బెల్లం - మన ఆరోగ్యం - మన ఆహారం
➤ బెల్లంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్న విషయం తెలిసిందే. శరీరంలో హిమోగ్లోబిన్ పెంచడంలో బెల్లం సహయపడుతుంది. ప్రతి రోజు ఉదయాన్నే బెల్లం తీసుకోవడం వలన అనేక లాభాలున్నాయి. అలాగే నెయ్యి కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నెయ్యి, బెల్లం కలిపి తీసుకుంటే అనేక లాభాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం
➤ మధ్యాహ్న భోజనం తర్వాత నెయ్యి, బెల్లం కలిపి తీసుకోవచ్చు. ఒకవేళ ఆ సమయంలో భోజనం తర్వాత బెల్లం, నెయ్యి కలిపి తీసుకోకపోతే రాత్రిళ్లు తీసుకోవచ్చు. ఒక స్పూన్ నెయ్యిని తీసుకుని అందులో చిన్న బెల్లం ముక్క వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి 5 నుంచి 10 నిమిషాల తర్వాత తినాలి.
➤ బెల్లెంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటిమన్స్ బి, సీ వంటి అనేక పోషకాలున్నాయి. నెయ్యిలో విటమిన్ ఏ, కె, ఈ, డీలతో పాటు దేశీ నెయ్యిలో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. బెల్లం, నెయ్యి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మం, జట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహయపడుతుంది.
➤ నెయ్యి, బెల్లం కలిపి తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా శరీరంలోని హార్మోన్ల అసమతుల్యతను కాపాడడంలో సహాయపడతాయి. అలాగే శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది. శరీరం, చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది.
0 Comments