లవంగాలతో లాభాలెన్నో...
వంటకాలకు రుచిని సువాసనను అందించే మసాల దినుసుల్లో లవంగాలు ప్రధానమైనవి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు...
▪️జీర్ణక్రియ వేగవంతమవుతుంది. కడుపులో ఆమ్లత్వం తగ్గుతుంది.
▪️చలికాలంలో వేధించే దగ్గు, గొంతు నొప్పి, ఇతర శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
▪️లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచుతాయి. ఇన్సులిన్ పనితీరును పెంచి రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా కాపాడతాయి. కాలేయం ఆరోగ్యంగా పనిచేసేందుకు తోడ్పడతాయి.
▪️రాత్రి పడుకునే ముందు రెండు లవంగాలు నమిలి తింటే జీర్ణక్రియ వేగవంతమవుతుంది. మలబద్దకం సమస్య తీరుతుంది.
▪️లవంగాల్లో ఉండే మాంగనీస్. ఎముకల నిర్మాణానికి, బలోపేతానికి తోడ్పడుతుంది.
▪️రెండు లవంగాలను నోటిలో ఉంచుకుని చప్పరించడం వల్ల దంతాల నొప్పి, చిగుళ్ల వాపు తగ్గుతాయి. నోటి దుర్వాసన తొలగిపోతుంది.
▪️ఒక గ్లాసు గోరువెచ్చటి పాలలో పావు చెంచా లవంగాల పొడి, చిటికెడు పంచదార కలుపుకుని తాగితే తలనొప్పి మాయమవుతుంది.
▪️ఒక గ్లాసు మంచి నీటిలో నాలుగు లేదా అయిదు లవంగాలు వేసి బాగా మరిగించి తాగితే గుండెలో మంట, కడుపులో వికారం లాంటి సమస్యలు తగ్గుతాయి.
.jpeg)
0 Comments