GET MORE DETAILS

టీచర్లకు హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు - షెడ్యూల్ ప్రకటించిన పాఠశాల విద్యా శాఖ - 16 నుంచి ప్రక్రియ ప్రారంభం

 టీచర్లకు హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు - షెడ్యూల్ ప్రకటించిన పాఠశాల విద్యా శాఖ - 16 నుంచి ప్రక్రియ ప్రారంభం




  ప్రభుత్వ పాఠశాలల టీచర్లకు ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించేందుకు పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను ఆ శాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు గురువారం విడుదల చేశారు. స్కూల్ అసిస్టెంట్లు గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులుగా, సెకండరీ గ్రేడ్ టీచర్లు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందనున్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా రీజినల్ జాయింట్ డైరెక్టర్లకు విద్యా శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. స్టేట్ సబార్డినేట్ నిబంధనల ప్రకారం.. ఇప్పటికే డీఈవోలు జిల్లాల వారీగా సీనియార్టీ జాబితాలను సిద్ధం చేసిపదోన్నతులకు వీలుగా అందుబాటులో ఉంచారు. ఈ జాబితాలను రీజినల్ జాయింట్ డైరెక్టర్లు, డీఈవో కార్యాలయాల్లోని నోటీసు బోర్డుల్లో అందరికీ కనిపించేలా ఉంచాలి. హెచ్ఎం పోస్టులను ఆయా పేరెంట్ డిపార్ట్మెంట్లకు చెందిన టీచర్లకు పదోన్నతిపై కేటాయించాలి.

» నవంబర్ 1 నాటికి పదవీ విరమణ చేసినవారి పోస్టులు, మరణించినవారి పోస్టులు, ఇతర ఖాళీలను పదోన్నతులకు వీలుగా చూపాలి.

» 2021 జనవరిలో నిర్వహించిన బదిలీల సమయంలోబ్లాక్ చేసిన, ప్రదర్శించినవాటిని ఖాళీల్లో చూపరాదు. 

» ప్రస్తుతం కల్పిస్తున్న పదోన్నతులన్నీ తాత్కాలిక (అడహాక్) ప్రాతిపదికపై ఉంటాయి.

» బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియలో టీచర్లు.. వారి ప్రతిభ, సాధించిన ఫలితాలు, ఇతర ప్రాతిపదికల ఆధారంగా ఇచ్చే ఆప్షన్ల ప్రాధాన్యతలను బట్టి పదోన్నతులు ఉంటాయి

👉షెడ్యూల్ ఇలా..👇

●స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ల సీనియార్టీ జాబితాల ప్రదర్శన అక్టోబర్ 16

● సీనియార్టీ జాబితాలపై అప్పీళ్ల సమర్పణ అక్టోబర్ 18, 19

● అప్పీళ్ల పరిశీలన, పరిష్కారం అక్టోబర్ 21, 22

● తుది సీనియార్టీ జాబితాల ప్రదర్శన అక్టోబర్ 23

 ● పదోన్నతులకు కౌన్సెలింగ్ అక్టోబర్ 29 నుంచి 30 వరకు



Post a Comment

0 Comments