స్త్రీల ద్వారా ధన లాభం
జీవితంలో సగభాగంగా చెప్పబడే స్త్రీలు నిజానికి కుటుంబంలో 80% బాధ్యతలు నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. పురుషులకు కూడా బాధ్యత ఉంటుంది కానీ స్త్రీ సహకారం వలన పురుషులు అభివృద్ధి చెందుతారు అనేది కూడా నిజం. ఎటువంటి జాతకులకు స్త్రీ సహకారం లభిస్తుంది, స్త్రీ సహకారంతో ధన లాభం జీవితంలో అభివృద్ధి ఉంటాయి అనేది జ్యోతిష్య రీత్యా పరిశీలన చేయవచ్చు.
జ్యోతిష్యంలో చంద్రుడు శుక్రుడు స్త్రీ గ్రహాలు చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి కాలపురుష చక్రంలో నాలుగో స్థానంలో దిగ్బలాన్ని పొందుతారు. ఏ జాతకులు అయినా సరే కర్కాటకం బలహీనం కాకుండా శుక్ర చంద్రులు బలాన్ని కోల్పోకుండా ఉంటే ఆ జాతకులు స్త్రీల ద్వారా ఆదాయాన్ని సహకారాన్ని అనేక రకాల ప్రయోజనాలను పొందుతారు. పురుషుడు మొదటిగా తల్లి, సహోదరి, సహ ఉద్యోగిని, భార్య, కుమార్తె వీరితో ఎక్కువగా పరిచయము సత్సంబంధాలు కలిగి ఉంటారు. కర్కాటకం ఏ జాతకంలో అయితే బలంగా ఉంటుందో ఆ జాతకుడు పైన పేర్కొన్న అందరి స్త్రీల నుండి ఆర్థిక ప్రయోజనాలు, జీవిత అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు కచ్చితంగా లభిస్తాయి.
మరొక విధానం శుక్రుడి రాశులు అయిన వృషభం, తుల ఇవి బలంగా ఉన్నప్పుడు కూడా స్త్రీల ద్వారా ప్రయోజనాన్ని పొందుతారు, వృషభ కానీ శుక్రుడు కానీ బలహీనంగా ఉన్నప్పుడు జాతకుడు కుటుంబంలోని స్త్రీల ద్వారా అనేక సమస్యలు ఎదుర్కొంటారు. కర్కాటక రాశి కానీ చంద్రుడు కానీ పాప గ్రహాలతో సంబంధం ఏర్పడితే జాతకుడు భార్యతో మరియు ఇతర స్త్రీలందరికీ సమస్యలు మానసిక చింతన ఏర్పడతాయి.
కర్కాటకము వృషభం తుల స్థానాలు పాపగ్రహాలతో సంబంధం ఉండకూడదు మరియు చంద్రుడు శుక్రుడు బలహీనం అవ్వకూడదు ఒకవేళ బలహీనమైతే జాతకుడు స్త్రీలతో అనేక సమస్యలు మానసిక ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు. ఒకవేళ ఇటువంటి గ్రహ స్థితి ఉన్నప్పుడు జాతకులు స్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వీళ్ళతో ఇటువంటి పరిస్థితులలో గొడవలు పెట్టుకోరాదు. జాతకంలో శుక్ర చంద్రుడు కానీ, ఆయా స్థానాలు బలహీన అయినప్పుడు స్త్రీలతో సమస్యలు ఏర్పడితే చిన్న పరిహారాలు ద్వారా బయటపడవచ్చు.
ఏ గ్రహాలు ఏ స్థానాలు బలహీనం అవుతున్నాయి ఏ గ్రహాల ద్వారా బలహీనం అవుతున్నాయి పరిశీలించి దానికి తగిన పరిహారాలు పాటిస్తే సమస్యల నుండి బయటపడి జీవితం సంతోషంగా ఉంటుంది. ఎటువంటి జాతకులు అయినా స్త్రీలను గౌరవిస్తూ, వారికి తగిన సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నప్పుడు జాతకంలో సంతోషానికి కారకుడు అయిన శుక్రుడు, ధనానికి కారకుడు అయిన చంద్రుడు బలం పొంది ఆర్థిక విజయాలు మరియు ఉద్యోగ వ్యాపార పురోగతి కలుగుతాయి.
.jpeg)
0 Comments