బాగా వర్షం వచ్చేప్పుడు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు. ఎందుకు...?
సాధారణ వర్షం కురిసేప్పుడు విద్యుత్ సరఫరాను ఆపరు. కేవలం మెరుపులు, వేగంగా వీచే గాలులతో కూడిన భారీ వర్షాలు వచ్చినప్పుడు మాత్రమే ఇలా చేస్తారు. బాగా మెరుపులు వచ్చేప్పుడు అవి విద్యుత్ తీగలను తాకితే వేల ఓల్టుల విద్యుత్ శక్మం (electrical potential) తీగల ద్వారా ఇళ్లు, సబ్‌స్టేషన్లలోకి ప్రసరించే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల విద్యుత్ సాధనాలు, పరికరాలు పాడయిపోతాయి. విద్యుత్‌ను ముందుగానే ఆపితే నష్టం కొంత నివారణ అవుతుంది. పెనుగాలులు వీచేప్పుడు చెట్లు, స్తంభాలు కూలిపోయి వైర్లు కలిసి విద్యుత్ హ్రస్వ వలయం (electrical short circuit) ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది.
0 Comments