జీర్ణ వ్యవస్థ సరిగా ఉంచుకుందాం...
సరైన ఆహారమే ఆరోగ్యానికి, ఫిట్‌నెస్‌కి ఆధారం. కానీ శరీరం ఆహారం పూర్తి ప్రయోజనాలు పొందాలంటే జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేయాలి.
అప్పుడే మనం తిన్న తిండి ఒంటబడుతుంది. అంతేకాదు బలమైన జీర్ణవ్యవస్థతోనే ఆరోగ్యవంతమైన శరీరం సాధ్యమవుతుంది. నేటి ఆధునిక కాలంలో సమయపాలన లేని ఆహారపు అలవాట్ల వల్ల జీర్ణవ్యవస్థ కుంటుపడుతుంది. శరీరం అనేక రకాల వ్యాధులకు నిలయంగా మారుతోంది. అలాంటప్పుడు జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే తిన్న ఆరోగ్యం సులభంగా జీర్ణమవుతుంది. ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. వాటి గురించి ఒక్కసారి తెలుసుకుందాం.
1. బొప్పాయి :
జీర్ణక్రియకు సంబంధించిన చాలా సమస్యలు శరీరానికి సరిపడ ఫైబర్ అందకపోవడం వల్లే ఏర్పడుతాయి. అటువంటి పరిస్థితిలో, జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడంలో పండ్ల వినియోగం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందులో బొప్పాయి చాలా చక్కగా పని చేస్తుంది. ఇందులో జీర్ణ సమస్యలను దూరం చేసే ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల మలబద్ధకం, అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది.
2. సోంపు :
జీర్ణవ్యవస్థతో సమస్యలు ఉన్న వ్యక్తులు తరచుగా గ్యాస్ సమస్యలను ఎదుర్కొంటారు. గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి సోంపు ఒక సులభమైన మార్గం. భోజనం తర్వాత సోంపు తినడం వల్ల గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
3. జీలకర్ర :
జీలకర్రలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి జీర్ణ ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తాయి. ఇవి జీర్ణక్రియలో సహాయపడుతాయి.
4. మెంతులు :
7మెంతి గింజలు శరీరం నుంచి విషాన్ని బయటకు పంపించడంలో సహాయపడతాయి. మెంతి గింజలను తీసుకోవడం ద్వారా పేగులలో పేరుకుపోయిన మురికి బయటకు వస్తుంది. జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది.
5. పసుపు :
పసుపులో అద్బుత ఔషధగుణాలు ఉంటాయి. ఇది యాంటీబయాటిక్, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థపై దాడి చేసే మూలకాల నుంచి మన వ్యవస్థను సురక్షితంగా ఉంచుతుంది.
0 Comments