాడు. ఎనిమిదో ఇల్లు ఆక‌స్మిక మార్పుల‌కు సంకేతం, జీవితానికి సంబంధించిన‌వి. ఈ కాలంలో జీవితంలో ఊహించ‌ని మార్పులు చోటు చేసుకుంటాయి. అక‌స్మాత్తుగా ఉద్యోగం, స్థాన‌చ‌ల‌నం జ‌రిగే అవ‌కాశం ఉంటుంది. కెరీర్‌లో భారీ మార్పులు జ‌రిగే ఛాన్స్ ఉంది. రాహువు సంచారం కార‌ణంగా మీరు దాచిపెట్టిన ర‌హ‌స్యాల‌న్నీ బ‌హిర్గ‌త‌మ‌వుతాయి. ఆధ్యాత్మిక‌త వైపు దృష్టి సారిస్తారు. మాన‌సికంగా అవ‌గాహ‌న పెంపొందించేకునేందుకు అవ‌కాశం ఉంది. ఈ స‌మ‌యం ఆత్మ‌ప‌రిశీల‌న‌, మాన‌సిక ప‌రివ‌ర్త‌న‌కు అనుకూలం. రాహువు ప్ర‌భావంతో ప‌రిస్థితులు కొన్నిసార్లు అస్థిరంగా, అనూహ్యంగా మారే ఛాన్స్ ఉంది. ఈ స‌మ‌యంలో తెలివైన నిర్ణ‌యాలు తీసుకోవ‌డం ద్వారా ప్ర‌యోజ‌నం ఉంటుంది. ఈ కాలంలో క‌ర్కాట‌క రాశి వారి జీవితంలో మార్పులు చోటు చేసుకునే అవ‌కాశాలు గోచ‌రిస్తున్నాయి.

తులారాశి

తులారాశి ఐదో ఇంట్లో రాహువు శ‌త‌భిష న‌క్ష‌త్రంలోకి ప్ర‌వేశించాడు. ఐదో ఇల్లు, విద్య‌, పిల్ల‌లు, తెలివితేటలు, ప్రేమ సంబంధాలు, గత కర్మలకు సంబంధించింది. ఈ సమయంలో మీ సృజనాత్మక ప్రతిభ, తెలివితేటలు పెరుగుతాయి. కళ, మీడియా, సాహిత్యం, విద్య, ఐటీ, కృత్రిమ మేధస్సు, సాంకేతిక సంబంధిత రంగాల్లోని వారు గ‌ణ‌నీయ‌మైన లాభాల‌ను పొందుతారు. ఊహించ‌ని విధంగా ప్ర‌యోజ‌నాలుంటాయి. విద్య, పిల్లలు, ప్రేమ సంబంధాలలో కూడా సానుకూల ఫలితాలు క‌నిపిస్తాయి. రాహు సంచారం మీ జీవితంలో ఊహించ‌ని ఘ‌ట‌న‌లు ఎదుర‌వుతాయి. మీ నైపుణ్యాలను, ప్రతిభను ప్ర‌ద‌ర్శించేందుకు మీకు అవ‌కాశం ద‌క్కుతుంది. జీవితంలో కొత్త అవ‌కాశాల‌ను తీసుకువ‌స్తుంది.

మకరరాశి

మకరరాశి వారికి రెండో ఇంట్లో రాహువు సంచ‌రిస్తున్నాడు. రెండవ ఇల్లు సంపద, వాక్కు, కుటుంబం, పూర్వీకుల ఆస్తి, సంప‌ద‌కు ప్ర‌తీక‌. రాహువు స్థానం మీ జీవితంలో ఆర్థిక లాభాలను తెస్తుంది. ఇత‌రుల వ‌ద్ద‌కు మీకు రావాల్సిన డ‌బ్బు చేతికందుతుంది. పాత ఆస్తి సంబంధిత వివాదాలు ప‌రిష్కార‌మ‌వుతాయి. కుటుంబంతో సమయం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబంలో అవగాహన, స‌హ‌కారం ఉంటుంది. రాహువు ప్ర‌భావం వృత్తిపరమైన రంగంలో కూడా కొత్త అవకాశాలను తీసుకువ‌స్తుంది. ఆదాయాన్ని పెంచే అవకాశం ఉంది. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఆర్థిక‌, వ్య‌క్తిగ‌త నిర్ణ‌యాల‌ను గోప్యంగా ఉంచ‌డం మంచిది. మీ క‌మ్యూనికేష‌న్ స్కిల్స్‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంటారు. ఆర్థిక పురోగ‌తికి శుభ స‌మ‌యం కాగా.. వివేకంతో నిర్ణ‌యాలు తీసుకొని జాగ్ర‌త్త‌గా ఉండ‌డం మంచిది.

Post a Comment

0 Comments