GET MORE DETAILS

పసుపు రంగు గాజు పెట్టెలు బొద్దింకలకు బోనుల్లాగా పనిచేస్తాయి ఎందుకు ?

 పసుపు రంగు గాజు పెట్టెలు బొద్దింకలకు బోనుల్లాగా పనిచేస్తాయి ఎందుకు ?



మనం చూడగలిగినట్టు ప్రాణులన్నీ వివిధ రంగులను చూడలేవు. బొద్దింకలు (కాక్రోచ్‌) పసుపు రంగును చూడలేవు. ఎందుకంటే వాటి కళ్లలో ఆ రంగు పౌనఃపున్యానికి స్పందించే కణాలు ఉండవు. అందువల్ల వాటికి పసుపు రంగు నలుపుగా కనిపిస్తుంది. అందువల్లనే పసుపు రంగు గాజు పెట్టెను అవి చీకటి ప్రాంతంగా భ్రమించి అక్కడ క్షేమంగా దాక్కోవచ్చనే భావనతో అందులోకి చేరుకుంటాయి. అందుకనే ఆ రకమైన పెట్టెలను వాటికి బోను (trap)ల్లాగా ఉపయోగించి వాటి బెడదను వదిలించుకుంటారు.

Post a Comment

0 Comments