ఏలినాటి శని నుండి ఎవరు తప్పించుకుంటారు?
లక్ష్మీలలితా వాస్తు జ్యోతిషాలయంశ్రీనివాససిద్ధాంతి9494550355
శని భగవానుడు అంటేనే కర్మ కారకుడు ఎవరైతే కర్మ అనుభవించాలో వారికి కచ్చితంగా శని భగవానుడు కర్మ ఫలితాలను ఇస్తారు. ఒక జాతకుడికి ఏలినాటి శని జన్మశని అష్టమ శని వంటివి జరుగుతూ ఉన్నప్పుడు వారి కష్టాలు తారాస్థాయిలో ఉంటాయి.
ఏలినాటి శని అంటేనే అందరూ భయపడుతూ ఉంటారు. కానీ ఏలినాటి శని వచ్చినప్పటికీ కొందరు జాతకులకు ఎటువంటి సమస్యలు రావు. కొందరికి అయితే ఏలినాటి శని వచ్చి వెళ్లినట్టు కూడా తెలియదు అంత సంతోషకరంగా వారి జీవితం కొనసాగుతుంది.
ఎటువంటి జాతకులు ఏలినాటి శని అష్టమ శని జన్మ శని నుండి తప్పించుకుంటారు. జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత సూక్ష్మ విషయాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం.
ఏలినాటి శని గోచార రీత్యా పరిశీలన చేస్తుంటారు. లగ్నంలో చంద్రుడు శని భగవానుడు అత్యంత బలంగా ఉన్నప్పుడు వీరిపై ఏలి నాటి శని ప్రభావం ఉండదు. ఉదాహరణకు చంద్రుడు శుక్లపక్ష చంద్రుడు, స్వక్షేత్రం శుభగ్రహ దృష్టి, ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఈ జాతకులపై ఏలినాటి శని అష్టమ శని జన్మశని సమస్యలు ఉండవు. శని భగవానుడు లగ్న శుభ గ్రహం అయినప్పుడు ఏలి నాటి శని, జన్మశని అష్టమశని సమయంలో ఇటువంటి సమస్యలు వీరికి రావు. వృషభ లగ్నం మిధున లగ్నం తులా మకర కుంభ లగ్నాలకు శని భగవానుడు లగ్న శుభుడు.
ఈ జాతకులపై శని భగవానుడు ఎటువంటి సమస్యలను ఇవ్వరు. ఏలినాటి శని అష్టమ శని జన్మ శని జరిగే సమయంలో గురువు యొక్క దృష్టి శని భగవానుడు పై ఉన్నప్పుడు పై సమయాలలో వ్యాపారము ఉద్యోగము వంటి అవకాశాలు కూడా ఇస్తుంటారు. జాతకుడు వాటిని సద్వినియోగం చేసుకున్నప్పుడు జీవితంలో స్థిరపడే అవకాశం కూడా ఉంటుంది. శని భగవానుడు శుభగ్రహ స్థానంలో ఉన్నప్పుడు గురు భగవాన్ యొక్క దృష్టి ఉన్నప్పుడు ఏలినాటి శని సమయంలో శని భగవానుడు ఎక్కువగా ఇబ్బందులకు గురి చేయరు.
రెండవసారి ఏలినాటి శని వస్తే దానిని పొంగు శని అంటారు ఈ సమయంలో శని భగవానుడు మీ సామర్థ్యానికి సరైన గుర్తింపును ఇస్తారు. ఉద్యోగ వ్యాపార లలో స్థిరపడే అవకాశాన్ని ఇస్తారు. ఏలినాటి శని ప్రవేశించింది అని అందరూ భయపడవలసిన పనిలేదు. కొంతమంది జాతకులు శని భగవానుడు దృష్టి నుండి తప్పించుకుంటారు. మరికొందరు చిన్న చిన్న పరిహారాలు పాటించిన కారణంగా శని భగవాన్ యొక్క సమస్యల నుండి తప్పించుకునే అవకాశం ఉంది.
0 Comments