మిలటరీ కాలేజీలో బాలికలకు అవకాశం
సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజీలోకి బాలికలకు ప్రవేశ అవకాశాన్ని కల్పించనున్నట్లు ఏపీపీఎస్సీ గురువారం తెలిపింది. 2022 జూలై టర్మ్ నుంచి 8వ తరగతిలోకి ఈ ప్రవేశాలుంటాయని పేర్కొంది. 2022 జూలై 1 నాటికి 11 ఏళ్ల నుంచి 13 ఏళ్లలోపు వయసు ఉన్న బాలికలు ఈ ప్రవేశాలకు అర్హులు. 7వ తరగతి చదువుతున్న వారు, లేదా పాసై ఉన్నవారు దరఖాస్తు చేయవచ్చు. వీరికి ప్రవేశ పరీక్ష 2021 డిసెంబర్ 18న విజయవాడలో నిర్వహిస్తారు. ప్రాస్పెక్ట్, అప్లికేషన్ ఫారాల కోసం అభ్యర్థులు ఓసీలు రూ.600, ఎస్సీ, ఎస్టీలు రూ. 555 www.rimc.gov.in వెబ్సైట్లో ఆన్లైన్ లో చెల్లించాలి. పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను ధ్రువపత్రాలతో అసిస్టెంట్ సెక్రటరీ (పరీక్షలు), ఏపీపీఎస్సీ కార్యాలయం, ఆర్ అండ్ బీ భవనం, మున్సిపల్ స్టేడియం ఎదురుగా, విజయవాడ చిరునామాకు నవంబర్ 15 లోగా అందించాలి.
0 Comments