GET MORE DETAILS

నీళ్ల నిల్వకు ఏ సీసా ఉత్తమం?

 నీళ్ల నిల్వకు ఏ సీసా ఉత్తమం?



నం తాగే నీటితో, ఆ నీటిని నింపుకునే సీసా కూడా ఆరోగ్యకరమైనదై ఉండాలి. నీళ్ల కోసం ఉపయోగించే సీసా తయారీ పదార్థం మన ఆరోగ్యంతో పాటు, నీటి రుచిని కూడా ప్రభా వితం చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. రాగి, గాజు, ప్లాస్టిక్ బాటిళ్ల వెనుక ఉన్న నిజా లేంటో తెలుసుకుందాం.

రాగి బాటిళ్లు

రాగి పాత్రలో సుమారు 16 గంటలపాటు నీటిని నిల్వ ఉంచితే అందులోని కాపర్ అయాన్లు హానికారక 'ఇ-కొలై', 'సాల్మొనెల్లా' వంటి బ్యాక్టీరి యాను చంపేస్తాయి. ఇది రోగ నిరోధకశక్తిని పెంచడానికి, జీర్ణక్రియ మెరుగుపడటానికి దోహదం చేస్తుంది. దీనివల్ల వాంతులు, కడుపులో తిప్పడం, కడుపునొప్పి వంటి ఇబ్బందులు తలెత్త వచ్చు. రాగిబాటిళ్లలో నిమ్మరసం వంటి ఆమ్ల గుణం ఉన్న పానీయాలను నిల్వ చేయకూడదు

గాజు బాటిళ్లు

ఆరోగ్య నిపుణుల దృష్టిలో గాజు బాటిళ్లు అత్యంత సురక్షితమైనవి. ఇవి ఎటువంటి రసా యన చర్యలకు లోను కావు. వీటి వల్ల నీటి రుచి మారదు ప్లాస్టిక్లో ఉండే బిస్పినాల్ ఎ లాంటి హానికారక రసాయనాల భయం గాజుతో ఉండదు. బోరోసిలికేట్ గ్లాస్ అయితే వేడి, చల్లని పానీయాలను తట్టుకుంటుంది. అయితే గాజు బాటిళ్ల మూతలకు ప్లాస్టిక్ కోటింగ్ ఉంటే మూత తీసేటప్పుడు కలిగే ఘర్షణ వల్ల మైక్రోప్లాస్టిక్స్ నీటిలో కలిసే అవకాశం ఉందని ఇటీవలి పరిశోధ నలో వెల్లడైంది. కాబట్టి మెటల్ లేదంటే సిలికాన్ మూతలు ఉన్న గ్లాస్ బాటిళ్లను ఎంచుకోవడం మంచిది.

ప్లాస్టిక్ బాటిళ్లు

తక్కువ ధర, తేలికగా ఉండటం వల్ల ప్లాస్టిక్ బాటిళ్లను ఎక్కువగా వాడుతుంటాం. కానీ ఇవి ఆరోగ్యానికి పెను ముప్పు కలిగిస్తాయి. వీటిలో ఉండే బిస్పినాల్ ఎ హార్మోన్ల అసమతుల్యతకు, గర్భిణులలో ఆరోగ్య సమస్యలకు కారణమవు తుంది. ప్లాస్టిక్ బాటిళ్లపై 'బిపిఎ ఫ్రీ' అని రాసి ఉన్నప్పటికీ అవి పాతబడే కొద్దీ రసాయనాలను విడుదల చేస్తాయి. కాబట్టి వీటిని వాడకపోవ డమే మంచిది.

Post a Comment

0 Comments