GET MORE DETAILS

మంచి పెంపకమే పిల్లలకు వరం..!

 మంచి పెంపకమే పిల్లలకు వరం..!



▪️అమ్మే ఆది గురువు కావాలి.

▪️ఇల్లు వికాస క్షేత్రంగా మారాలి.

"ఇంట్లో నేను ఒక్కడినే ఉంటాను. నాతో ఎవరు ఆడుకోరు. నాన్న కోపంగా ఉంటారు. ఆయన ప్రేమగా పిలిస్తే వినాలని ఉంది. అమ్మకు నేనంటే ఇష్టం లేదనుకుంటా. అమ్మతో ఆడుకోవాలని ఉంది".

సౌత్ కొరియన్ రియాలిటీ షో "మై గోల్డెన్ కిడ్స్" ఒక చిన్నారి మాటలు ఇవి. యాంకర్ మాటలకు ఆ చిన్నారి దీనంగా చెప్పిన ఈ జవాబులు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సోషియల్ మీడియాను కదిలిస్తాయి. ఈ మాటలకు ఇప్పటి వరకు ఆరు మిలియన్ల నెటిజన్లు స్పందించారు. కన్న వారు పిల్లలను ఇలా వడిలేయ రాడంతున్నారు. చాలా మంది తీరికలేని తల్లి తండ్రులకు కనుపిప్పు కలగాలని కోరుకుంటున్నారు.

అమ్మే ఆది గురువు కావాలి.

ప్రకృతిలోని సమస్త జీవరాశులకు తల్లే ఆది గురువు. గ్రామీణ ప్రాంతాలలో పశువులు, కుక్కలు, కోళ్లు తమ పిల్లలను ఎలా పెంచుతాయో చూసే అవకాశం ఉంటుంది. పశువులు దూడను ఈన గానే వాటి నాలుకతో దూడను నాకి శుభ్రం చేస్తాయి. పడుకొని, లేచి పాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాయి. అడవిలో మేతకు వెళ్ళినా సాయంత్రం కాగానే పుగెత్తుకుని వచ్చి దూడలకు పాలిస్తాయి. వాటి దూడల చెంతకు కొత్త వారు, కుక్కలు లాంటివి వస్తే పొడవడానికి ప్రయత్నిస్తాయి. కుక్క పిల్లలు పుట్టి నప్పుడు కళ్ళు కనిపించవు. వాటిని తల్లి కుక్క చాలా జాగ్రత్తగా పెంచుతుంది. చలి తగలకుండా చాటుగా ఉండే ప్రదేశాలలో పెట్టి పెంచుతుంది. పిల్లలు కొద్ది పెద్దవి అయిన తరువాత వాటితో ఆడుకుంటూ కరవడం, వేటాడటం నేర్పిస్తుంది. కోళ్లు వాటి పిల్లలను రెక్కల కింద దాచుకుని కాపాడుకుంటాయి. పిల్లలను ఎత్తు కెళ్ళడానికి వచ్చిన గద్దలతో పోట్లాడ టానికి సిద్దం అవుతాయి.

పిల్లులు తమ పిల్లలు ఎవరి కంటా పడకుండా స్థావరాలు మెరుస్తుంటాయి. పక్షులు గుళ్ళు కట్టుకుని గుడ్లు పెట్టి పిడుగుతాయి. రెక్కలు వచ్చి ఎగిరే వరకు ఆహారం తెచ్చి పెడతాయి. అడవిలో వున్న పులులు, సింహాలు, ఇతర జంతువులు తమ పిల్లలకు సర్వం తామై వ్యవహరిస్తాయి. అలాంటిది సర్వం తెలిసిన కొందరు తల్లి తండ్రులు పిల్లలను విస్మరించడం చూస్తే బాడేస్తుంది. తీరిక లేదు, పిల్ల కోసమే కదా కష్టపడేది లాంటి మాటల వల్ల ప్రయోజనం లేదు. ఎంత పని ఉన్నా తల్లి పిల్లలకు ఆదిగురువు కావాలి. తల్లి మార్గదర్శిగా నిలవాలి.

ఇల్లు వికాస క్షేత్రంగా మారాలి

వ్యక్తి ఎదుగుదల, అభివృద్ధి, వికాసంపై కుటుంబ నేపథ్యం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పుట్టిన రెండు మూడు సంవత్సరాలు పిల్లలకు ఇల్లే లోకం. తరువాత నెమ్మది, నెమ్మదిగా లోకంతో పరిచయం అవుతుంది. తరువాత పాఠశాల, స్నేహితులు, సమాజం, పరిసరాల ప్రభావం కూడా పడుతుంది. అయితే ప్రతి వ్యక్తి ఎక్కువ సమయం ఇంటిలోనే ఉంటాము. కాబట్టి అన్నింటికంటే కుటుంబ ప్రభావం అధికంగా ఉంటుంది. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు పిల్లలకే ఇల్లే సర్వస్యం. ఇప్పుడు పరిస్తితిలో మారాయి. మూడేళ్ల వయసు నుంచే పిల్లల కేర్ సెంటర్లు, నర్సరీలు ఇతర కేంద్రాలకు బందీలుగా మారు తున్నారు. దీనితో బాల్యం నుంచే ఒత్తిళ్లకు గురవుతున్నారు. తల్లి వడిలో, నాన బుజాల మీద పెరిగిన వారిలో ఆత్మ విశ్వాసం గ్రహణ శక్తి ఎక్కువగా ఉన్నట్టు సర్వేలలో తేలింది. అలాగే ఒత్తిళ్లను తట్టుకునే సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుందని వెల్లడయ్యింది, కాబట్టి తల్లి తండ్రులు కోట్లు సంపాదించి ఇవ్వడం కంటే పిల్లలకు ప్రేమ, అనురాగం, వాత్సల్యం పంచడం మేలు. పిల్లలను సమర్థులుగా తయారు చేస్తే వారే సంపద సృష్టిస్తారు. సమాజంలో రాణిస్తారు.

భారత దేశ ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తన కుమార్తె ఇందిరా గాంధీ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఆమె చదువుకునే సమయంలో తరచూ లేఖలు రాసి వికాసం కల్పించారు. అలా పెంచడం వల్లే ఆమె ఎదురులేని ప్రధాన మంత్రిగా ప్రపంచంలోనే పేరు తెచ్చుకున్నారు. పెంపకాన్ని బట్టే అధికశాతం పిల్లల వ్యక్తిత్వం, ప్రవర్తన, వికాసం ఆధారపడి ఉంటుంది. ఆ విషయం తల్లి, తండ్రి కావాలి అనుకునే ప్రతి వారు గుర్తించాలి.

Post a Comment

0 Comments