GET MORE DETAILS

ఈ ప్రత్యామ్నాయాలు ఆరోగ్యకరం

 ఈ ప్రత్యామ్నాయాలు ఆరోగ్యకరం



మనం ఆరోగ్యకరమైనవి అనుకునే కొన్ని పదార్థాల్లో కూడా మైక్రోప్లాస్టిక్స్ ఉంటున్నాయి. వాటిని ఆహారం నుంచి తొలగించి, ప్రత్యామ్నాయ పదార్థాలను ఎలా ఎంచుకోవాలంటే...

5 మిల్లీమీటర్ల కంటే చిన్నవిగా ఉండే ప్లాస్టిక్ పరమాణువులైన మైక్రోప్లాస్టిక్స్ మనం తినే ఉప్పు, సముద్రాహారం, పండ్లు, కూగాయలు, తేనెల్లో కూడా ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా శుద్ధి చేసిన, ప్యాకేట్లలో నిల్వ చేసిన పదార్థాల్లో వీటి పరిమాణం ఎక్కువ. కలుషిత పదార్థాలు, పారిశ్రామిక శుద్ధీకరణ, ప్లాస్టిక్ ప్యాకెట్లలో నిల్వ చేయడం వల్ల వీటిలోకి మైక్రోప్లాస్టిక్ట్ చేరుకుంటున్నాయి. కాబట్టి పదార్థాల నిల్వకు మరింత సురక్షితమైన నిల్వ పద్ధతులను అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే మైక్రోప్లాస్టిక్ ముప్పు పొంచి ఉండే పదార్థాలకు ఆరోగ్య ప్రత్యామ్నాయాలను కూడా ఎంచుకోవచ్చు.

సముద్రాహారం:

రొయ్యలు, పీతలు లాంటి గుల్ల చేపలు మైక్రోప్లాస్టిక్స్ ను శోషించుకునే స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటాయి. కాబట్టి వీటికి బదులుగా పెద్ద చేపలను ఎంచుకోవాలి.

టేబుల్ సాల్ట్:

ఉప్పు ఉత్పత్తి... మైక్రోప్లాస్టిక్ రేణువుల సాంద్రతకు ప్రధాన కారణం. కాబట్టి సముద్రపు ఉప్పుకు బదులుగా అయొడైజ్డ్ సాల్ట్ తీసుకోవచ్చు.

బాటిల్డ్ వాటర్:

ప్లాస్టిక్ సీసాల్లో నిల్వ చేసే మంచినీళ్లకు బదులుగా కార్బన్/యుఎఫ్ ఫిల్టర్లు కలిగిన ఫిల్టర్ వాటర్ శ్రేయస్కరం. ఈ నీళ్లను స్టెయిన్లెస్ స్టీల్ సీసాల్లో, బిందెల్లో నిల్వ చేసుకుని తాగాలి.

తేనె:

శుద్ధి ప్రక్రియలో భాగంగా తేనెలో కూడా మైక్రోప్లాస్టిక్స్ కలుస్తాయి. కాబట్టి గాజు సీసాల్లో దొరికే ముడి తేనె తీసుకోవాలి. ప్లాస్టిక్ సీసాల్లో దొరికే ప్యాకేజ్డ్ బ్రాండ్స్ వాడకం మానేయాలి.

టీ బ్యాగ్స్:

నైలాన్ తో తయారయ్యే టీ బ్యాగ్స్్స్ను వేడినీళ్లలో ముంచగానే మైక్రోప్లాస్టిక్స్ విడుదలవుతాయి. కాబట్టి టీపొడిని వేడి నీటిలో మరిగించి తాగడం ఆరోగ్యకరం.

Post a Comment

0 Comments