ఈ టీలు ఎన్నైనా తాగొచ్చు
రానురానూ చలి పెరిగిపోతోంది. ఇలాంట ప్పుడు వెచ్చగా చేతిలో ఒదిగిపోతూ శరీరానికీ హాయినిచ్చేదంటే టీ, కాఫీలే గుర్తొస్తాయి కదూ! కాబట్టే, ఈ కాలం ఎక్కువగా వాటినే ఆశ్రయిస్తుంటాం. అప్పటికి బాగానే ఉంటుంది కానీ తరవాతే వాటిల్లోని కెఫీన్ నిద్రని దూరం చేస్తుంది. అలాగని దూరంగా ఉండలేమం టారా? అయితే సాధారణ టీలను వదిలి వీటిని తాగండి.
అల్లం టీ... కాస్త ఘాటుగా ఉంటుంది కానీ ఇదిచ్చే ప్రయోజనాలు బోలెడు. ఒంటికి వెచ్చదనం కలిగిస్తూనే దీనిలోని జింజెరాల్ రోగనిరోధకతను పెంచుతుంది. జీర్ణశక్తికీ మేలు చేస్తుంది.
చామంతి టీ... దీనిలో మానసిక ప్రశాం తతను ఇచ్చే గుణాలెన్నో. ఈకాలం ఎంత పడుకున్నా మగతగా, బద్దకంగా ఉంటుంది కదా! దాన్ని పోగొడుతుంది. ఇంకా పడు కునే ముందైనా తాగొచ్చు. ఒత్తిడిని పక్క కునెట్టి, చక్కని నిద్రను ఇస్తుంది.
సినమమ్ టీ... లోపల్నుంచీ వెచ్చదనం అందించడం దాల్చినచెక్క ప్రత్యేకత. అంతేకాదు, దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమే టరీ గుణాలు గుండె ఆరో గ్యానికీ, జీర్ణప్రక్రియకూ మేలు చేస్తాయి.
పెప్పర్మెంట్ టీ... ఈ కాలం ఆహారం త్వరగా అర గదు. అందుకే పొట్ట బరువుగా, ఉబ్బరంగా అనిపిస్తుంటుంది. ఈ టీ తాగండి. ఈ సమస్యలుండవు. పైగా ఎప్పుడు తాగినా శరీరానికీ మనసుకీ ప్రశాంతతను కలిగిస్తుంది.
లెమన్ గ్రాస్ టీ... దీనిలోని సువాసన నిమ్మ టీని తలపిస్తుంది. జీర్ణప్రక్రియకు సాయపడుతూనే చక్కని నిద్రనీ ఇస్తుంది. ఇన్ఫ్లమేషన్నీ తగ్గిస్తుంది.
.jpeg)
0 Comments