GET MORE DETAILS

షోడశోపచారాలు అంటే ఏమిటి ?

షోడశోపచారాలు అంటే ఏమిటి ?




   దేవుడు , ప్రకృతి శక్తీ. ప్రకృతి లో ఉండే ప్రతి భాగమందు నిండి యున్నాడు. మీరు ఏ రూపమున ధ్యానించిన, ప్రార్ధించిన ఆ రూపమున మిమ్ములను ఆదుకొనును . మీరు చేయు కార్యములందు, మీ జీవనమునందు , మీకు తోడై, నీడై మిమ్ములను రక్షించును. దేవుని యెడల విశ్వాసము లేకుండా ... సంస్కృతి, పూజలు, ప్రార్ధనలు, సంప్రదాయాలు  పాటించిన వ్యర్ధము, నిరుపయోగము. కావున అందరు మొదట దేవుని యెడల నమ్మకము, భక్తి కలిగి ఉండవలెను , తప్పనిసరి అదే శ్రేయస్కరము.

 మీరు చేయవలసిన పని, ప్రయత్న లోపము లేకుండా చేయండి, ఫలితము భగవంతునికి వదిలి వేయండి. మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ ప్రతిఫలము పొందుటకు, భగవంతుడిని ఆరాధించండి

భగవంతునికి చేయు ఉపచారాలే షోడశోపచారాలు.

భగవంతునికి చేయు సేవలే షోడశోపచారాలు.

   ఈ సేవల యందు  భగవంతుని మనం అతిధి గా భావిస్తాము.  ఇవి 16----భక్తుడు తన ఆత్మ తృప్తి కోసం, అంత మహా శక్తీ ని దగ్గరనుండి సేవించే  శక్తీ లేక, భగవంతుని ఆత్మ రూపాన, ప్రసన్నం చేసుకుని, సేవించుటయె  షోడశోపచారాలు.

1. ఆహ్వానించుట = ఆవాహనం  అనే ఉపచారం.

2. ఆసన ఇవ్వటం = ఆసనం అనే ఉపచారం.

3. కాళ్ళకు నీళ్ళు ఇవ్వటం  = పాద్యం అనే ఉపచారం.

4. చేతులకు నీళ్ళు ఇవ్వటం = అర్ధ్యం అనే ఉపచారం.

5. త్రాగుటకు నీళ్ళు ఇవ్వటం = ఆచమనీయం అనే ఉపచారం.

6. స్నానమునకు నీళ్ళు ఇవ్వటం = స్నానం అనే ఉపచారం.

7. వస్త్రం ఇవ్వటం = వస్త్రం అనే ఉపచారం.

8. యజ్ఞోపవీతం ఇవ్వటం = యజ్ఞోపవీతం అనే ఉపచారం.

9.  గంధం ఇవ్వటం = ఇదొక, ఉపచారం.

10. పుష్పం  ఇవ్వటం = ఇదొక ,ఉపచారం.

11. సుగంధం కొరకు ధూపం = వేరొక ఉపచారం.

12. దీపం వెలిగించటం ( మంగళ హారతి ) = ఇదొకఉపచారం.

13. నైవేద్యం సమర్పించటం = వేరొక ఉపచారం.

14. తాంబూలాన్ని సమర్పించటం = వేరొక ఉపచారం.

15. నమస్కారం సమర్పించటం = ఇదొక ,ఉపచారం.

16. ఉద్వాసనం సమర్పించటం =ఇదొక ,ఉపచారం  .

వీటితో పూజ ముగియును . ఇవన్ని భక్తి శ్రేద్దలతో చేసేవి కాని యాంత్రికం గా  చెేసేవికావు.

Post a Comment

0 Comments