దంపతులు ఒకే కంచంలో కలిసి తింటున్నారా..? అయితే ముద్దుమురిపెం కష్టమేనట.
కొత్తగా పెళ్లైన జంటలు కావొచ్చు, చాలా మంది దంపతులు కావొచ్చు, కలిసి భోజనం చేసేందుకు ఇష్టపడుతుంటారు. అది కూడా ఒకే కంచంలో కలిసి తినేందుకు మక్కువ చూపిస్తారు. కానీ ఇది ప్రమాదం అని వాస్తు పండితులు హెచ్చరిస్తున్నారు. ఇలా ఒకే ప్లేట్‌లో దంపతులు కలిసి భోజనం చేయడం వల్ల దాంపత్య జీవితంలో సమస్యలు తలెత్తుతాయని పండితులు పేర్కొంటున్నారు.
పూర్వకాలంలో కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకేసారి భోజనం చేసేవారు. దీంతో కుటుంబ బంధాలు బలోపేతం అయ్యేవి. రానురాను ఈ సంప్రదాయం కనుమరుగైంది. ఎవరికి ఇష్టమున్నప్పుడు వారు భోజనం చేసి కడుపు నింపుకుంటున్నారు. అయితే కొంత మంది దంపతులు మాత్రం ఇప్పటికీ కలిసే భోజనం చేస్తున్నారు. అది కూడా ఒకే కంచంలో భోజనం చేసేందుకు మక్కువ చూపిస్తున్నారు దంపతులు. అయితే ఇలా ఒకే ప్లేట్‌లో కలిసి భోజనం చేయడం మంచిది కాదని వాస్తు పండితులు అంటున్నారు. దీని వల్ల కుటుంబంలో ఆర్థిక సమస్యలు తలెత్తడంతో పాటు, భార్యాభర్తల మధ్య గొడవలు చోటు చేసుకుంటాయని పండితులు హెచ్చరిస్తున్నారు.
ఒకే కంచంలో భోజనం ఎందుకు వద్దంటే..?
చాలా మంది దంపతులు తమ ప్రేమకు చిహ్నంగా ఒకే కంచంలో భోజనం చేసి.. దాంపత్య జీవితాన్ని బలోపేతం చేసుకుంటారు. మధురానుభూతులు పొందుతారు. అయితే ఇది వాస్తు ప్రకారం శుభప్రదం కాదు. దంపతులు ఒకే కంచంలో భోజనం చేయడం వల్ల కుటుంబంలోని ఇతర సభ్యులకు వీరిపై అసూయ ఏర్పడుతుంది. దీంతో కుటుంబ సభ్యుల మధ్య వివక్ష ఏర్పడుతుంది. అశాంతి నెలకొంటుంది. ఫలితంగా దంపతుల సుఖమయ జీవితానికి ఎన్నో అవరోధాలు ఏర్పడుతాయి. చివరకు ప్రతికూల శక్తులు పెరిగి ముద్దుముచ్చటకు కూడా దూరమవుతారట. తస్మాత్ జాగ్రత్త.
మంచం మీద కూర్చుని తింటున్నారా?
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే చాలా మంది టీవీ చూస్తూనో లేదా సోమరితనంతోనో మంచం మీద కూర్చుని భోజనం చేస్తారు. వాస్తు శాస్త్రం దీనిని తీవ్రంగా ఖండిస్తోంది. భోజనాన్ని దేవుని నైవేద్యంగా భావించాలి. నిద్రించే మంచంపై కూర్చుని తినడం అన్నపూర్ణ దేవిని అవమానించినట్లే అవుతుంది. మంచం మీద కూర్చుని తినడం వల్ల ఇంట్లో లక్ష్మీ దేవి నిలవదని, ఇది ఆర్థిక అస్థిరతకు, దారిద్య్రానికి దారితీస్తుందని వాస్తు హెచ్చరిస్తోంది.
క్యాలెండర్‌తో భార్యాభర్తల బంధం బలోపేతం? ఇది ఎంత వరకు నిజం.
ప్రతి ఇంట్లో క్యాలెండర్ ఉంటుంది. కానీ దాన్ని వాస్తు నియమాలకు అనుగుణంగా ఉంచరు. ఏ దిశలో అంటే ఆ దిశలో వేలాడదీస్తుంటారు. ఇలా చేయడం వల్ల దంపతుల మధ్య కలహాలు ఏర్పడుతాయట. మరి భార్యాభర్తల బంధం బలోపేతం కోసం ఏ దిశలో క్యాలెండర్ వేలాడదీయాలో ఈ కథనంలో తెలుసుకుందాం. క్యాలెండర్‌తో భార్యాభర్తల బంధం బలోపేతం ఏంటని మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. కానీ ఇది అక్షరాల నిజం. ఎందుకంటే క్యాలెండర్ విషయంలో వాస్తు నియమాలు పాటిస్తే ఆ ఇంటి దంపతుల బంధం బలోపేతం కావడమే కాదు.. నిత్యం ఇరువురి మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయని వాస్తు పండితులు చెబుతున్నారు. సుఖసంతోషాలతో మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతారట.
అయితే క్యాలెండర్‌ను గోడకు వేలాడదీసే విషయంలో వాస్తు నియమాలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు. ఈ క్యాలెండర్‌కు ఇంట్లోకి సానుకూల శక్తిని ప్రసరింపజేసే సామర్థ్యం ఉందట. అందుకే సరైన దిశలో క్యాలెండర్‌ను వేలాడదీయకపోతే ప్రతికూల శక్తి పెరిగి, దంపతుల మధ్య కలహాలకు కారణమవుతుందట. అంతేకాదు ఆ ఇంట ఆర్థిక సంక్షోభం ఏర్పడి.. చేసే ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతాయట. కాబట్టి క్యాలెండర్‌ను ఇంట్లో ఏ దిశలో వేలాడదీస్తే మంచి జరుగుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం.
తూర్పు దిశ (East)
ఇంటికి తూర్పు ముఖంగా ఉన్న గోడపై క్యాలెండర్‌ను వేలాడదీయం వల్ల ఆ ఇంట్లో పురోగతి ఉంటుందట. జీవితంలో గొప్పగా ఎదుగుతారట. విజయాలు వరిస్తాయట. ఇక సూర్యోదయం వంటి చిత్రాలు ఉన్న క్యాలెండర్ ఉంటే సానుకూల శక్తి మరింత రెట్టింపు అవుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
ఉత్తర దిశ (North)
ఇక ఉత్తర దిశ గురించి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఉత్తర దిశను కుబేరుడి స్థానంగా భావిస్తారు. కాబట్టి ఈ దిశలో క్యాలెండర్‌ను వేలాడదీయడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందట. కొత్త ఆదాయ మార్గాలకు బాటలు వేస్తుందట. వృత్తిపరంగా గొప్ప స్థానాలకు ఎదుగుతారని పండితులు పేర్కొంటున్నారు.
ఈశాన్యం (Northeast)
ఇంట్లో గొడవలు లేకుండా, ప్రశాంతత నెలకొనాలంటే ఈశాన్య మూల ఉత్తమం. ఆధ్యాత్మిక చింతన, ధ్యానం, దైవ భక్తిని ప్రతిబింబించే చిత్రాలు ఉన్న క్యాలెండర్లను ఇక్కడ ఉంచడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుందట.
నైరుతి (Southwest)
నైరుతి దిశలో క్యాలెండర్ ఉండడం వల్ల కుటుం సభ్యుల మధ్యనే కాదు.. మరి ముఖ్యంగా దంపతుల మధ్య బంధాలు బలోపేతం అవుతాయట. ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయట. కుటుంబ చిత్రాలు లేదా ఆహ్లాదకరమైన ప్రకృతి దృశ్యాలు ఉన్న క్యాలెండర్లు ఇక్కడ ఉంచితే కుటుంబంలో ఐక్యత పెరుగుతుందట.
.jpeg)
0 Comments