బీడీఎస్ విద్యార్థులకు ఎంబీబీఎస్‌లోకి నో ఎంట్రీ !
దంత వైద్య విద్యార్థులకు ‘పోస్టు బీడీఎస్- మెడికల్ బ్రిడ్జి కోర్సు’ ప్రతిపాదనను జాతీయ వైద్య కమిషన్ తిరస్కరించింది. బీడీఎస్ పూర్తయిన విద్యార్థుల్లో ఆసక్తి ఉన్న వారు మూడేళ్ల వ్యవధి కలిగిన ‘పోస్టు బీడీఎస్-మెడికల్ బ్రిడ్జి కోర్సు’ చదివితే ఎంబీబీఎస్ పూర్తిచేసినట్లు గుర్తించేలా దంత వైద్య మండలి ముసాయిదా రూపొందించింది. ఆ ముసాయిదాను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జాతీయ వైద్య కమిషన్‌కు 2017లో పంపింది. బ్రిడ్జి కోర్సు ద్వారా ఎంబీబీఎస్ చదివేందుకు అవకాశం కల్పిస్తే ‘బ్యాక్ డోర్ ఎంట్రీ’లాగా ఉంటుందని సభ్యులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలా చేస్తే నర్సింగ్, ఇతర వైద్య కోర్సుల్లో చదివే వారి నుంచీ బ్రిడ్జి కోర్సు డిమాండ్లు వస్తాయని పేర్కొన్నారు. చివరికి 29 మంది సభ్యుల ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
0 Comments