Ads Area

భార్యాభర్తల అన్యోన్యత కొరకు

0

 భార్యాభర్తల అన్యోన్యత కొరకు 


ప్రస్తుత కాలంలో ఎవరికి వారికి స్వతంత్ర భావప్రకటన వలన, భార్యా భర్తల మధ్య అన్యోన్యత తగ్గి అవి అనేక సమస్యలు వరకు దారి తీస్తున్నాయి.
కలహాలను దూరం చేసుకోటానికి మంత్ర శాస్త్రంలో కొన్ని మంత్రాలు ఉన్నాయి. మంత్రాలను జపం చేసుకుంటూ చిన్న చిన్న సూచనలను పాటించటం వలన భార్యా భర్తల మధ్య కలహాలను దూరం చేసుకుని ఆనందంగా జీవించవచ్చు.
జ్యోతిష్య పరంగా
వివాహానికి జాతక చక్రంలో సప్తమ స్థానం వివాహ స్థానాన్ని తెలియ చేస్తుంది.
ఈ సప్తమ స్థానంలో పాప గ్రహం ఉన్నా లేదా సప్తమ స్థాన అధిపతి 6, 8, 12 స్థానాలలో ఉన్నా దాంపత్య పరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది.
అదే సప్తమ స్థాన అధిపతి స్వరాశిలో ఉన్నా, మిత్ర రాశిలో ఉన్నా, ఉచ్చ స్థితిలో ఉన్నా దాంపత్య జీవితం బాగుంటుంది.
సూచించిన పరిహారాలు
✔ పురుషులు బియ్యాన్ని లేదా పరమాన్నాన్ని ఆవుకు తినిపించాలి.
✔ స్త్రీలు మంగళవారం నాడు ఆవుకు బెల్లం తినిపించాలి. ఆవు యొక్క యజమాని అనుమతి తీసుకుని మాత్రమే తినిపించాలి.
✔ భార్యాభర్తలు కలిసి ఉన్న ఫోటోను పడక గదిలో నైరుతి కోణంలో అమర్చాలి. దాని వలన అనుకూల తరంగాలు ఏర్పడి వైవాహిక జీవితం బాగుంటుంది.
ఆర్థిక కలహాల నివారణ
ముఖ్యంగా భార్యా భర్తల మధ్య ఆర్థిక విషయాల వలన వచ్చే కలహాలను నివారించడానికి సోమవారం నాడు అశోక వృక్షం యొక్క ఆకులను తీసుకుని ఒక గుత్తి లాగా కట్టి, ఇలా మొత్తం 21 గుత్తులను తోరణంగా తయారు చేసి గుమ్మం ముఖద్వారానికి కట్టాలి.
మంగళవారం నాడు ఆ తోరణాన్ని తీసి ప్రవహిస్తున్న నదిలో విడిచి పెట్టాలి. ఇలా వరుసగా నాలుగు సోమవారాలు చేయాలి.
ఇలా చేస్తే ఆర్థిక ఆటుపోట్ల వలన గొడవలు పడే దంపతుల మధ్య విభేదాలు తొలిగిపోతాయని విశ్వసిస్తారు. జాతకంలో అవయోగాలు లేనప్పుడు ఈ పరిహారాలు ఫలితాలను ఇస్తాయని జ్యోతిష్య సంప్రదాయం పేర్కొంటుంది.

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area