AP SSC RESULTS 2022 RELEASED
ఎట్టకేలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు పది పరీక్ష ఫలితాలు విడుదల చేశారు.
ఇప్పటికే అధికారులు, మంత్రి, సిఎంవోల సమన్వయ లోపంతో ఒకసారి వాయిదా పడ్డాయి. శనివారం చివరి క్షణంలో ఫలితాలు వాయిదా పడడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిరాశకు లోనయ్యారు. ఫలితాల విడుదలపై రోజుకో మాట చెప్పడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య సోమవారం విడుదల చేసే ఫలితాలు గ్రేడ్‌ల రూపంలో కాకుండా మార్కుల రూపంలో ఉంటాయని అధికారులు తెలిపారు. ఫలితాలను http://www.results.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చన్నారు.
0 Comments