GET MORE DETAILS

బార్ కోడ్స్ఎందుకు ఉపయోగిస్తారు ?

బార్ కోడ్స్ఎందుకు ఉపయోగిస్తారు ?




🟩 రకరకాల ఫ్యాన్సీ, స్టేషనరీ వస్తువుల నుండి పచారీ సరుకుల వరకు అన్నింటి ప్యాకింగ్‌లపై ఈ మధ్య కనిపిస్తున్న నల్లని గీతలను 'బార్ కోడ్స్' అంటారు. 

✅ వీటిలో ఆయా వస్తువులకు సంబంధించిన వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. బార్ కోడ్‌లోని వివరాలను స్కానర్ లేదా రీడర్ అనే యంత్రం సాయంతో తెలుసుకోవచ్చు. కంప్యూటర్‌తో అనుసంధానించి ఉండే ఈ స్కానర్ ద్వారా వివరాలు 0,1 సంఖ్యలు ఉండే బైనరీకోడ్ రూపంలో తెరపై పడతాయి.

✅ ఈ కోడ్‌తో సరితూగే సమాచారాన్ని కంప్యూటర్ అందిస్తుంది. వస్తువులపై ఉండే బార్‌కోడ్‌ను స్కానర్ ఎదుట పెట్టగానే, స్కానర్ నుంచి వచ్చే లేజర్ కిరణాలు దానిపై పడి పరావర్తనం చెందుతాయి. స్కానర్‌లోని దర్పణం ఆ సంకేతాలను కంప్యూటర్‌కు పంపుతుంది. కంప్యూటర్‌లో ఇవి విద్యుత్‌సంకేతాలుగా మారి తెరపై 0,1 సంఖ్యల రూపంలో కనిపిస్తాయి.

✅ బార్ కోడ్‌లో ఆ వస్తువు ఏ దేశంలో ఎప్పుడు తయారైనదో, ఎవరు దానిని ఉత్పత్తి చేశారో, ధర ఎంతో లాంటి వివరాలు ఉంటాయి. బార్ కోడ్‌లలో అనేక రకాలు ఉంటాయి. కోడ్‌లలో గీతలకింద సంఖ్యలతో సూచిస్తారు. ఉదాహరణకు సాధారణంగా మార్కెట్లో కనిపించే వస్తువులకు చెందిన కోడ్ (యూనివర్సల్ ప్రోడక్ట్ కోడ్) 12 అంకెల్లో ఉంటుంది.

✅ ఇందులో మొదటి అంకె ఆ వస్తువు తయారైన దేశపు కోడ్‌ను, తర్వాత అయిదు అంకెలు ఉత్పత్తిదారు కోడ్‌ను, ఆ తర్వాత అయిదు అంకెలు వస్తువు వివరాలను తెలుపుతాయి. చివరి అంకె ఆ కోడ్ కచ్చితత్వాన్ని చెబుతుంది. కంప్యూటర్‌లోకి ముందుగానే ఎక్కించిన వివరాలన్నీ ఈ కోడ్‌ను స్కానర్ చదవగానే తెరపై కనిపిస్తాయి.

✅ ఈ విధానం వల్ల ఒక్కో వస్తువు ధరను వేరువేరుగా చూసుకోవడం, వాటి ధరలను విడివిడిగా రాయడం వంటి పనులు తప్పి సమయం ఆదా అవుతుంది. రోజు మొత్తం మీద ఏయే వస్తువులు అమ్ముడయ్యాయో, ఆదాయమెంతో లాంటి వివరాలు కూడా కచ్చితంగా క్షణాలమీద తెలుస్తుంది.

Post a Comment

0 Comments