GET MORE DETAILS

ఏనుగులు గుర్రాల వర్తకంచేసి నష్టపోయిన కౌముది అప్పుశెట్టి.

 ఏనుగులు గుర్రాల వర్తకంచేసి నష్టపోయిన కౌముది అప్పుశెట్టి.


KALAMMA PALAKA OF PAÑCHANANA VISWAKARMA OF VIJAYANAGARA PATTANA




This office received a  photograph of a copper plate  inscription which is very interesting and  typical in its execution.

On obverse there is a depiction  of the  Goddess of pañchānanas on the  top  and just below it on either sides  depicted with the Gods  Viswakarma and Ganesha and also  the equipments of their profession. At the bottom there is depiction of a person holding a horse and an  elephant.

This copper plate was jointly issued by Five  Panchanana (Visvakarmas) communities and Seventy four āchānalu  of Vijayanagara pattana in saka year 1578  (= AD1656). 

It is engraved in Telugu language and characters.

It records that a Marchant by name  Kaumudi Appu setti who lost heavily in his business of selling Horses and Elephants   at Achyutadēvarāya (not known) in the town of Vijayanagara. 

He was neglected by his own relatives when he approached them for help. But An Acharya of Pañchānana Viswakarma adopted him as a son and decided to  make him free from all his debts by paying 12000 mādalu in addition to that given  2 rūkalu for his marriage on an auspicious day 14th Monday in the Chaitra month of the cyclic year Raktākshi.

 At the end there is a imprecatory verse says that no one  should  try to beat, scold, curse and entrust  him to the officers of Diwanam; if anyone do so their family will be destroyed.

This copper plate inscription was composed  and named as "KALAMMA PALAKA"  by a Gopālachāri who was son of  Alwār Pandita of Tiruvanamdu.


Dr.Munirathnamreddy, 

Director of Epigraphy, 

Archealogical Survey of India, Mysuru, 

phone +919741516983


ఇటీవల బాగా ఆసక్తిని కలిగించే తామ్రశాసన ప్రతులు డా॥ మునిరత్నంరెడ్డి గారి వద్దకు రావడం జరిగింది. తామ్రశాసనంలోని అంశాలు చాలా అసక్తికరంగా వున్నట్లు డా॥మునిరత్నంరెడ్డిగారు తెలియచేస్తూ, అందులోని అంశాలను ఈ విధంగా వివరించడం జరిగింది. శాసనకాలం 1656, శాసనం పేరు కాళమ్మపలకం, శాసనకర్త > తిరువనందాళ్వారు కుమారుడైన గోపాలాచారి. అందులోని భాష,లిపి > తెలుగు.

గతంలో కౌముది అప్పుశెట్టి అనే యువకుడు గుర్రాలు ఏనుగుల వర్తకం చేస్తువాటిని విజయనగరపట్టణంలోవున్న అచ్యుతరాయలకు  అమ్మేవాడు. కాలం కలిసిరాక వ్యాపారంలో బాగా నష్టపోవడం జరిగింది. నష్టపోయిన అప్పుశెట్టి ఆదుకోవాలని బంధువులను ఆశ్రయించాడు. అయితే బంధువులెవరు ఇతనిని చేరదీయలేదు.

కాని  పంచాణం విశ్వకర్మ కులానికి చెందిన ఆచారి ఒకరు అతనిని దత్తు తీసుకొని అతనికున్న బుుణాలను తీర్చుటకుగాను 12000 మాడలను, రక్తాక్షినామ సంవత్సరం చైత్రమాసం సోమవారంనాడు అప్పుశెట్టి పెండ్లినిమిత్తం 12 రూకలను కూడా ఇవ్వడం జరిగింది.

ఇలా అప్పుశెట్టిని ఆదుకొన్న విషయాన్ని  శాలివాహన శకసంవత్సరం 1578 (1656 ACE/AD) తేదీన పంచాణం కులావారితోను, డైబ్బైరెండు ఆచార్ల ఉపకులాలతోను కలిపి సంయుక్తంగా తామ్రశాసనం ద్వారా  తెలియచేయడం జరిగింది.

ఇక శాసనంలో పేర్కొన్న పంచాణం వారు ఎవరంటే వారు శూద్రలైన ఐదు ప్రధాన కులాలవారు. వారెవరంటే (1) కంసాలి > బంగారుపనివారు (2) వడ్రంగి > కర్రనామానులు చేయువారు > వ్యవసాయ, గృహోపకరణాలు, దారు(చెక్క) శిల్పాలు తయారుచేసేవారు, (3) కంచరి > కంచుపనివారు > గృహోపకరణలైన కంచుపాత్రలు > కంచు, పంచలోహవిగ్రహాల తయారీదారులు (4) కమ్మరి > ఇనుముపనివారు > వ్యవసాయానికి, గృహనిర్మాణాలకు అవసరమయ్యే పనిముట్లు,కొండకచో ఆయుధాల తయారీదారులు (5) కాసెవారు > శిల్పులు > దేవాలయ, విగ్రహనిర్మాతలు.

74 ఆచార్లవారంటే, ప్రతికులంలోను వారుచేస్తున్న వృత్తి, ప్రాంతం, ఆచారాలు, సాంప్రదాయాలు,గోత్రాలు మొదలైన వాటి ఆధారంగా  ఉపకులాలు (Sub Divisions or Subcastes)  ఏర్పడి వుంటాయి. కొంతమంది కంసాలులలో పేరు చివర ఆచారి అని వుండడం సహజం. అచారి అంటే వృత్తిలో నిష్ణాతుడని అర్థం.ఈ పంచాణంవారిలో కూడా 74 మంది ఉపకులాలవారున్నారు. వారందరిని (5+74 = 79) కలుపుకొని ఈ తామ్రశాసనాన్ని ఇవ్వడం జరిగింది.

ఇక తామ్రశాసనంలో  ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దీనికి కాళమ్మపలకమని నామకరణం (Nominclature) వుండటం, శాసనకర్తపేరు  అగ్రభాగాన వుండడం, పంచాణంవారి కులదైవమైన కాళికాదేవిని హనుమంతుడు మరోస్త్రీ అర్చించడం, కాళికాదేవికి కుడిప్రక్కన చంద్రుడు, ఎడమవైపున సూర్యుని చిత్రాలు వుండటం అనగా సూర్యచంద్రులు నిలచివున్నంతకాలం ఈ శాసనం అమలులో వుంటుందని తెలియచేయడం.

ఇక శాసనంలో పంచాణం, ఆచార్ల వృత్తులకు చెందిన విశ్వకర్మ చిత్రం ఐదుశిరస్సులతోనుండటం ప్రత్యేకమని చెప్పుకోవాలి. విశ్వకర్మ, మయుడు వాస్తుపురుషులు. వాస్తువు అంటే ఇప్పటిలా అసంపూర్ణవిజ్ఞానంతో, స్వార్థం స్వలాభంకోసం మూఢనమ్మకాలను జోడించినవారుకారు. విశ్వకర్మ ఒక దేవుడు. ఇతని గురించి బుుగ్వేదంలో రామాయణభారతాది ఇతిహాసాలలో ప్రస్తావనలున్నాయి.

విశ్వకర్మ శ్రీలంకనగరాన్ని ద్వారకను, ఇంద్రుడికి వజ్రాయుధాన్ని మొదలైన వాటిని నిర్మించిన గొప్ప ఇతిహాసపురుషుడు. కనుకనే పంచాణం వారు, వారి ఉపకులాలైన ఆచార్లు ఇతనిని తమ వృత్తికి దైవంగా స్వీకరించడం జరిగింది.

మరో గొప్ప ఆశక్తికరమైన విషయం ఏమిటంటే తామ్రశాసనంలో పంచాణంవారి పనిముట్లను పెర్కొనడం. 

మొదటగా కంసాలుల > స్వర్ణకారుల పనిముట్లైన చిన్నసుత్తి, మూసలు, పట్టకారులు

రెండవదిగా వండ్రంగుల పనిముట్లైన బాడిస, కొడితి, దాగలి చిత్రికరించివుండటం

మూడవదిగా కంచరిగారుల పనిముట్లైన సుత్తి, దాగలి, విభిన్నమైన పట్టకారులు చిత్రికరించివుండడం,

నాలుగవదిగా కాసెవారి(శిల్పుల) పనిముట్లైన శానం, పట్టకారులు చిత్రికరించివుండటం

ఐదవదిగా  కమ్మరుల పనిముట్లైన సుత్తి, సమ్మెట, చిన్నది,పెద్దదైన దాగలులు, విభిన్నమైన పట్టకారులు వుండటం ప్రత్యేకమని డా॥రెడ్డిగారు అభిప్రాయపడ్డారు.

శాసనంలో పూర్తిగా దిగువన అప్పుశెట్టి పగ్గాలతో గుర్రం(ఒంటె ?) ను ఏనుగును పట్టుకొని వుండటం, అతని వర్తకాన్ని సూచించడం మరో ప్రత్యేకం.

ఇకపోతే శాసనంలో పెర్కొన్న విజయనగరపట్టణమనేది విజయనగరచక్రవర్తుల రాజధాని (హంపి ) కాదు, శాసనంలో చెప్పిన అచ్యుతదేవరాయలు కూడా విజయనగర చక్రవర్తికాదు.  

కనుక విజయనగరపట్టణమనేది ఏది ? గుర్రాలను ఏనుగులను కొన్న అచ్యుతరాయలు ఎవరనేది చరిత్రకారులు పరిశీలించాలి. 

మీప్రాంతంలో మీకు తెలిసినవారి వద్ద చారిత్రిక అంశాలుదాగున్న శిలాశాసనాలు, తామ్రశాసనాలు వుండవచ్చు. మీ ప్రాంతచరిత్రను శోధించి వెలువరించటానికి ఇలాంటివి ఖచ్చితమైన ఆధారాలు. కనుక వాటి ప్రతులను (ఫోటోల) తీసి కేంద్రప్రభుత్వ శాసనపరిశోధనా సంచాలకులైన డా॥ మునిరత్నంరెడ్డిగారి పైన తెలిపిన చరవాణి వాట్సాఫ్ కు పంపండి.


॥అనువాదం,అదనపు,సమాచారం॥ 

.జిబి.విశ్వనాథ, 9441245857, అనంతపురం.

Post a Comment

0 Comments